తెలంగాణ

telangana

ETV Bharat / technology

వాహన ప్రియులకు గుడ్​న్యూస్- త్వరలో మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా స్పెషల్ ఎడిషన్

Hyundai Creta SE: ఫెస్టివల్ సీజన్​లో హ్యుందాయ్ క్రెటా స్పెషల్ ఎడిషన్ తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. దీనికి సంబంధించిన వివరాలు ప్రారంభానికి ముందే లీకయ్యాయి.

By ETV Bharat Tech Team

Published : 7 hours ago

Hyundai Creta SE
Hyundai Creta SE (Hyundai Motor)

Hyundai Creta SE:పండగ సీజన్​లో కస్టమర్లను ఆకర్షించేందుకు హ్యుందాయ్ మోటార్ ఇండియా తన క్రెటా స్పెషల్ ఎడిషన్​ను మార్కెట్లో లాంచ్ చేసేందుకు సిద్ధమవుతోంది. కాంపాక్ట్ SUV సెగ్మెంట్‌ను శాసిస్తున్న హ్యుందాయ్ క్రెటా చాలా కాలంగా సేల్స్​లో ప్రథమ స్థానంలో ఉంది. తన అగ్రస్థానాన్ని కొనసాగించుకునేందుకు హ్యుందాయ్ కొత్త ఆవిష్కరణలు జరుపుతోంది. హ్యుందాయ్ క్రెటా కొత్త ఎడిషన్‌ను ఫెస్టివల్ సీజన్‌లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

ఈ SUV హోమోలోగేషన్ పత్రాలు ప్రారంభ తేదీకి ముందే లీక్ అయ్యాయి. అందులో ఈ SUV పేరు కూడా ఉంది. దీన్ని ఫ్యూచర్​లో క్రెటా SE (స్పెషల్ ఎడిషన్) అని కూడా పిలవొచ్చు. హ్యుందాయ్ దీనిని త్వరలో విడుదల చేసే అవకాశం ఉంది. పండుగ సీజన్లో సేల్స్ పెంచుకునేందుకు సాధారణ మోడల్ నుంచి వేరు చేయడానికి క్రెటా SE కొన్ని విభిన్న డిజైన్‌తో ముందుకు రానుంది. హ్యుందాయ్ దీనిని త్వరలో మార్కెట్లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

హ్యుందాయ్ క్రెటా కొత్త వేరియంట్:

ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా అత్యధికంగా అమ్ముడైన మూడో కారు. ఈ నేపథ్యంలో పండగ సీజన్‌లో కొత్త వేరియంట్​ను పరిచయం చేసేందుకు హ్యుందాయ్ సిద్ధమవుతోంది. కొత్త క్రెటాతో పాటు, హ్యుందాయ్ టెక్నాలజీతో కూడిన SE వేరియంట్‌ను పరిచయం చేయబోతోంది. దీనిపై సమాచారం ఇంటర్నెట్​లో కనిపించిన హోమోలోగేషన్ డాక్యుమెంట్స్​లో ఉంది. ఇందులో హ్యుందాయ్ త్వరలో తన కొత్త 'SE' వేరియంట్‌ను విడుదల చేయనున్నట్లు సమాచారం ఉంది. త్వరలోనే షోరూమ్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. SE అనేది ప్రత్యేక ఎడిషన్ లేదా స్పోర్ట్స్ ఎడిషన్‌ని సూచిస్తుంది.

Hyundai Creta new SE variant (Transport Department, Delhi)

హ్యుందాయ్ క్రెటా SE వేరియంట్ S(O), SX(O) ట్రిమ్‌లపై ఆధారపడి ఉంటుందని హోమోలోగేషన్ పత్రాలు వెల్లడిస్తున్నాయి. ఈ కొత్త వేరియంట్‌లో మార్పులు బహుశా కాస్మెటిక్ సైడ్ మాత్రమే ఉండొచ్చు. మిగిలిన లైనప్​ నుంచి వేరు వేరు చేయడానికి కొన్ని బ్లాక్-అవుట్ స్టైలింగ్ ఎలిమెంట్స్ అలాగే కొన్ని ఇతర చిన్న మార్పులు ఉండవచ్చు. ఇది కాకుండా కొత్త వేరియంట్‌లలో అనేక కొత్త ఫీచర్లు కూడా ఇవ్వొచ్చు.

హ్యుందాయ్ క్రెటా SE వేరియంట్ ఇప్పటికే ఉన్న ఇంజిన్ ఆప్షన్స్​ను అలాగే ఉంచుతుంది. ఇందులో 1.5-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ 113 bhp పవర్, 144 Nm పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంది. ఇది 114 bhp పవర్​ని, 250 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ట్రాన్స్‌మిషన్ ఎంపికలలో పెట్రోల్‌తో CVT, డీజిల్‌తో టార్క్-కన్వర్టర్, రెండు ఇంజిన్‌లతో 6-స్పీడ్ మాన్యువల్ ఉన్నాయి.

మార్కెట్లో పోటీ:ఇండియన్ మార్కెట్లో హ్యుందాయ్ క్రెటా SE.. గ్రాండ్ విటారా, హేరైడర్, సెల్టోస్, ఎలివేట్, ఆస్టర్, కర్వ్, ఇతర SUVలతో పోటీపడుతుంది.

ఓలా ఎలక్ట్రిక్ షేర్లు ఢమాల్- కమెడియన్​పై భవిశ్ ఘాటు వ్యాఖ్యలే కారణమా..?

మీ పీఫ్ అకౌంట్​లో డబ్బు ఎంత ఉందో తెలుసుకోవాలా?- ఒక్క క్లిక్​తో చెక్ చేసుకోండిలా..!

ABOUT THE AUTHOR

...view details