Top 10 Websites For Free Photos :మీరు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారా? సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్స్‌గా మంచి పేరు తెచ్చుకుందామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. సోషల్ మీడియాలో ఎలాంటి కాపీ రైట్ స్ట్రైక్ పడకుండా ఉండాలంటే, ప్రీమియం ఇమేజ్‌లు, వీడియోలు, ఆడియో ట్రాక్‌లు వాడాల్సి వస్తుంది. దీని కోసం ఎంతో ఖర్చు అవుతుంది. అయితే మీరేమీ దిగులుపడాల్సిన అవసరం లేదు. పూర్తి ఉచితంగా ఫొటోలు, వీడియోలు, మ్యూజిక్ ఫైల్స్ అందించే వెబ్‌సైట్స్ ఎన్నో ఉన్నాయి. వాటిలోని టాప్-10 వెబ్‌సైట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Free Image Websites
- Pexels : ఈ వెబ్సైట్లో ఫ్రీ ఫొటోలు, 4కె స్టాక్ వీడియోలు, బ్యాక్‌గ్రౌండ్ ఇమేజ్‌లు లభిస్తాయి. వీటిని మీరు పూర్తి ఉచితంగా వాడుకోవచ్చు. అయితే కొన్ని ఇమేజ్‌లకు క్రెడిట్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నింటికి అది కూడా అవసరం ఉండదు.
- Pixabay :ఇందులో ఫొటోలు, ఇల్లస్ట్రేషన్స్, వెక్టార్స్, వీడియోస్, జిఫ్ ఫైల్స్, మ్యూజిక్, సౌండ్ ఎఫెక్ట్స్ అన్నీ ఉంటాయి. దీనిలో చాలా వరకు ఫ్రీ కంటెంట్ ఉంటుంది. కనుక వీటిని మీరు ఉచితంగా వాడుకోవచ్చు.
- Unsplash : దీనిలో రాయల్టీ ఫ్రీ స్టాక్ ఇమేజ్‌లు ఉంటాయి. దీనిలో వాల్‌పేపర్స్, 3డీ రెండర్స్, టెక్స్చర్స్ & ప్యాట్రన్స్, స్ట్రీట్ ఫొటోగ్రఫీ, ఫ్యాషన్, బ్యూటీ విభాగాలకు చెందిన భిన్నమైన ఇమేజ్‌లు, ఇల్లస్ట్రేషన్లు ఉంటాయి. వీటిని మీరు ఉచితంగా వాడుకోవచ్చు.
- Freepik :ఈ వెబ్సైట్లో ఫొటోలు, ఐకాన్లు, వీడియోలు, టెంప్లెట్స్, పీఎస్‌డీలు, 3డీ ఫొటోలు ఉంటాయి. ఇవన్నీ రాయల్టీ ఫ్రీ ఇమేజ్‌లు. కనుక వీటిని ఉచితంగా మీరు వాడుకోవచ్చు.
- Freerange : ఈ సైట్లో ఫ్రీ స్టాక్ ఫొటోస్, ఇల్లస్ట్రేషన్స్ ఉంటాయి. దీనిలో పాపులర్ ఫొటోస్ అనే విభాగం ఉంది. దీనిలో మీకు కావాల్సిన హైక్వాలిటీ ఫొటోలు చాలా ఉంటాయి. వాటిని మీరు ఫ్రీగా ఉపయోగించుకోవచ్చు.