తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఈ న్యూఇయర్​లో మంచి రీఛార్జ్ ప్లాన్​ కోసం చూస్తున్నారా?- రూ.500లోపు బెస్ట్ ప్యాక్స్ ఇవే..! - BEST PREPAID PLANS FOR NEW YEAR

కొత్త సంవత్సరంలో చీప్ అండ్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ మీకోసం- ఓ లుక్కేయండి మరి!

Symbolic image
Symbolic image (Photo Credit- ETV Bharat File)

By ETV Bharat Tech Team

Published : Dec 24, 2024, 6:13 PM IST

Best Prepaid Plans for New Year:మరికొన్ని రోజుల్లో న్యూ ఇయర్ రాబోతుంది. మీ ప్రీపెయిడ్ మొబైల్​ కోసం మంచి ప్లాన్​ను ఎంచుకునేందుకు ఇదే మంచి సమయం. ఎందుకంటే కొత్త సంవత్సరం నేపథ్యంలో చాలావరకు టెలికాం కంపెనీలు అదిరే ఆఫర్లతో సరికొత్త ప్లాన్లను తీసుకొస్తుంటాయి. ఈ సందర్భంగా వాటిలో రూ.500 కంటే తక్కువ బడ్జెట్లో ఉన్న బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ మీకోసం.

1. BSNL Rs. 485 ప్లాన్: లాంగ్ వ్యాలిడిటీ అండ్ డైలీ బెనిఫిట్స్

  • వాయిస్ కాల్స్: అన్​లిమిటెడ్ లోకల్ & STD కాల్స్
  • డేటా:రోజుకి 1.5GB (లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 40 Kbpsకి తగ్గుతుంది)
  • SMS:రోజుకి 100 SMS
  • వ్యాలిడిటీ: 82 డేస్
  • ఎక్స్​ట్రా బెనిఫిట్స్: ఫ్రీ కాలర్ ట్యూన్స్

తరచుగా రీఛార్జ్‌లు చేసేపని లేకుండా ఎక్కువ కాలం పాటు స్థిరమైన డేటా, కాల్ సర్వీసులు అవసరమయ్యే యూజర్లకు ఈ BSNL ప్లాన్ బాగుంటుంది.

2. AirTel Rs 379 రీఛార్జ్ ప్యాక్: హై-స్పీడ్ డేటా విత్ అన్​లిమిటెడ్ 5G

హై-స్పీడ్ డేటా కావాలనుకునే వారికి ఈ ఎయిర్‌టెల్ రూ. 379 ప్రీపెయిడ్ ప్యాక్ బెస్ట్ ఆప్షన్.

  • వాయిస్ కాల్స్: అన్​లిమిటెడ్ లోకల్ & STD కాల్స్
  • డెటా: రోజుకి 2GB + అన్​లిమిటెడ్ 5G డేటా (లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది)
  • SMS: రోజుకి 100 SMS
  • వ్యాలిడిటీ: 1 నెల
  • ఎక్స్​ట్రా బెనిఫిట్స్: ఫ్రీ కాలర్ ట్యూన్స్

ఈ ప్లాన్ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందిస్తుంది. ఇది వర్క్ లేదా ఎంటర్టైన్మెంట్ కోసం మొబైల్ డేటాను ఉపయోగించే వారికి బాగా ఉపయోగపడుతుంది.

3. Vodafone Idea Rs 365 ప్యాక్:ఫ్లెక్సిబుల్ డేటా అండ్ నైట్ బెనిఫిట్స్

వొడాఫోన్ ఐడియా ఈ రూ. 365 ప్లాన్ వినియోగదారులకు అదనపు సౌలభ్యం, బోనస్ డేటాను అందిస్తుంది.

  • వాయిస్ కాల్స్:అన్​లిమిటెడ్ లోకల్ & STD కాల్స్
  • డేటా: రోజుకు 2GB (లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది)
  • SMS:రోజుకు 100 SMS
  • వ్యాలిడిటీ: 28 రోజులు
  • ఎక్స్​ట్రా బెనిఫిట్స్: 12am నుంచి 12am వరకు అన్​లిమిటెడ్ డేటా, వారాంతపు రోజులలో ఉపయోగించని డేటా కోసం వారాంతపు రోల్‌ఓవర్, అదనపు ఖర్చు లేకుండా నెలకు 2GB బ్యాకప్ డేటా.

ఈ ప్లాన్ ఎక్కువగా నైట్​ టైమ్ డేటా వినియోగించే వారికి పర్ఫెక్ట్​గా ఉంటుంది.

4. Jio Rs.449 ప్యాక్:

జియో రూ. 449 ప్లాన్ ఎక్కువ డేటా వినియోగం, ప్రయాణంలో వినోదం కోరుకునే వారి కోసం తీసుకొచ్చారు.

  • వాయిస్ కాల్స్:అన్​లిమిటెడ్ లోకల్ & STD కాల్స్
  • డేటా: రోజుకు 3GB (లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది)
  • SMS: రోజుకు 100 SMS
  • వ్యాలిడిటీ:28 రోజులు
  • ఎక్స్​ట్రా బెనిఫిట్స్: JioTV, JioCinema, JioCloud యాక్సెస్‌తో పాటు Jio 5G కవరేజీ ప్రాంతాల్లో అన్​లిమిటెడ్ 5G డేటా.

తరచూ వీడియోలను స్ట్రీమ్ చేసే, ఆన్‌లైన్ గేమ్‌లు ఆడే లేదా వీడియో కాల్స్​లో పాల్గొనే వారికి ఈ రీఛార్జ్ ప్లాన్ బాగుంటుంది. దీంతోపాటు జియో నెట్‌వర్క్, ఎంటర్‌టైన్‌మెంట్ ఆఫర్‌లను ఎక్కువగా ఉపయోగించుకోవడానికి ఈ ప్లాన్ బాగా సరిపోతుంది.

5. AirTel Rs.398 ప్యాక్:స్పోర్ట్ లవర్స్​ ఈ ప్లాన్​ను ఎంతగానో ఇష్టపడతారు. ఎయిర్‌టెల్ ఈ రూ. 398 ప్లాన్‌లో పుష్కలమైన డేటా ప్రయోజనాలతో పాటు డిస్నీ+ హాట్‌స్టార్‌కు సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంది. ఇది స్పోర్ట్స్ లవర్స్​తో పాటు ఎక్కువగా ప్రీమియం కంటెంట్ చూసేవారికి బాగా ఉపయోగపడుతుంది.

  • వాయిస్ కాల్స్: అన్​లిమిటెడ్ లోకల్ & STD కాల్స్
  • డేటా:రోజుకి 2GB (లిమిట్ దాటిన తర్వాత స్పీడ్ 64 Kbpsకి తగ్గుతుంది)
  • SMS:రోజుకి 100 SMS
  • వ్యాలిడిటీ:28 రోజులు
  • ఎక్స్​ట్రా బెనిఫిట్స్: Disney+ Hotstarకి 28-రోజుల సబ్​స్క్రిప్షన్

స్పోర్ట్ లైవ్ స్ట్రీమ్ లవర్స్​, డేటా లిమిట్స్​ చింత లేకుండా ఇతర ప్రీమియం కంటెంట్ చూడాలనుకునే వారికి ఈ ప్లాన్ బెస్ట్.

మార్కెట్లో కొత్త హోండా- బ్లూటూత్‌ కనెక్టివిటీ, ఛార్జింగ్‌ పోర్ట్​తో బడ్జెట్ ధరలోనే లాంఛ్- మిడిల్​క్లాస్ వారికి బెస్ట్ ఆప్షన్ ఇదే!

BSNL కొత్త ఇంటర్నెట్ టీవీ సర్వీస్ లాంఛ్- ఇకపై ఉచితంగానే హై క్వాలిటీ ఓటీటీ కంటెంట్!

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?- మరికొన్ని రోజుల్లో వాటిలో వాట్సాప్ బంద్!

ABOUT THE AUTHOR

...view details