తెలంగాణ

telangana

ETV Bharat / technology

జొమాటోలో కొత్త ఫీచర్- ఇకపై ఆర్డర్​ని నచ్చిన టైమ్​కి 'షెడ్యూల్​' చేసుకోవచ్చు!

జొమాటోలో సరికొత్త 'ఆర్డర్ షెడ్యూలింగ్' ఫీచర్- ఇది ఎలా పనిచేస్తుందంటే?

Zomato New Order Scheduling Feature
Zomato New Order Scheduling Feature (Getty Images)

By ETV Bharat Tech Team

Published : 5 hours ago

Updated : 5 hours ago

Zomato New Order Scheduling Feature: ప్రముఖ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో తన కస్టమర్లకు సూపర్ న్యూస్ తెచ్చింది. భోజన ప్రియులకు ఎంతగానో ఉపయోగపడే ఓ కొత్త ఫీచర్​ను పరిచయం చేసింది. 'ఆర్డర్ షెడ్యూలింగ్' పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్​తో యాప్ వినియోగదారులు రెండురోజుల ముందుగానే ఫుడ్ ఆర్డర్ చేయొచ్చు. అంతేకాక ఏ సమయానికి డెలివరీ చేయాలో సెలక్ట్ చేసుకోవచ్చు.

ఆఫీస్ లంచ్, వీకెండ్ మీటింగ్స్, మరేదైనా ఇతర అకేషన్స్ కోసం భోజనాన్ని 2 గంటల నుంచి రెండు రోజుల వరకు ముందుగానే షెడ్యూల్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్​ ప్రస్తుతం దిల్లీ, బెంగళూరు, ముంబయి, పూణె, రాయ్​పూర్, అహ్మదాబాద్ తదితర 30 ప్రధాన నగరాల్లోని 35,000 కంటే ఎక్కువ రెస్టారెంట్లలో అందుబాటులో ఉంది. ఫుడ్ ఆర్డరింగ్ ప్రాసెస్‌ను కస్టమర్లకు వీలైనంత సౌకర్యవంతంగా చేయటమే లక్ష్యంగా కంపెనీ ఈ ఫీచర్​ను తీసుకొచ్చింది.

ఇది ఎలా పని చేస్తుంది?:

Zomato New Order Scheduling Feature (deepigoyal X)
  • ఈ ఆర్డర్ షెడ్యూలింగ్ ఫీచర్​తో వినియోగదారులు తమకు నచ్చిన ఫుడ్​ను 2 గంటల నుంచి రెండు రోజుల వరకు ముందుగానే ఆర్డర్ చేసుకుని షెడ్యూల్ చేసుకోవచ్చు.
  • ఈ ఫీచర్​ను ఉపయోగించేందుకు యాప్​ను ఓపెన్ చేసి డెలివరీ ట్యాబ్​లోని 'ఆల్​ రెస్టారెంట్స్​' సెక్షన్​లోకి వెళ్లండి.
  • తర్వాత అందులో 'షెడ్యూల్' అనే కొత్త ఆప్షన్​ కన్పిస్తుంది.
  • దానిపై ప్రెస్ చేసి మీకు ఇష్టమైన తేదీ, సమయాన్ని సెలక్ట్ చేసుకోండి.
  • ఇప్పుడు జొమాటో యాప్ మీ ప్రాంతంలో అందుబాటులో ఉన్న రెస్టారెంట్స్​ లిస్ట్​ను మీకు చూపిస్తుంది.
  • అందులో మీకు కావాల్సిన ఫుడ్​ను కార్ట్​కు యాడ్ చేయండి.
  • ఇప్పుడు బిల్ సమ్మరీ పేజీలో 'దిస్ ఈజ్​ షెడ్యూల్డ్ డెలివరీ' అని, మీ డెలివరీ టైమ్​కు కొన్ని నిమిషాల ముందు ఆర్డర్​ రెడీ అవుతుందని చెప్పే కార్డ్​ యాప్​లో కన్పిస్తుంది.
  • మీరు ఒకవేళ మీ ప్లాన్స్ మార్చుకుంటే లేదా షెడ్యూల్ చేసిన ఫుడ్​ డెలివరీ వద్దు అనుకుంటేసెట్ చేసిన సమయానికి మూడు గంటల ముందే మీ ఆర్డర్​ను రద్దు చేసుకోవచ్చు.

సెక్యూరిటీ చర్యలు:

  • అంతా సజావుగా జరిగేలా చూసేందుకు జొమాటోఈ కొత్త ఫీచర్‌తో భద్రతా చర్యలను కూడా ప్రవేశపెట్టింది. సకాలంలో ప్రిపరేషన్, హై-అవైలబిలిటీ ట్రాక్ రికార్డ్ ఉన్న రెస్టారెంట్‌లు మాత్రమే ఈ ఫీచర్‌కు అర్హులు.
  • కస్టమర్లు షెడ్యూల్ చేసిన ఆర్డర్ల కంటే ముందుగానే రెస్టారెంట్లకు నోటిఫికేషన్స్ వెళ్తాయి.
  • ప్రీ-ఆర్డర్ కోసం అందుబాటులో ఉన్న ఐటమ్స్​ వివరాలు కూడా రెస్టారెంట్ల కంట్రోల్​లో ఉంటుంది.
  • దీంతో చివరి నిమిషంలో రీప్లేస్‌మెంట్స్, షార్టేజెస్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు.

టాటా మోటార్స్ ఖాతాలో మరో రికార్డ్- ఏకంగా ఆ మైలు రాయిని దాటేసిన ఈవీ..!

ఫొటోస్​ను గుర్తించే కొత్త ఫీచర్​- ఇకపై ఫేక్ చిత్రాలను గుర్తుపట్టడం ఈజీ- అదెలాగంటే?

Last Updated : 5 hours ago

ABOUT THE AUTHOR

...view details