తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఇకపై పిల్లల ఇన్​స్టా కంట్రోల్ పేరెంట్స్ చేతిలో- మైనర్లకు సరికొత్త టీన్ అకౌంట్స్! - Insta Teen Accounts - INSTA TEEN ACCOUNTS

Insta Teen Accounts: సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. 18ఏళ్ల లోపు వారి కోసం కొత్తగా ఇన్​స్టా టీన్ అకౌంట్స్‌ తీసుకొచ్చింది. దీంతో ఇకపై పిల్లల ఇన్‌స్టా అకౌంట్స్ తల్లిదండ్రుల కంట్రోల్​లో ఉండనున్నాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి.

Insta_Teen_Accounts
Insta_Teen_Accounts (Meta)

By ETV Bharat Tech Team

Published : Sep 18, 2024, 10:40 AM IST

Insta Teen Accounts:ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండ్ నడుస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అంతా సోషల్ మీడియాను విపరీతంగా వినియోగిస్తున్నాయి. అయితే ఇది పిల్లల జీవితంపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో దీనిపై ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది. 18ఏళ్ల లోపు వారి కోసం కొత్తగా ఇన్​స్టా టీన్ అకౌంట్స్‌ తీసుకొచ్చింది. ఈ సందర్భంగా అసలేంటీ టీన్ అకౌంట్? దీనివల్ల లాభాలేంటి? దీని అమలు ఎప్పటినుంచి? వంటి వివరాలు మీకోసం.

ఇన్​స్టా టీన్ అకౌంట్స్​తో లాభాలేంటి?:

  • మెటా తీసుకున్న ఈ నిర్ణయంతో ఇకపై పిల్లల ఇన్‌స్టా అకౌంట్స్ తల్లిదండ్రుల కంట్రోల్​లో ఉండనున్నాయి.
  • ఇన్​స్టాలో పిల్లల భద్రతను పెంచేందుకు ఇది తోడ్పడుతుంది.
  • 16 ఏళ్లలోపు ఉన్న యూజర్లు డిఫాల్ట్‌ సెట్టింగ్స్‌ మార్చుకోవాలనుకుంటే పేరెంట్స్ అనుమతి తప్పనిసరి. దీంతో పిల్లలు వాడే ఇన్​స్టా ఖాతాపై తల్లిదండ్రులు నిఘా సాధ్యమవుతుందని మెటా పేర్కొంది.
  • పేరెంట్స్‌ కావాలంటే పిల్లల ఇన్‌స్టా సందేశాలను యాక్సెస్‌ చేయొచ్చు. రోజువారీ యూసేజ్‌ను తనిఖీ చేయొచ్చు. నిర్ణీత సమయంలో ఇన్‌స్టా వాడకుండా బ్లాక్ చేయొచ్చు.
  • పిల్లలకు కూడా ఇన్‌స్టాగ్రామ్ సురక్షిత వేదికగా మార్చేందుకు మెటా ఈ నిర్ణయం తీసుకుంది.

ఏంటీ ఇన్​స్టా టీన్ అకౌంట్స్?:

  • ఇన్​స్టా టీన్‌ అకౌంట్స్‌ అన్నీ డిఫాల్ట్‌గా ప్రైవేటు అకౌంట్లుగా ఉంటాయి. దీంతో కొత్తగా ఎవరైనా మైనర్ల ఖాతాలను ఫాలో అవ్వాలని అకునేకుంటే ఆ రిక్వెస్టులను యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే వారి కంటెంట్‌ను చూడడం వీలుపడదు.
  • ఈ అకౌంట్స్ ఉన్నవారు ఇప్పటికే ఫాలో అయ్యే వ్యక్తులు, కనెక్ట్ అయిన వ్యక్తుల నుంచి మాత్రమే సందేశాలు అందుకోగలరు. వారు మాత్రమే ట్యాగ్‌ చేయగలరు.
  • టీన్ ఖాతాలకు సెన్సిటివ్‌ కంటెంట్‌ కంట్రోల్‌ ఉంటుంది. కాబట్టి చూపించే ఫీడ్‌పై పూర్తిగా నియంత్రణ ఉంటుంది.
  • డైరెక్ట్‌ మెసేజెస్, కామెంట్స్​లో అసభ్య పదజాలాన్ని ఇన్‌స్టామ్ ఆటోమేటిక్‌గా ఫిల్టర్‌ చేస్తుంది.
  • రోజులో యాప్‌ వాడకం 60 నిమిషాలు దాటిన తర్వాత వారికి నోటిఫికేషన్‌ వస్తుంది.
  • దీంతోపాటు రాత్రి 10 గంటల సమయం నుంచి ఉదయం 7 గంటల వరకు స్లీప్‌ మోడ్‌ ఆన్‌ అవుతుంది. ఆ సమయంలో నోటిఫికేషన్లేవీ రావు. పైగా డైరెక్ట్‌ మెసేజులకు ఆటో రిప్లయ్స్‌ వెళ్తాయి.
    Insta_Teen_Accounts (Meta)

ఇన్​స్టా టీన్ అకౌంట్స్​ అమలు ఎప్పటినుంచి?:

  • యూఎస్‌, యూకే, కెనడా, ఆస్ట్రేలియాల్లో మంగళవారం నుంచే కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నట్లు మెటా తెలిపింది.
  • అంటే కొత్తగా ఇన్‌స్టాలో చేరే 18 ఏళ్ల లోపు వారికి ఇకపై టీన్‌ అకౌంట్లను ఇస్తారు.
  • ఇప్పటికే ఉన్న అకౌంట్స్​ను 60 రోజుల్లోగా టీన్‌ అకౌంట్లుగా మారుస్తారు.
  • యూరోపియన్‌ యూనియన్‌లో ఈ ఏడాది చివరి నాటికి ఈ ఇన్​స్టా టీన్‌ అకౌంట్స్​ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
  • జనవరి నాటికి ప్రపంచవ్యాప్తంగా ఇన్​స్టా టీన్‌ అకౌంట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తామని మెటా తెలిపింది.

ఐఫోన్ లవర్స్​కు అమెజాన్ బంపర్ ఆఫర్- రూ.39,999లకే యాపిల్ ఐఫోన్ 13! - iPhone 13 for Rs 39999

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ డేట్స్ ఫిక్స్- ఈ కార్డు ఉన్నవారికి ఆఫర్లే ఆఫర్లు! - Amazon Great Indian Festival

ABOUT THE AUTHOR

...view details