ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

డోన్​లో 1100 గ్రాముల గంజాయి పట్టివేత - పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు - 1100 GRAMS GANJA FOUND IN DHONE - 1100 GRAMS GANJA FOUND IN DHONE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 6:01 PM IST

1100 Grams Ganja Found In Dhone: గంజాయి సరఫరా గురించి అందిన విశ్వసనీయ సమాచారంతో డోన్​ సీఐ ప్రవీణ్​కుమార్ తన సిబ్బందితో కలిసి ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 1100 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితులు ఇద్దరు స్నేహితులు. వీరు ఇంటర్, డిగ్రీ చదువుతూ చాలా కాలంగా గంజాయికి బానిసలై, వీరే ఇతరులకు సరఫరా చేస్తున్నారు. గంజాయికి అలవాటు పడిన విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి రిహాబిటేషన్ సెంటర్​కు పంపించే ఏర్పాట్లు చేశామని సీఐ తెలిపారు. 

గంజాయికి బానిసలైన వారు తల్లిదండ్రులు  వైద్యం అందించి బాగు చేయించాలని కోరారు. గంజాయి గురించిన సమాచారం ఇస్తే కచ్చితంగా డోన్ పట్టణంలో గంజాయి నిర్మూలన కోసం కృషి చేస్తామని పేర్కొన్నారు. నిందితులు తెలిపిన వివరాలు ప్రకారం పట్టణంలోని శ్రీరామనగర్​లో ఇద్దరు స్నేహితులు కలిసి గంజాయిని పత్తికొండ నుంచి డోన్​కి తీసుకుని వస్తారు. ఇక్కడి నుంచి అందరికీ గంజాయి తాగే యువకులందరికీ సరఫరా చేస్తున్నట్లు తెలిపారని సీఐ పేర్కొన్నారు. పట్టణంలో దాదాపు 20 మంది గంజాయికి బానిసలైనవారు ఉన్నారని, వీరి సమాచారాన్ని సేకరించి కౌన్సిలింగ్ ఇస్తామని సీఐ తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details