తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇండియాలోకి వియత్నాం ఆటోమొబైల్ కంపెనీ ఎంట్రీ- వచ్చీ రాగానే అదిరే ఈవీ కార్లతో సంచలనం! - VINFAST CARS AT AUTO EXPO 2025

దేశీయ ఈవీ మార్కెట్​పై కన్నేసిన వియత్నామీస్ కంపెనీ- 'VF 7', 'VF 6' సూపర్​ ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చేందుకు రెడీ!

VinFast Introduced its Electric Cars
VinFast Introduced its Electric Cars (Photo Credit- ANI Photo)

By ETV Bharat Tech Team

Published : Jan 20, 2025, 1:50 PM IST

VinFast Cars at Auto Expo 2025:భారత్​లో ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్గణనీయంగా పెరుగుతోంది. దీంతో విదేశీ కంపెనీలు సైతం ఇక్కడ ఈవీ మార్కెట్​పై ఫోకస్ చేస్తున్నాయి. ఈ క్రమంలో వియత్నామీస్ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ విన్‌ఫాస్ట్ మన దేశంలో జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో తన మొదటి ఎలక్ట్రిక్ వాహనాలను అధికారికంగా ప్రకటించింది. ఇండియన్ మార్కెట్​ కోసం కంపెనీ రెండు ఆల్-ఎలక్ట్రిక్ ప్రీమియం SUVలను ప్రవేశపెట్టింది. అవి 'విన్​ఫాస్ట్ VF 7', 'విన్​ఫాస్ట్ VF 6'. కంపెనీ ఈ రెండు ఎలక్ట్రిక్ కార్లను జులై 2025లో లాంఛ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

విన్‌ఫాస్ట్ VF 6, VF 7 కార్లను తమిళనాడులోని తూత్తుకుడిలోని కంపెనీ ఫ్యాక్టరీలో స్థానికంగా అసెంబుల్ చేస్తామని విన్‌ఫాస్ట్ తెలిపింది. భారతదేశంలో అసెంబుల్ చేసిన తర్వాత వీటిని ఆసియా, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలోని మార్కెట్లకు ఎగుమతి చేయొచ్చు. వాటి ధర రూ.20 లక్షల నుంచి రూ.30 లక్షల మధ్య ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా విన్‌ఫాస్ట్ నుంచి వచ్చిన ఈ రెండు ఎలక్ట్రిక్ SUVలలో ఉన్న ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి తెలుసుకుందాం రండి.

1. విన్‌ఫాస్ట్ VF 7:ఈ కారు 5 సీట్లతో 4,545 mm పొడవుతో వస్తుంది. ఇది దాదాపు అద్భుతమైన క్రాస్ఓవర్ డిజైన్‌తో వస్తుంది. ఇది విన్‌ఫాస్ట్ సిగ్నేచర్ V మోటిఫ్‌ను రిఫ్లెక్ట్ చేసే విధంగా ఫ్రంట్, బ్యాక్ వైపున లైట్లు ఉన్నాయి.

వేరియంట్స్: విన్‌ఫాస్ట్ VF 7 రెండు వేరియంట్లలో వస్తుంది.

  • ఎకో (FWD)
  • ప్లస్ (AWD)

ఈ రెండు వేరియంట్లూ 75.3kWh (నెట్) బ్యాటరీ ప్యాక్​తో వస్తాయి. దీని సింగిల్ ఫ్రంట్-వీల్ డ్రైవ్ మోటార్ 201bhp పవర్, 310Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే డ్యూయల్-మోటార్ VF 7 349bhp పవర్, 500Nm (కంబైన్డ్) టార్క్ జనరేట్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్లస్ వేరియంట్ WLTP-రేటెడ్ రేంజ్ 431 కి.మీ, ఎకో వేరియంట్రేంజ్ 450 కి.మీ అని కంపెనీ చెబుతోంది.

వీటి అల్లాయ్ వీల్స్ సైజ్ తప్ప ఈ రెండు వేరియంట్ల మధ్య పెద్దగా తేడా లేదు. దీని ప్లస్ వేరియంట్​లో బిగ్ 20-21-అంగుళాల వీల్స్ లభిస్తుండగా, ఎకో వేరియంట్​లో 19-అంగుళాల చక్రాలు మాత్రమే లభిస్తాయి. ఇది కాకుండా ప్లస్‌లో 15-అంగుళాల టచ్‌స్క్రీన్, ఎకో వేరియంట్​లో 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్ అందుబాటులో ఉన్నాయి. వీటి రెండు ట్రిమ్‌లు స్టాండర్డ్​గా లెవల్-2 ADAS సూట్​తో వస్తాయి.

2. విన్‌ఫాస్ట్ VF 6: కంపెనీ లైనప్‌లో ఈ 'VF 6' ఎలక్ట్రిక్ SUVని 'VF 7' కంటే దిగువన ఉంచారు. ఈ కాంపాక్ట్ SUV పొడవు 4,238 mm. దాని ఇతర స్టేబుల్‌మేట్స్ లాగానే దీన్ని కూడా ఎకో, ప్లస్‌తో సహా రెండు వేరియంట్‌లలో సేల్ చేయొచ్చు. ఇది విన్​ఫాస్ట్ స్వూపీ డిజైన్, V మోటిఫ్‌ను కూడా కలిగి ఉంది. కానీ ఈ కారు 17-అంగుళాల వీల్ సైజ్​తో వస్తుంది. దీనిలో హెడ్‌లైట్, ఫాగ్ ల్యాంప్ యూనిట్ బంపర్ కింద ఏర్పాటు చేశారు.

దీని బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే, ఇది దాని అంచనా వేసిన ప్రత్యర్థుల మాదిరిగానే 59.6kWh బ్యాటరీని కలిగి ఉంది. ఇది ఫ్రంట్ యాక్సిల్-మౌంటెడ్ సింగిల్ ఎలక్ట్రిక్ మోటారును మాత్రమే కలిగి ఉంటుంది. కానీ దాని అవుట్‌పుట్‌లు భిన్నంగా ఉంటాయి.

ఈ కారు ప్లస్ వేరియంట్ 201bhp పవర్, 310Nm టార్క్​ను ఉత్పత్తి చేస్తుంది. దీని ఎకో వేరియంట్ 175bhp శక్తిని, 250Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ విన్‌ఫాస్ట్ VF 6 కారు WLTP-రేటెడ్ రేంజ్ సింగిల్ ఛార్జ్​తో 381 కి.మీ నుంచి 399 కి.మీ అని కంపెనీ పేర్కొంది. ఇక ఈకారులో లెవల్-2 ADAS, 12.9-అంగుళాల టచ్‌స్క్రీన్, ఓవర్-ది-ఎయిర్ (OTA) అప్‌డేట్‌లు స్టాండర్డ్​ ఎక్విప్మెంట్​గా అందించనున్నారు.

మార్కెట్లోకి లగ్జరీ కారు ఎంట్రీ- X3 SUV నయా వెర్షన్​ లాంఛ్ చేసిన BMW- ధర ఎంతంటే?

ఐఫోన్ SE 4 ఫస్ట్ గ్లింప్స్ లీక్- డిజైన్, స్పెక్స్​, ధర వివరాలివే!

వామ్మో.. శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్​ ధరలు చూశారా?- జేబుకు చిల్లు పెట్టేలా ఉన్నాయ్​గా!

ABOUT THE AUTHOR

...view details