Top 6 Free AI Tools For Video Editing : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా హవా నడుస్తోంది. అందుకే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కావాలని ఆశపడుతున్నారు. అయితే ఇది అంత సులువైన పనికాదు. మంచి కంటెంట్ ఉంటే సరిపోదు. దానిని చక్కగా ప్రెజెంట్ చేయగలగాలి. అందుకు మంచి వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ ఉపయోగించాల్సి ఉంటుంది. అయితే వాటి ఖరీదు చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వాటిని చాలా మంది కొనుగోలు చేయలేరు. అందుకే ఈ ఆర్టికల్‌లో పూర్తి ఉచితంగా లభించే టాప్-6 ఏఐ వీడియో ఎడిటింగ్ టూల్స్ గురించి తెలుసుకుందాం.
6. OpenShot : ఓపెన్‌షాట్ అనేది ఒక ఓపెన్-సోర్స్ వీడియో ఎడిటర్. ఇది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇది చాలా వీడియో ఫార్మాట్లను, రిజల్యూషన్లను సపోర్ట్ చేస్తుంది. దీని ద్వారా మీ వీడియోకు మంచి ఎఫెక్ట్స్‌ను జత చేయవచ్చు. ఆడియోను కూడా మోడిఫై చేసుకోవచ్చు.
5. Shotcut :ఈ షాట్‌కట్ అనేది మోస్ట్ పవర్ఫుల్ వీడియో ఎడిటర్. ఇది బిగినర్స్‌కు మాత్రమే కాదు, అడ్వాన్స్డ్ వీడియో ఎడిటర్లకు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది చాలా ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది. దీనితో 4కె రిజల్యూషన్‌లో వీడియో ఎడిటింగ్ చేసుకోవచ్చు. దీనిలో చాలా మంచి ఫీచర్లు ఉన్నాయి. వీటిని ఉపయోగించి ఆడియో, వీడియో ఫిల్టర్లను యాడ్ చేసుకోవచ్చు. ఈ ఏఐ టూల్ పూర్తిగా ఉచితం.
4. VEED.IO :వీడ్.ఐఓ అనేది ఒక ఆన్లైన్ వీడియో ఎడిటింగ్ ప్లాట్‌ఫామ్. దీనిలో చాలా ఎడిటింగ్ టూల్స్, ఫీచర్స్ ఉన్నాయి. దీని ద్వారా యానిమేషన్స్ కూడా చేసుకోవచ్చు. క్విక్‌గా, ఈజీగా వీడియో ఎడిటింగ్ చేసుకోవడానికి ఇది బాగుంటుంది. కనుక సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్స్‌కు, మార్కెటింగ్ చేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని బేసిక్ వెర్షన్ పూర్తిగా ఉచితం. ప్రో వెర్షన్‌ను మాత్రం డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది.