Tecno POP 9 5G New Variant:టెక్నో తన బడ్జెట్ ఫోన్ టెక్నో పాప్ 9 5G కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్‌ను 8GB RAM అండ్ 128GB స్టోరేజ్‌తో కొత్త మోడల్‌లో తీసుకొచ్చింది. దీని ధర రూ.10,999. కంపెనీ దీని పాత మోడల్స్‌ను సెప్టెంబర్ 2024లో రిలీజ్ చేసింది. అయితే వీటి ధర రూ.9,499 నుంచి ప్రారంభమవుతుంది.
ఇక టెక్నో తీసుకొచ్చిన ఈ కొత్త వేరియంట్ ఫస్ట్ సేల్ జనవరి 8 నుంచి ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌ను మూడు రంగులలో విడుదల చేసింది. ఫోన్ బాక్స్‌లో రెండు స్కిన్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.
స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:
- డిస్ప్లే:ఈ ఫోన్ 6.67 అంగుళాల LCD స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఈ ఫోన్ డిజైన్ సెంటర్డ్ పంచ్ హోల్ కటౌట్‌తో వస్తుంది.
- ప్రాసెసర్:ఇది 6nm మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇందులో 5G 10 బ్యాండ్స్ ఉన్నాయి. అంటే వినియోగదారులు ఈ స్మార్ట్‌ఫోన్‌లో మంచి 5G కనెక్టివిటీని పొందగలరు.
- కెమెరా:ఈ ఫోన్ వెనక భాగంలో 48MP సోనీ IMX 882 మెయిన్ కెమెరా అమర్చారు. ఫోన్ రింగ్ LED ఫ్లాష్‌లైట్‌తో వస్తుంది. ఇందులో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా ఉంది.
- బ్యాటరీ:ఈ మొబైల్ 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది. ఈ ఫోన్ USB టైప్ C పోర్ట్‌తో వస్తుంది. ఇది ఫోన్‌తో బాక్స్‌లో వస్తుంది.
- కనెక్టివిటీ: ఈ ఫోన్‌లో ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్, ఆల్-డైరెక్షన్ NFC కనెక్టివిటీ, బ్లూటూత్, Wi-Fi, డ్యూయల్ నానో సిమ్, USB టైప్-C, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.
- ఇతర ఫీచర్లు:ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. ఇది ఫోన్‌ను వాటర్ స్ప్లాషెస్, దుమ్ము నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఈ రేంజ్ ధరలో లభించే ఫోన్‌లలో ఇటువంటి ఫీచర్లు చాలా అరుదుగా ఉంటాయి. ఇది కాకుండా ఈ ఫోన్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లతో సహా అనేక ప్రత్యేక ఫీచర్లను కూడా కలిగి ఉంది.