Reliance Hanooman AI Model Launch :ఇండియాకు చెందిన 'భారత్ జీపీటీ' గ్రూప్ మార్చి నెలలో 'హనుమాన్' అనే ఏఐ మోడల్‌ను లాంఛ్ చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ప్రపంచాన్ని ఊపేస్తున్న చాట్‌జీపీటీ లాంటి సేవలనే ఇది అందించనుంది. ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా 8 యూనివర్సిటీలు - భారత్ జీపీటీ గ్రూప్ వెనుక ఉన్నాయి.
11 భాషల్లో
భారత్‌జీపీటీ ముంబయిలో జరిగిన టెక్నాలజీ కాన్ఫరెన్స్‌లో 'హనుమాన్' పేరుతో 'లార్జ్ లాంగ్వేజ్ మోడల్'ను ప్రదర్శించింది. ఈ హనుమాన్ ఏఐ మోడల్ 11 భాషల్లో విద్య, వైద్యం, ఆర్థిక, పరిపాల రంగాల్లో సేవలు అందిస్తుందని తెలిపింది.
టెస్టింగ్
ఈ హనుమాన్ ఏఐ మోడల్ పనితీరును తెలియజేసే వీడియోను కూడా భారత్‌జీపీటీ ప్రదర్శించింది. అందులో ఓ వ్యక్తి తమిళంలో ఏఐ బాట్‌తో మాట్లాడి సమాధానం రాబట్టారు. ఓ బ్యాంకర్ హిందీ భాషలో హనుమాన్ ఏఐతో చాట్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ కంప్యూటర్ కోడ్‌ను రాసేందుకు కూడా ఈ ఏఐ బాట్‌ను ఉపయోగించారు. ఈ హనుమాన్ ఏఐ మోడల్‌ను ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ యూనివర్సిటీలు, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కలిసి అభివృద్ధి చేశాయి.
యూజర్ ఫ్రెండ్లీ
హన్మాన్ ఏఐ మోడల్ ద్వారా స్పీచ్-టు-టెక్ట్స్ కూడా జనరేట్ చేయవచ్చు అని తెలుస్తోంది. దీన్ని ఆధారం చేసుకొని ప్రత్యేక అవసరాలకు కావాల్సిన మోడళ్లను రిలయన్స్ జియో అభివృద్ధి చేస్తోంది. రిలయన్స్ కంపెనీ ఇప్పటికే తమ సబ్స్క్రైబర్లకు ఏఐ సేవలను అందించేందుకు 'జియో బ్రెయిన్' పేరిట ఓ మోడల్‌ను తయారు చేస్తోంది.