తెలంగాణ

telangana

ETV Bharat / technology

మార్కెట్లో ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్- ఫస్ట్​లుక్​ మామూలుగా లేదుగా! - Tecno Phantom Ultimate 2 FIRST LOOK - TECNO PHANTOM ULTIMATE 2 FIRST LOOK

Tecno Phantom Ultimate 2: మార్కెట్లో ఫోల్డబుల్ మొబైల్స్​దే హవా. వీటికున్న క్రేజ్ వేరే లెవల్. ఈ నేపథ్యంలో ప్రముఖ టెక్ సంస్థ టెక్నో తొలిసారిగా వినూత్న ఆవిష్కరణకు శ్రీకారం చుట్టుంది. ఇప్పటి వరకు టెక్​ మార్కెట్​కు పరిచయం లేని ట్రై ఫోల్డ్​ కాన్సెప్ట్​ను ఆవిష్కరించింది. 'టెక్నో ఫాంటమ్‌ అల్టిమేట్‌ 2' పేరుతో ట్రై ఫోల్డ్​ స్మార్ట్​ఫోన్ ఫస్ట్​ లుక్​ను విడుదల చేసింది.

Tecno_Phantom_Ultimate_2
Tecno_Phantom_Ultimate_2 (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Aug 29, 2024, 4:07 PM IST

Tecno Phantom Ultimate 2:టెక్ మార్కెట్లో రాణించాలంటే కస్టమర్ల అభిరుచి, ఆసక్తికి అనుగుణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రొడక్ట్స్​ను విడుదల చేయాలి. దీంతో ప్రముఖ స్మార్ట్​ఫోన్ల తయారీ సంస్థ కొత్త తరహా మొబైల్స్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు టెక్ మార్కెట్‌కు పరిచయం లేని ట్రై ఫోల్డ్‌ స్మార్ట్‌ఫోన్‌ కాన్సెప్ట్‌ను ఆవిష్కరించింది. IFA బెర్లిన్​లో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఈవెంట్​లో టెక్నో ట్రై ఫోల్డ్​ హ్యాండ్ సెట్​ ఫస్ట్​ లుక్​ను ప్రదర్శించింది.

'టెక్నో ఫాంటమ్‌ అల్టిమేట్‌ 2' పేరుతో ఈ మొబైల్‌ను తీసుకురానున్నట్లు పేర్కొంది. మూడు మడతలు పెట్టేలా దీన్ని రూపొందించనున్నారు. కొత్త ఫోన్‌కు సబంధించిన ఫొటోలను టెక్నో సమాజిక మాధ్యమం 'ఎక్స్' వేదికగా పంచుకుంది. ఈ ఫోన్‌ను ల్యాప్‌లాప్‌గా ఉపయోగించుకోవచ్చని, ఒక ఫోల్డ్‌ని కీ బోర్డ్‌లా మార్చుకోవచ్చని తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులు ఎదురుగా కూర్చున్నప్పుడు కంటెంట్‌ను వీక్షించేందుకు సాధ్యపడుతుంది.

'టెక్నో ఫాంటమ్‌ అల్టిమేట్‌ 2' ఫోన్ ఫీచర్స్: ఈ కింది ఫీచర్లతో ఈ మొబైల్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.

  • 3 ఫోల్డబుల్‌ స్క్రీన్స్​
  • 6.48 అంగుళాల కవర్‌ డిస్‌ప్లే
  • 10 అంగుళాల ఎల్‌టీపీఓ ఓఎల్‌ఈడీ ఇన్నర్‌ స్క్రీన్‌
  • 1620 x 2880 పిక్సల్ రిజల్యూషన్‌
  • టచ్‌ అండ్‌ డిస్‌ప్లే డైవర్జ్‌ ఇంటిగ్రేషన్‌(TDDI) టెక్నాలజీ
  • డిస్​ప్లే డ్రైవర్, టచ్ సెన్సార్
  • 11ఎమ్ఎమ్ థిక్​నెస్
  • డ్యూయల్‌ హింజ్‌ మెకానిజమ్‌
  • అల్ట్రా స్లిమ్‌ బ్యాటరీ
  • 4:3 ఆస్పెక్ట్‌ రేషియో

3లక్షల సార్లు టెస్ట్​లు:

  • 'టెక్నో ఫాంటమ్‌ అల్టిమేట్‌ 2' ట్రై ఫోల్డ్​ స్మార్ట్​ఫోన్ డ్యూయల్ హింజ్ మెకానిజంను కలిగి ఉంది.
  • దీని బ్యాటరీ మందం కేవలం 0.25ఎంఎం మాత్రమే ఉంటుంది.
  • ఈ కొత్త స్మార్ట్​ ఫోన్​ ట్రై ఫోల్డ్​ స్క్రీన్​ను కలిగి ఉన్నా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫోల్డబుల్ మొబైల్స్ తరహా థిక్​నెస్​నే కలిగి ఉంది.
  • ఈ ఫీచర్లతో మార్కెట్లోకి రానున్న తొలి ట్రై ఫోల్డ్​ స్మార్ట్​ఫోన్ ఇదే అని టెక్నో సంస్థ చెబుతోంది.
  • 3లక్షల సార్లు ఈ మొబైల్​కు ఫోల్డ్‌, అన్‌ఫోల్డ్‌ టెస్ట్‌లు నిర్వహించినట్లు పేర్కొంది.

టెక్నో ట్రై ఫోల్డ్‌ మొబైల్‌ లాంఛ్ ఎప్పుడు?

  • టెక్నో సంస్థ తొలిసారిగా ఈ కాన్సెప్ట్​ను ఫిబ్రవరిలో నిర్వహించిన మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్ 2024 (MWC 2024)లో విడుదల చేసింది.
  • ప్రస్తుతం IFA బెర్లిన్​లో నిర్వహించిన ఇండస్ట్రియల్ ఈవెంట్​లో దీని ఫస్ట్​ లుక్​ను రిలీజ్ చేసింది.
  • ఈ ట్రై ఫోల్డ్ స్మార్ట్​ఫోన్ కాన్సెప్ట్​ను టెక్నో విడుదల చేసినా ఎప్పటి నుంచి దీన్ని మార్కెట్లోకి విడుదల చేస్తుంది అనే విషయాన్ని ఇంకా వెల్లడించలేదు.
  • అయితే టెక్నో కంటే ముందే చైనాకి చెందిన హువావే(Huawei) ఈ తరహా స్మార్ట్​ఫోన్​ను లాంచ్​ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
  • ఈ మేరకు Huawei అక్టోబర్​లో ఇందుకు సంబంధించిన ఈవెంట్​ను నిర్వహించనున్నట్లు సమాచారం.

శాంసంగ్ ఫోన్లపై అదిరే ఆఫర్స్- రూ.6వేల వరకు భారీ తగ్గింపు! - huge discounts on samsung phones

ఐఫోన్ లవర్స్​కు గుడ్​ న్యూస్- యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసిందోచ్​ - iphone 16 launch date

ABOUT THE AUTHOR

...view details