తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇట్స్​ టైమ్​ టు ప్లే- 'బ్లాక్ ఫ్రైడే సేల్‌'లో మొదలైన ఆఫర్ల హంగామా- గేమింగ్ లవర్స్​కు ఇక పండగే! - BLACK FRIDAY SALE 2024

గేమింగ్ ప్రియులకు గుడ్​న్యూస్- సోనీ ప్లేస్టేషన్ ఇండియా సేల్స్ స్టార్ట్​- భారీ డిస్కౌంట్స్ ఇవే..!

Black Friday Sale 2024
Black Friday Sale 2024 (Playstation India X)

By ETV Bharat Tech Team

Published : Nov 24, 2024, 3:24 PM IST

Updated : Nov 24, 2024, 3:41 PM IST

Black Friday Sale 2024: గేమింగ్ లవర్స్​కు గుడ్​న్యూస్. సోనీ ప్లేస్టేషన్ ఇండియా తన 'బ్లాక్ ఫ్రైడే సేల్‌'ను ప్రకటించింది. ఇండియాలో ఈ పేరు ఎక్కవమందికి తెలియకపోవచ్చు. అయితే అమెరికాలో మాత్రం ఈ 'బ్లాక్ ఫ్రైడే సేల్‌' చాలా ఫేమస్. ఇందులో బంపర్ ఆఫర్లను అందించడంతో ఈ సేల్​ ఎప్పుడు వస్తుందా అని జనాలు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారు. ఇక ఇటీవల ఈ సేల్​ సందడి మన ఇండియాలో కూడా మొదలైంది. అమెజాన్, ఫ్లిప్​కార్ట్ వంటి అనేక సంస్థలు ఈ షాపింగ్ ఫెస్టివల్​లో పాల్గొంటున్నాయి.

ఈ క్రమంలో తాజాగా సోనీ ప్లేస్టేషన్ ఇండియా తన 'బ్లాక్ ఫ్రైడే సేల్‌ 2024'ను తీసుకొచ్చింది. ఈ సేల్​లో అన్ని లేటెస్ట్ PS5 వేరియంట్స్, యాక్సెసరీస్, వీడియో గేమ్స్​పై అదిరే ఆఫర్లను అందిస్తుంది. ఇందులో PS5 డిజిటల్ ఎడిషన్ (స్లిమ్)ను డిస్కౌంట్​లో రూ. 37,490లకే కొనుగోలు చేయొచ్చు. నవంబర్ 22 నుంచి డిసెంబర్ 5 వరకు ఈ సేల్ కొనసాగనుంది. మరెందుకు ఆలస్యం ఇందులో మీకు నచ్చిన వీడియో గేమ్స్, యాక్సెసరీస్​ను ఈ బ్లాక్​ ఫ్రైడే సేల్​లో కొనిపడేయండి.

బ్లాక్ ఫ్రైడే సేల్‌ 2024 ఆఫర్లు ఇవే!:

ఈ సేల్​లో PS5 డిజిటల్ ఎడిషన్ ఫోర్ట్‌నైట్ కోబాల్ట్ స్టార్ బండిల్ కూడా రూ. 37,490కి అందుబాటులో ఉంది. ఇందులో ఫోర్ట్‌నైట్ కోబాల్ట్ స్టార్ బండిల్ వోచర్ ఉంది. ఇది LEGO-స్టైల్ కోబాల్ట్ స్నోఫుట్ అవుట్‌ఫిట్, సఫైర్ స్టార్ బ్యాక్ బ్లింగ్, ఇండిగో ఇన్వర్టర్ పికాక్స్, వెదర్డ్ స్నో స్ట్రైప్స్ ర్యాప్, 1,000 V-బక్స్ వంటి మరిన్ని ఇన్-గేమ్ ప్రయోజనాలను అందిస్తుంది.

PS5 కన్సోల్ డిస్క్ ఎడిషన్ కూడా 47,490 రూపాయల తగ్గింపు ధరతో లభిస్తుంది. ఈ సేల్​లో PS5 DualSense కంట్రోలర్ వంటి యాక్సెసరీలు రూ. 3,990 ధర నుంచే ప్రారంభమవుతాయి. అంతేకాక PS VR2 హారిజన్ కాల్ ఆఫ్ ది మౌంటైన్ బండిల్ 25,000 భారీ తగ్గింపుతో రూ. 36,999కే ఈ సేల్​లో అందుబాటులో ఉంది.

PS5 అనేది ASTRO ప్లేరూమ్‌తో వస్తుంది. ఇది PS5, DualSense కంట్రోలర్ కంప్లీట్ కెపాసిటీలను అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడే ఒక వీడియో గేమ్.

వీటితో పాటు డెత్ స్ట్రాండింగ్ డైరెక్టర్స్ కట్ అంజ్ అన్‌చార్టెడ్: లెగసీ ఆఫ్ థీవ్స్ కలెక్షన్ వంటి పాపులర్ గేమ్స్ ఇందులో రూ. 1,499 తగ్గింపు ధరతో లభిస్తాయి. రిటర్నల్, డెమన్స్ సోల్స్, సెల్లార్ బ్లేడ్ వంటి ఇతర గేమ్స్​ కూడా ఈ సేల్​లో కొనుగోలు చేయొచ్చు. కస్టమర్లు వీటినిసోనీ సెంటర్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, బ్లింకిట్, క్రోమా, రిలయన్స్, విజయ్ సేల్స్​తో పాటు ఇతర ప్రధాన స్టోర్స్​ నుంచి కొనుగోలు చేయొచ్చు.

ప్లేస్టేషన్ బ్లాక్ ఫ్రైడే సేల్​లో ఆఫర్లతో అందుబాటులో ఉన్న వీడియో గేమ్స్ లిస్ట్ ఇదే!:

Sony PlayStation Black Friday Sale Deals
Category Product Details MRP (INR) Black Friday sale Price (INR)
Consoles PS5 Console (Disc Version) 54,990 47,490
Consoles PS5 Digital Edition 44,990 37,490
Consoles PS5 Console – God of War Ragnarök Bundle 54,990 47,490
Consoles PS5 Digital Edition – God of War Ragnarök Bundle 44,990 37,490
Controllers PS5 DualSense Wireless Controller (White) 7,990 6,490
Controllers PS5 DualSense Wireless Controller (Black) 7,990 6,490
Controllers PS5 DualSense Edge Wireless Controller 25,990 21,990
Games Marvel’s Spider-Man 2 4,999 2,999
Games Rise of the Ronin 4,999 2,999
Games Stellar Blade 4,999 3,999
Games Gran Turismo 7 4,999 2,499
Games God of War Ragnarok 4,999 2,499
Games The Last of Us Part 1 Remake 4,999 2,499
Games Ghost of Tsushima Directors Cut 4,999 2,499
Games Ratchet & Clank: Rift Apart 4,999 2,499
Games Returnal 4,999 2,499
Games Demon’s Souls 4,999 2,499
Games Marvel’s Spider-Man Miles Morales Ultimate Edition 4,999 2,999
Games The Nioh Collection 4,999 1,999
Games Horizon Forbidden West Complete Edition 3,999 2,999
Games Horizon Forbidden West 3,999 2,499
Games Marvel’s Spider-Man Miles Morales (PS5) 3,999 1,999
Games Sackboy: A Big Adventure (PS5) 3,999 1,999
Games The Last of Us Part 2 Remastered 2,999 2,499
Games Helldivers 2,499 1,999
Games Uncharted: Legacy of Thieves Collection 2,999 1,499
Games Death Stranding Directors Cut 2,999 1,499
Last Updated : Nov 24, 2024, 3:41 PM IST

ABOUT THE AUTHOR

...view details