Summer Effects On Phone Charging :ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవిలో భానుడి ప్రతాపం మనుషుల మీదే కాదు, మనం వాడే స్మార్ట్ ఫోన్ మీద కూడా ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఇతర సీజన్లతో పోలిస్తే వేసవిలో స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వేడెక్కుతుంది. బ్రౌజింగ్ చేసినా, గేమ్స్ ఆడినా వెనక ఉండే ప్యానెల్ మొత్తం హీటెక్కుతుంది. అంతేకాదు వేసవిలో స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ వేగంలో కూడా తేడాను మనం గమనించవచ్చు. మునుపటితో పోల్చితే ఛార్జింగ్ వేగం తగ్గుతుంది. ఇంతకు వేసవి కాలంలో ఛార్జింగ్ వేగం ఎందుకు తగ్గుతుంది? వేసవికి, ఛార్జింగ్ మధ్య సంబంధం ఏంటి?
పెరుగుతున్న టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లలో కూడా రకరకాల ఫీచర్లు అందుబాటులోకి వస్తున్నాయి. అవి మరింత పవర్‌ఫుల్‌గా మారుతున్నాయి. అంతేకాదు వాటి స్పీడ్, పనితీరులో చాలా వరకు మార్పులు వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్ వేగం కూడా పెరిగింది. డిస్‌ప్లే బ్రైట్‌నెస్ పెరిగింది. ఒకప్పుడు సన్‌లైట్‌లోకి తీసుకెళితే స్మార్ట్‌ఫోన్ డిస్‌ప్లే కనిపించేది కాదు. ఇప్పుడు డిస్‌ప్లే బ్రైట్‌నెస్ ఆ స్థాయిలో మెరుగైంది. ఇవన్నీ స్మార్ట్‌ఫోన్ హీట్‌ను పెంచేవే. దీనికితోడు బీజీఎంఐ వంటి హై ఎండ్ గేమ్స్ ఆడడం వల్ల కూడా ఫోన్ హీట్ పెరుగుతుంది. సాధారణ రోజుల కంటే వేసవిలో వేడిమి కారణంగా స్మార్ట్‌ఫోన్లు మరింత వేగంగా హీటెక్కుతాయి.
ఛార్జింగ్ స్పీడ్ ఎందుకు నెమ్మదిస్తుంది?
స్మార్ట్ ఫోన్ ఫెర్మార్మెన్స్‌తో పాటు బ్యాటరీ ఛార్జింగ్ వేగం చాలా వరకు పెరుగుతుంది. నిమిషాల్లోనే బ్యాటరీని ఫుల్ ఛార్జింగ్ చేసే టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది. అయితే హీట్ కారణంగా ఫోన్ డ్యామేజీ కాకుండా ఉండేందుకు వీటిలో డిఫెన్స్ మెకానిజం కూడా ఉంటుంది. అంటే స్మార్ట్ ఫోన్ వేడిగా ఉన్నప్పుడు ఇందులోని సెన్సార్లు గుర్తిస్తాయి. అవి ఫోన్ ఛార్జింగ్ స్పీడ్‌ను తగ్గిస్తాయి.