PSLV C3 Rocket Parts on Earth: 2017లో ఇస్రో ఒకేసారి 104 శాటిలైట్స్‌ని అంతరిక్షంలో వివిధ ఆర్బిట్స్‌లో సక్సెస్‌ఫుల్‌గా ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది. ఆ 104 శాటిలైట్స్‌ని మోసుకెళ్లిన PSLV C3 రాకెట్ ఇప్పుడు తిరిగి భూమిపైకి సురక్షితంగా వచ్చేసినట్లు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తెలిపింది. శాటిలైట్స్‌ని మోసుకెళ్లిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (PSLV) C3 రాకెట్ శకలాలు అట్లాంటిక్ మహా సముద్రంలో సురక్షితంగా కూలిపోయినట్లు ఇస్రో కన్ఫర్మ్ చేసింది.
2017లో చరిత్ర సృష్టించిన ఇస్రో: 2017 ఫిబ్రవరి 15వ తేదీన ఇస్రో.. PSLV C3 రాకెట్‌ని లాంచ్ చేసింది. ఒకే మిషన్‌లో రికార్డు స్థాయిలో 104 శాటిలైట్స్‌ను స్పేస్‌లోకి పంపించి చరిత్ర సృష్టించింది. దాంట్లో కార్టోశాట్-2Dని ప్రధాన పేలోడ్‌గా, 103 శాటిలైట్లను కో-ప్యాసింజెర్స్‌గా తీసుకెళ్లారు. ఇందులో భారత్‌కు చెందిన నానో శాటిలైట్స్, వివిధ దేశాలకు చెందిన చిన్న ఉపగ్రహాలు ఉన్నాయి.
అంతేకాక ఈ PSLV C3 రాకెట్ ప్రయోగించిన అరగంటలోనే అన్ని ఉపగ్రహాలను వాటి కక్ష్యల్లోకి చేర్చింది. 2017లో భారతీయ శాస్త్రవేత్తలు ఈ అద్భుతాన్ని సాధించడమే కాకుండా ప్రపంచ రికార్డు కూడా సృష్టించారు. అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా గుర్తింపు పొందిన నాసా కూడా భారత్ సాధించిన ఈ ఘనత చూసి ఆశ్చర్యపోయింది.
భూమిపైకి PSLV C3 రాకెట్ రీ ఎంట్రీ:2017లో అన్ని శాటిలైట్లను విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలో ప్రవేశపెట్టిన తర్వాత PSLV C3 రాకెట్‌కు చెందిన అప్పర్ స్టేజ్ (PS4) కూడా కక్ష్యలోనే ఉండిపోయింది. ఇస్రో శాస్త్రవేత్తలు ఆ విడిభాగాన్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుత ఆర్బిటాల్ ఆల్టిట్యూడ్ తగ్గిపోయింది. భూ వాతావరణంలో ఉన్న అయష్కాంత శక్తి క్షీణించింది. దీంతో అక్టోబర్ 6వ తేదీన PSLV C3 రాకెట్ భూమిపైకి వచ్చేసినట్లు ఇస్రో అధికారులు వెల్లడించారు. ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో ఈ రాకెట్ శకలాలు సురక్షితంగా కూలినట్లు తెలిపారు.
ఆ ప్రక్రియ అంతా ఇస్రో దాని IS4OM (ISRO సిస్టమ్ ఫర్ సేఫ్ అండ్ సస్టైన్డ్ స్పేస్ ఆపరేషన్స్ మేనేజ్‌మెంట్) సౌకర్యం ద్వారా నిశితంగా పరిశీలించింది. IS4OM, యూఎస్ స్పేస్ కమాండ్ రెండూ ఊహించినట్లుగానే PSLV C3 రాకెట్ శకలాలు 2024 అక్టోబర్ 6వ తేదీన ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో పడిపోయాయి. రాకెట్ భూ వాతావరణంలోకి చేరుతున్న సమయంలో PS4 దెబ్బతినకుండా ఇస్రో అనేక చర్యలు తీసుకుంది. ఇది అంతరిక్ష శిథిలా నివారణకు భారత్‌కు ఉన్న నిబద్ధతతను తెలియజేస్తుంది.
ప్లూటో జాబిల్లిపై కార్బన్ డయాక్సైడ్ గుర్తించిన శాస్త్రవేత్తలు - Dwarf Planet Pluto
సునీతా విలియమ్స్ రెస్క్యూ మిషన్ లాంచ్- ఐఎస్ఎస్కు బయల్దేరిన స్పేస్ఎక్స్ రాకెట్ - SpaceX Crew 9 Mission Launch