తెలంగాణ

telangana

ETV Bharat / technology

లేటెస్ట్ ప్రాసెసర్, హై ఎండ్ కెమెరా, సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్.. ప్రీమియం ఫీచర్లతో వన్​ప్లస్ 13 సిరీస్ వచ్చేశాయ్! - ONEPLUS 13 SERIES LAUNCHED

ఎట్టకేలకూ ఇండియన్ మార్కెట్లోకి వన్​ప్లస్ 13 సిరీస్- ధర, ఫీచర్లు ఇవే..!

Oneplus 13 Series Launched
Oneplus 13 Series Launched (Photo Credit- OnePlus India)

By ETV Bharat Tech Team

Published : Jan 8, 2025, 1:07 PM IST

Oneplus 13 Series Launched:ఇండియన్ మార్కెట్లోకి ఎట్టకేలకూ వన్​ప్లస్ 13 సిరీస్ ఎంట్రీ ఇచ్చాయి. కంపెనీ ఈ సిరీస్​లో రెండు మోడల్స్ తీసుకొచ్చింది. వాటిలో అనేక డిజైన్, ఫీచర్లతో అప్​డేట్​లతో ఈ ప్రీమియం రేంజ్​ స్మార్ట్​ఫోన్లను రిలీజ్ చేసింది. ఈ కొత్త సిరీస్‌లో కర్వ్డ్ డిస్‌ప్లేను రీప్లేస్ చేసి ఫ్లాట్ డిస్‌ప్లేను అందించింది. కెమెరా బంప్ డిజైన్ కూడా కొద్దిగా మారింది. అంతేకాకా కంపెనీ ఈ సేల్ ఎక్స్ఛేంజ్ బోనస్, ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్, నో కాస్ట్ EMI, ఫ్రీ ప్రొటెక్షన్ ప్లాన్, లైఫ్‌టైమ్ వారంటీతో పాటు స్పెషల్ మెంబర్​షిప్ బెనిఫిట్స్​ను కూడా అందిస్తోంది.

వన్​ప్లస్​ 13 స్పెసిఫికేషన్లు: ఇందులో 6.82-అంగుళాల BOE X2 2K+ AMOLED డిస్​ప్లే ఉంది. ఇది 4,500 నిట్స్ పీక్ బ్రైట్​నెస్​కు సపోర్ట్ చేస్తుంది. అంటే సూర్యరశ్మిలో కూడా దీని స్క్రీన్ బాగా కన్పిస్తుంది. ఇందులో స్నాప్​డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్​ఫోన్​ 24GB LPDDR5X RAM అండ్ 1TB UFS 4.0 స్టోరేజీతో తీసుకొచ్చారు.

వన్​ప్లస్​ 13 కెమెరా అండ్ బ్యాటరీ: వన్​ప్లస్ 13 ట్రిపుల్ కెమెరా సెటప్​ను కలిగి ఉంది. ఇందులో 50MP సోనీ LYT-808 ప్రైమరీ సెన్సార్, 50MP టెలిఫొటో లెన్స్, 50MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉంది. వీటితో పాటు సెల్ఫీలు, వీడియో కాల్స్​ కోసం ఇందులో 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ప్రీమియం స్మార్ట్​ఫోన్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్సీతో వస్తోంది. ఇందులో 6,000mAh బ్యాటరీ ఉంది. ఇది 100W SuperVOOC స్పీడ్ ఛార్జింగ్​కు సపోర్ట్ చేస్తుంది.

వన్​ప్లస్​ 13R స్పెసిఫికేషన్లు:ఈ సిరీస్​లో వన్​ప్లస్​ 13R వేరియంట్ అనేది అఫర్డబుల్ స్మార్ట్​ఫోన్. దీన్ని 6.7 అంగుళాల 8T LTPO AMOLED డిస్​ప్లేతో తీసుకొచ్చారు. ఇది 4,500 నిట్స్​ పీక్​ బ్రైట్​నెస్​కు సపోర్ట్ చేస్తుంది. వీటీతో పాటు ఈ స్మార్ట్​ఫోన్ ఒప్పో క్రిస్టల్ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్​తో వస్తుంది. ఇందులో క్వాల్​కామ్ స్నాప్​డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ ఉంది. ఈ స్మార్ట్​ఫోన్ కూడా ట్రిపుల్ కెమెరా సెటప్​ను కలిగి ఉంది. ఇందులో 50MP ప్రైమరీ సెన్సార్ ఉంది.

వన్​ప్లస్​ 13 వేరియంట్స్: కంపెనీ ఈ మోడల్​లో మూడు వేరియంట్స్​ను తీసుకొచ్చింది.

  • 12GB RAM + 256GB
  • 16GB RAM + 512GB
  • 24GB RAM + 1TB

వన్​ప్లస్​ 13 స్మార్ట్​ఫోన్ ధర:

  • 12GB RAM + 256GB వేరియంట్ ధర: రూ.69,999
  • 16GB RAM + 512GB వేరియంట్ ధర: రూ. 76,999
  • 24GB RAM + 1TB వేరియంట్ ధర: రూ. 89,999

కంపెనీ ఈ స్మార్ట్​ఫోన్ కొనుగోలు సమయంలో ICICI బ్యాంక్ కార్డ్‌పై రూ.5,000 డిస్కౌంట్ అందిస్తోంది. అంతేకాక రూ.5,000 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. మార్కెట్లో ఈ ప్రీమియం స్మార్ట్​ఫోన్ సేల్స్​ 13 జనవరి 10, 2025 నుంచి ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, వన్​ప్లస్​ అధికారిక రిటైల్ షాపులలో ప్రారంభం కానున్నాయి.

వన్​ప్లస్​ 13R వేరియంట్స్:స్మార్ట్​ఫోన్​లో రెండు వేరియంట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.

  • 12GB RAM + 256GB
  • 16GB RAM + 512GB

వన్​ప్లస్​ 13R స్మార్ట్​ఫోన్ ధర:

  • 12GB RAM + 256GB వేరియంట్ ధర: రూ.42,999
  • 16GB RAM + 512GB వేరియంట్ ధర: రూ. 49,999

కంపెనీ ఈ స్మార్ట్​ఫోన్ కొనుగోలుపై రూ.3,000 బ్యాంక్ డిస్కౌంట్, రూ. 4,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. ఈ వన్​ప్లస్​ 13R మొదటి సేల్ జనవరి 13, 2025 నుంచి ఇ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో ప్రారంభమవుతుంది.

మాగ్నెటిక్ ఛార్జర్, వన్‌ప్లస్ బడ్స్ ప్రో 3 లాంఛ్: వన్​ప్లస్ ఈ సిరీస్​తో పాటు వన్​ప్లస్​ 50W AIRVOOC మాగ్నెటిక్ ఛార్జర్‌ను కూడా విడుదల చేసింది. దీని ధర రూ.5,999. దీనితో పాటు మాగ్నెటిక్ కేస్‌ను కూడా ప్రవేశపెట్టింది. శాండ్‌స్టోన్ వేరియంట్ ధర రూ.1,299. దాని ఉడ్ గ్రెయిన్ వేరియంట్ ధర రూ.2,299. అలాగే వన్​ప్లస్​ బడ్స్ ప్రో 3 బ్లూ వేరియంట్ కూడా పరిచయం చేసింది. దీని ధర రూ. 11,999.

ఎంజీ విండ్సార్ ఈవీ ధరల పెంపు- ఫ్రీ ఛార్జింగ్​ ఫెసిలిటీకి కూడా గుడ్​బై

50MP కెమెరా, ఆండ్రాయిడ్ 15 ఓఎస్​తో మోటో జీ05- కేవలం రూ.6,999లకే!

అంతరిక్షంలో అంకురోత్పత్తి- ఆకులు తొడిగిన అలసంద- సత్తా చాటిన ఇస్రో

ABOUT THE AUTHOR

...view details