Samsung A55 Phone Launch :ప్రముఖ ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ శాంసంగ్ బుధవారం ఇండియన్ మార్కెట్లో గెలాక్సీ ఏ55 5G; గెలాక్సీ ఏ35 5G ఫోన్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సరికొత్త 'A' సిరీస్ మొబైల్ ఫోన్లు గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్, ఏఐ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటాయి. అలాగే ఇవి ట్యాంపర్-రెసిస్టెంట్ సెక్యూరిటీ సొల్యూషన్, శాంసంగ్ నాక్స్ వాల్ట్‌తోపాటు పలు సరికొత్త ఫీచర్లు కలిగి ఉన్నాయని శాంసంగ్ కంపెనీ తెలిపింది.
"గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్మార్ట్‌ఫోన్ సిరీస్‌గా 'గెలాక్సీ ఏ' సిరీస్ నిలిచింది. ముఖ్యంగా భారతదేశ వినియోగదారుల నుంచి అపూర్వమైన ఆదరణను పొందింది. గెలాక్సీ ఏ55 5G & ఏ35 5G విడుదల ప్రతిష్టాత్మక ఆవిష్కరణలను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలనే మా నిబద్ధతను బలోపేతం చేస్తుంది. గెలాక్సీ ఏ55 5G & ఏ35 స్మార్ట్ఫోన్లను 5G సెగ్మెంట్‌లో తీసుకువస్తున్నాం. ఇండియాలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మిడ్-ప్రీమియం (రూ.30,000 - రూ.50,000) సెగ్మెంట్‌లో మా నాయకత్వాన్ని ఏకీకృతం చేయడంలో ఇవి మాకు సహాయపడతాయి."
_ గుఫ్రాన్ ఆలం, శాంసంగ్ ఇండియా ఎంఎక్స్ బిజినెస్ సీనియర్ డైరెక్టర్
Samsung A55, A35 5G Features :
సూపర్ డిజైన్ : మొదటి సారి గెలాక్సీ ఏ55 5Gను మెటల్ ఫ్రేమ్‌తో తీసుకువస్తున్నారు. గెలాక్సీ ఏ35 5G అయితే ప్రీమియం గ్లాస్ బ్యాక్‌తో వస్తుంది. ఈ ఫోన్‌లు ఆసమ్ లిలక్, ఆసమ్ ఐస్ బ్లూ, ఆసమ్ నేవీ అనే 3 కలర్ వేరియంట్లలో లభిస్తున్నాయి. వీటికి ఐపీ 67 రేటింగ్ ఉంది. అందువల్ల 1 మీటర్ లోతున్న నీళ్లలో పడిపోయినా, 30 నిమిషాల వరకు వీటికి ఏమీ కాదు. పైగా ఇవి దుమ్ము, ఇసుకను కూడా సమర్థవంతంగా నిరోధించగలుగుతాయి.
బెస్ట్ డిస్ప్లే : శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు 6.6-అంగుళాల FHD+ సూపర్ అమోలెడ్ డిస్ప్లేతో, కనిష్టీకరించిన బెజెల్స్‌తో వస్తాయి. 120Hz రిఫ్రెష్ రేట్ చాలా మృదువైన పనితీరును అందిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు ముందు, వెనుక భాగాలు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్+ ప్రొటక్షన్‌తో వస్తాయి.
ఏఐ కెమెరా : ఈ కొత్త 'ఏ' సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు ఏఐ-కెమెరా ఫీచర్స్‌తో వస్తున్నాయి. వీటిని ఉపయోగించి ఫోటో రీమాస్టర్, ఇమేజ్ క్లిప్పర్, ఆబ్జెక్ట్ ఎరేజర్ చేసుకోవచ్చు. గెలాక్సీ ఏ55 5G, ఏ35 5Gలు ఏఐ ఇమేజ్ సిగ్నల్ ప్రాసెసింగ్ (ISP) సామర్థ్యంతో వస్తాయి. కనుక రాత్రి వేళల్లోనూ వీటితో అద్భుతమైన చిత్రాలు, వీడియోలు తీసుకోవచ్చు. ఈ ఫోన్లు 50ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తాయి.
హై సెక్యూరిటీ : శాంసంగ్ నాక్స్ వాల్ట్ సెక్యూరిటీని మొదటిసారిగా ఏ -సిరీస్‌లో పొందుపరిచారు. కనుక యూజర్లకు ఫ్లాగ్‌షిప్ స్థాయి భద్రత లభిస్తుంది.
ప్రాసెసర్ :గెలాక్సీ ఏ55 5Gలో సరికొత్త ఎక్సినాస్ 1480 ప్రాసెసర్ ఉంటుంది. గెలాక్సీ ఏ35 5Gలో 5nm ప్రాసెస్ టెక్నాలజీపై నిర్మించిన ఎక్సినాస్ 1380 ప్రాసెసర్ ఉంది. ఈ పవర్-ప్యాక్డ్ ఫోన్లు NPU, GPU, CPU అప్‌గ్రేడ్స్‌తో, 70%+ పెద్ద కూలింగ్ ఛాంబర్‌తో వస్తాయి. కనుక హెవీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు.