తెలంగాణ

telangana

By ETV Bharat Tech Team

Published : 4 hours ago

Updated : 4 hours ago

ETV Bharat / technology

సూసైడ్‌ మెషీన్​లో ఫస్ట్ డెత్!- పలువురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - Suicide Capsule

Suicide Capsule: స్విట్జర్లాండ్‌లో సూసైడ్ క్యాప్సుల్ సాయంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడికి సహకరించారన్న అనుమానంతో పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకుని క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అసలేం జరిగిందంటే?

Suicide Capsule
Suicide Capsule (AP Agency)

Suicide Capsule:ప్రస్తుతం ఆత్మహత్యలు చేసుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. సూసైడ్స్​కు మానసిక సమస్యలే ప్రధాన కారణాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్క్, ఆర్థిక సమస్యలు, ఆరోగ్యం వంటి సమస్యల కారణంగా మొదలయ్యే ఒత్తిడి క్రమంగా మనిషిని బలహీనం చేస్తోందని అభిప్రాయపడుతున్నారు. ఇలా మొదలైన ఒత్తిడి.. ఆందోళన, నిరాశగా మారుతుందని, ఇవి ఆత్మహత్యలకు దారితీస్తున్నాయని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైకియాట్రి అండ్‌ బిహేవియరల్‌ సైన్స్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ రాజీవ్‌ మెహతా తెలిపారు.

సూసైడ్ క్యాప్సుల్:

  • ఆత్మహత్యల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో స్విట్జర్లాండ్​లో సూసైడ్‌ క్యాప్సూల్​ను అందుబాటులోకి తీసుకొచ్చారు.
  • ఇది ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారు నొప్పి లేకుండా తనువు చాలించేందుకు ఉపయోగపడుతుంది.
  • సార్కో క్యాప్సూల్‌గా పిలిచే ఈ మెషీన్‌ను లాస్ట్‌ రిసార్ట్‌ ఆర్గనైజేషన్‌ అనే సంస్థ తయారుచేసింది.

సూసైడ్‌ క్యాప్సూల్​లో మొదటి ఆత్మహత్య:

  • కొత్తగా రూపొందించిన ఈ సూసైడ్ మెషీన్ సాయంతో స్విట్జర్లాండ్​లో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.
  • గతంలో ఎవరూ దీన్ని ఎవరూ ఉపయోగించలేదు.
  • మేరీషాజన్‌ అటవీ ప్రాంతంలోని ఓ ఇంటిలో కొందరి సాయంతో ఈ మెషీన్​లో సోమవారం ఆత్మహత్య జరిగినట్లు అందిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు.
  • ఆత్మహత్యకు ప్రేరేపించారన్న అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
  • వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు దక్షిణ స్విట్జర్లాండ్‌ పోలీసులు తెలిపారు.

సూసైడ్‌ క్యాప్సూల్ ఎలా పనిచేస్తుందంటే?:

  • ఈ సూసైడ్ క్యాప్సూల్‌లో మనిషి పట్టేలా బెడ్ ఉంటుంది.
  • ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వారు దీని లోపలికి వెళ్లాలి.
  • అనంతరం దాని మూత పెట్టేసిన తర్వాత ఎవరు మీరు? మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలుసా? ఈ బటన్‌ నొక్కితే ఏమవుతుందో తెలుసా? వంటి 3 ఆటోమేటెడ్‌ ప్రశ్నలను క్యాప్సూల్‌ అడుగుతుంది.
  • వీటన్నింటికి సమాధానం చెప్పిన తర్వాత మీరు చనిపోవాలనుకుంటే 'ఈ బటన్‌ నొక్కండి' అని అందులో వినిపిస్తుంది.
  • బటన్‌ నొక్కిన 30 సెకన్లలో నైట్రోజన్‌ వాయువు విడుదల మొదలవుతుంది.
  • క్యాప్సూల్‌లో 21 శాతంగా ఉండే ఆక్సిజన్‌ స్థాయిలు 0.05 శాతానికి పడిపోయి.. నైట్రోజన్‌ స్థాయిలు పెరిగిపోతాయి.
  • దీంతో మనిషి 5 నిమిషాల పాటు స్పృహ కోల్పోయి తర్వాత మరణిస్తాడు.
  • ఈ సూసైడ్ మెషీన్​లో ఒకసారి బటన్‌ నొక్కితే తర్వాత ప్రాణాలు దక్కవని దీని సృష్టికర్త ఫిలిప్‌ నిట్స్‌ఖే తెలిపారు.

వారికి మాత్రమే:

  • ఈ సూసైడ్ క్యాప్సూల్‌ వినియోగించాలంటే కనీసం 50 ఏళ్ల వయస్సు ఉండాలి.
  • తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్న వారైతే 18 ఏళ్లు దాటాలని ఫిలిప్‌ చెప్పారు.
  • ఈ సూసైడ్ క్యాప్సూల్‌ వినియోగానికి దాదాపు రూ.1,700 ఖర్చవుతాయని లాస్ట్‌ రిసార్ట్‌ ఆర్గనైజేషన్‌ సంస్థ ప్రకటించింది.

'లవ్'.. ఈ పేరు వినగానే మీ బ్రెయిన్​లో ఏం జరుగుతుందో తెలుసా? - Scientists FOUND How Love Lights Up

బెంగళూరు ఎగ్జిబిషన్​లో ఫస్ట్ వరల్డ్ వార్ వెపన్స్- సీవీ రామన్ తబలా కూడా- ఇంకా ఏం ప్రదర్శించారంటే? - Science Exhibition in Bangalore

Last Updated : 4 hours ago

ABOUT THE AUTHOR

...view details