తెరుచుకున్న బాబ్లీ గేట్లు, తెలంగాణలోకి గోదావరి ప్రవాహం
Published : Mar 1, 2024, 4:23 PM IST
0.6 TMC Water from Babli Barrage to Godavari : మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ సమీపంలో బాబ్లీ ప్రాజెక్టు నుంచి దిగువన ఉన్న గోదావరి నదికి అధికారులు ఈరోజు నీటిని విడుదల చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిపై తెలంగాణకు ఎగువ భాగాన బాబ్లీ వద్ద 2013లో ఆనకట్ట నిర్మిచింది. కేంద్ర జల వనరుల శాఖ ఒప్పందం ప్రకారం ఏటా జులై 1న బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను ఎత్తి అక్టోబర్ 28 వరకు తెరచి ఉంచి 29న మూసి వేస్తారు.
Babli Water Released To Godavari Towards Telangana : వేసవిలో గోదావరి నది పరివాహక ప్రాంతాల్లోని పశువుల దాహార్తిని తీర్చేందుకు ఏటా మార్చి 1న 0.6 టీఎంసీల నీటిని దిగువకు వదులుతారు. ఈ మేరకు శుక్రవారం బాబ్లీ నీరు గోదావరి నది ద్వారా తెలంగాణలోకి ప్రవేశించాయి. గోదావరి నది తెలంగాణలోకి ప్రవేశించే మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దుకు దాదాపు 30 కిలోమీటర్ల ఎగువన బ్యారేజీ ఉంది.