Nothing Phone 3a Series Launch:నథింగ్ ఫోన్ 3a సిరీస్ మార్చి 4న భారతదేశంలో సహా ప్రపంచవ్యాప్తంగా లాంఛ్ కానుంది. ఈ సిరీస్‌లో కంపెనీ 'నథింగ్ ఫోన్ 3a', 'నథింగ్ ఫోన్ 3a ప్రో' అనే రెండు ఫోన్లను లాంఛ్ చేయొచ్చు. ఈ 'నథింగ్ ఫోన్ 3a' సిరీస్ లాంఛ్ చేస్తున్నట్లు కంపెనీ కొన్ని వారాల క్రితమే ప్రకటించింది. ఈ నేపథ్యంలో కంపెనీ దీని కెమెరా డిజైన్‌ను కూడా వెల్లడించింది. ఇప్పుడు తొలిసారిగా కంపెనీ తన అప్‌కమింగ్ ఫోన్ సిరీస్ డిజైన్‌ను అధికారికంగా రివీల్ చేసింది.
నథింగ్ ఫోన్ 3a సిరీస్ టీజర్:నథింగ్ ఈ అప్‌కమింగ్ సిరీస్ టీజర్‌ను తన అధికారిక సోషల్‌మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో పోస్ట్ ద్వారా వెల్లడించింది. ఈ పోస్ట్‌లో ఫోన్ బ్యాక్ డిజైన్‌ను రివీల్ చేసింది. కంపెనీ రిలీజ్ చేసిన ఈ టీజర్లో ఫోన్ వెనక భాగంలో మధ్యలో వృత్తాకార కెమెరా మాడ్యూల్ కన్పిస్తుంది. నథింగ్ పాత మోడల్ ఫోన్లలో ఉన్నట్లుగా ఇది మూడు గ్లిఫ్ LEDలతో వస్తుంది.
ఇక ఈ ఫోన్ కెమెరా మాడ్యూల్లో మూడు కెమెరా సెన్సార్లు కన్పిస్తాయి. దీనిలో ఒక కెమెరా సెన్సార్ పెరిస్కోప్ లెన్స్‌తో వస్తుంది. ఫోన్ వెనక భాగంలో LED ఫ్లాష్ యూనిట్ కూడా కన్పిస్తుంది. వీటితో పాటు ఈ ఫోన్ కుడి వైపున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ కూడా ఉండటం చూడొచ్చు. తన అధికారిక వీడియోలలో ఒకదానిలో 'నథింగ్ ఫోన్ 3a' సిరీస్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో వస్తుందని కంపెనీ కన్ఫార్మ్ చేసింది. ఇక ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'నథింగ్ ఫోన్ 3a' గురించి కూడా కంపెనీ ఆ వీడియోలోనే టీజ్ చేసింది.
నథింగ్ ఫోన్ 3a సిరీస్ స్పెసిఫికేషన్లు: 'నథింగ్ ఫోన్ 3a' సిరీస్ టీజర్ ప్రకారం కంపెనీ ఈ సిరీస్ హై-ఎండ్ మోడల్ అంటే 'నథింగ్ ఫోన్ 3a ప్రో' మోడల్‌లో మాత్రమే పెరిస్కోప్ కెమెరాను అందించొచ్చని తెలుస్తోంది. ఈ ఫోన్ వెనక భాగంలో 50MP ప్రైమరీ సెన్సార్ అందించనున్నట్లు కంపెనీ ఇప్పటికే వెల్లడించింది. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో వస్తుంది. ఫోన్ సెకండ్ వెనక కెమెరా 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది. దీని థర్డ్ కెమెరా OIS సపోర్ట్‌తో 50MP సోనీ పెరిస్కోప్ లెన్స్‌తో వస్తుంది. వీటితోపాటు సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో కంపెనీ 50MP ఫ్రంట్ కెమెరాను కూడా అందించొచ్చు.