ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

100 కిలోల వెండి రథం - కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భక్తుల కానుక - 100 KG SILVER CHARIOT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 11, 2024, 5:33 PM IST

SILVER CHARIOT TO KANYAKA PARAMESWARI TEMPLE : అనకాపల్లి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి భక్తులు వెండి రథాన్ని బహూకరించారు. శతజయంతి ఉత్సవాల్లో భాగంగా భక్తులు, దాతల సాయంతో 100 కేజీల వెండి రథాన్ని తయారు చేయించారు. అమ్మవారికి సమకూర్చిన వెండి రథాన్ని రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ గౌరవ అధ్యక్షుడు, మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్‌ ప్రారంభించారు. కన్యకా పరమేశ్వరి అమ్మవారి విగ్రహ శత జయంతి ఉత్సవాల్లో భాగంగా అమ్మగారి వెండి రథం ప్రారంభోత్సవంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందంగా ఉందని టీజీ వెంకటేశ్ తెలిపారు. 

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో ఆర్యవైశ్యులు ఎప్పుడూ ముందు ఉంటారని ఆయన పేర్కొన్నారు. దేవస్థాన కమిటీల పేరున చేపడుతున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. అయితే కొన్ని కమిటీలు దేవాలయాలకు సంబంధించిన భూములను కాజేయాలని చూస్తున్నారని, అలాంటి వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సేవా కార్యక్రమాలు చేపడుతున్న అనకాపల్లి కన్యకా పరమేశ్వరి దేవస్థానం కమిటీని అభినందించారు. అనంతరం అమ్మవారిని వెండి రథంపై అనకాపల్లి పట్టణ పురవీధుల్లో ఊరేగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details