Royal Enfield Scram 440 Launched:రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహన ప్రియులకు గుడ్‌న్యూస్. మార్కెట్లోకి ఈ బ్రాండ్ నుంచి అదిరే మోటార్‌సైకిల్ ఎంట్రీ ఇచ్చింది. రెట్రో-మోడ్రన్ మోటార్‌సైకిల్ తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ ఏడాదికి తన మొదటి ప్రొడక్ట్‌ను లాంఛ్ చేసింది. 'రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440' పేరుతో కొత్త బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. మరెందుకు ఆలస్యం దీని ధర, ఫీచర్లపై ఓ లుక్కేద్దాం రండి.
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440వేరియంట్స్: ఈ మోటార్‌సైకిల్ మొత్తం రెండు వేరియంట్లలో రిలీజ్ అయింది.
- ట్రైల్
- ఫోర్స్
ధరలు:
- ట్రైల్ వేరియంట్ ధర:రూ. 2.08 లక్షలు (ఎక్స్-షోరూమ్)
- ఫోర్స్ వేరియంట్ ధర: రూ. 2.15 లక్షలు (ఎక్స్-షోరూమ్)
రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 పవర్‌ట్రెయిన్:ఈ కొత్త మోటార్ సైకిల్లో ఎయిర్/ఆయిల్-కూల్డ్, 443cc, సింగిల్-సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 25 bhp శక్తిని, 34Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పెద్ద ఇంజిన్‌ను కంపెనీ ప్రస్తుత 411cc ఇంజిన్ నుంచి తీసుకున్నారు. ఇప్పుడు దీని బోర్ 3mm పెరిగింది.
ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ స్క్రామ్ 440 ఇంజిన్‌ను 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. అదే సమయంలో ప్రస్తుత 411cc ఇంజిన్ 5-స్పీడ్ యూనిట్‌తో జత అయి ఉంటుంది. ఇక ఈ కొత్త బైక్ SOHC వాల్వ్‌ట్రెయిన్‌ను మెరుగుపరచడం ద్వారా NVH లెవెల్స్‌ను తగ్గించడంలో పనిచేశామని కంపెనీ తెలిపింది.