తెలంగాణ

telangana

ETV Bharat / technology

పవర్​ఫుల్ ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 15తో శాంసంగ్ 5G స్మార్ట్​ఫోన్!- కేవలం రూ.10,499లకే! - SAMSUNG GALAXY A06 5G

దేశీయ మార్కెట్​లో శాంసంగ్ A06 5G లాంఛ్- ధర, ఫీచర్ల వివరాలు ఇవే!

Samsung Galaxy A06 5G
Samsung Galaxy A06 5G (Photo Credit- Samsung)

By ETV Bharat Tech Team

Published : Feb 20, 2025, 1:34 PM IST

Samsung Galaxy A06 5G:శాంసంగ్ ప్రియులకు గుడ్​న్యూస్. కిర్రాక్ ఫీచర్లతో బడ్జెట్ ధరలోనే మార్కెట్​లో 'శాంసంగ్ A06 5G' స్మార్ట్​ఫోన్ లాంఛ్ అయింది. దీని ధర రూ. 10,499 నుంచి ప్రారంభమవుతుంది. శాంసంగ్ దీన్ని ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్​లతో పాటు దీన్ని అదిరే లుక్​లో డిజైన్ చేసింది. గతేడాది ఇదే ఫోన్​ను 4G వేరియంట్‌లో తీసుకుని రాగా, ఇప్పుడు దీన్ని 5G నెట్‌వర్క్‌ సపోర్ట్​తో లాంఛ్ చేసింది. అంతేకాక దీనికి మరో నాలుగు మేజర్‌ ఆండ్రాయిడ్‌ అప్‌డేట్లు ఇస్తామని శాంసంగ్ చెబుతోంది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లు, స్పెసిఫికేషన్లపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

'శాంసంగ్ గెలాక్సీ A06 5G' స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్:

డిస్​ప్లే: ఈ ఫోన్​ 6.7 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేతో వస్తోంది. ఇది 90Hz రిఫ్రెష్‌ రేటుకు సపోర్ట్‌ చేస్తుంది.

Samsung Galaxy A06 5G 17.13 cm Large Display (Photo Credit- Samsung)

ప్రాసెసర్:కంపెనీ ప్రాసెసర్ కోసం దీనిలో డైమెన్‌సిటీ 6300 చిప్‌సెట్​ను అమర్చింది. ర్యామ్‌ ప్లస్‌ ఫీచర్‌ ద్వారా 12GB వరకు ర్యామ్‌ను పెంచుకోవచ్చు.

కెమెరా సెటప్:ఈ ఫోన్ వెనక వైపు 50MP కెమెరాతో పాటు 2MP కెమెరా డెప్త్‌ సెన్సర్‌ ఉంది. ఇక సెల్ఫీలు, వీడియో కాలింగ్​ కోసం ఈ ఫోన్ ముందు వైపు 8MP కెమెరాను కలిగి ఉంది.

Samsung Galaxy A06 5G Camera (Photo Credit- Samsung)

బ్యాటరీ: ఇందులో 5000mAh బ్యాటరీ ఉంది. ఇది 25W ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది.

Samsung Galaxy A06 5G Battery Life (Photo Credit- Samsung)

ఆపరేటింగ్ సిస్టమ్:ఈ ఫోన్ ఔటాఫ్‌ బాక్స్‌ ఆండ్రాయిడ్‌ 15తో కూడిన వన్‌యూఐ 7తో వస్తోంది. దీనికి నాలుగేళ్లపాటు మేజర్‌ ఆండ్రాయిడ్‌ అప్‌డేట్స్‌, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ఇస్తామని కంపెనీ చెబుతోంది.

Samsung Galaxy A06 5G OS upgrades (Photo Credit- Samsung)

ప్రొటెక్షన్:ఈ ఫోన్‌ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్సీ కోసం IP54 రేటింగ్‌తో వస్తోంది.

Samsung Galaxy A06 5G Reliable Protection for Daily Life (Photo Credit- Samsung)

దీంతోపాటు 12 5G బ్యాండ్లకు తమ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుందని శాంసంగ్ చెబుతోంది.

Samsung Galaxy A06 5G Superfast Connectivity (Photo Credit- Samsung)

కలర్ ఆప్షన్స్:మార్కెట్లో ఈ ఫోన్ మూడు కలర్ ఆప్షన్​లతో అందుబాటులో ఉంది.

  • బ్లాక్‌
  • గ్రే
  • లైట్‌ గ్రీన్

వేరియంట్స్: కంపెనీ ఈ ఫోన్​ను మూడు వేరియంట్లలో తీసుకొచ్చింది.

  • 4GB RAM + 64GB స్టోరేజ్
  • 4GB RAM + 128GB స్టోరేజ్
  • 6GB RAM + 128GB స్టోరేజ్

వేరియంట్ల వారీగా ధరలు:

  • 4GB RAM + 64GB స్టోరేజ్​తో ఈ ఫోన్ ధర: రూ.10,499
  • 4GB RAM + 128GB స్టోరేజ్​తో ఈ ఫోన్ ధర: రూ.11,499
  • 6GB RAM + 128GB స్టోరేజ్​తో ఈ ఫోన్ ధర: రూ.12,999

సేల్స్ డీటెయిల్స్:ఈ ఫోన్ శాంసంగ్‌ఎక్స్‌క్లూజివ్‌ స్టోర్లతో పాటు అన్ని రిటైల్‌ ఔట్‌లెట్లలో లభిస్తుంది. అయితే దీనితో పాటు బాక్స్‌లో కేవలం టైప్‌-C కేబుల్‌ మాత్రమే లభిస్తుంది. దీంతో ఛార్జింగ్‌ అడాప్టర్​ను విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక రూ.129 చెల్లించి శాంసంగ్‌ కేర్‌+ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే ఈ ఫోన్​కు ఏడాది పాటు స్క్రీన్‌ రీప్లేస్ వారెంటీ లభిస్తుంది.

స్మార్ట్ టీవీ కోసం 'జియోటెలి ఓఎస్‌'- ఇండియా ఓన్ స్మార్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇదే!

గ్లోబల్​ మార్కెట్​లోకి మొట్ట మొదటి ట్రై ఫోల్డ్ ఫోన్- ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

'థింకింగ్ మెషీన్స్ ల్యాబ్'- ఇకపై AI టెక్నాలజీ మరింత యూజ్​ఫుల్​!

ABOUT THE AUTHOR

...view details