How To Use ChatGPT Without Login : ప్రస్తుత సాంకేతిక యుగంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్(AI)కు ఫుల్ డిమాండ్ ఉంది. దాదాపు అన్ని రంగాల్లోనూ ఏఐ టెక్నాలజీని వాడుతున్నారు. ముఖ్యంగా ఓపెన్ ఏఐ కంపెనీ తీసుకొచ్చిన 'చాట్‌జీపీటీ'ని చాలా మంది వినియోగిస్తున్నారు. కొత్త యూజర్లు ఈ టూల్ వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే చాట్ జీపీటీ ఉపయోగించేందుకు అకౌంట్ క్రియేట్ చేసి, సైన్ ఇన్ కావాల్సిన అవసరం లేదు. లాగిన్ కాకుండానే ఎవరైనా చాట్‌జీపీటీ వాడుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
అకౌంట్ అవసరం లేదు!
ఈ-మెయిల్ ఐడీ లేదా ఫోన్ నంబర్ లేకుండానే చాట్‌జీపీటీను వాడుకోవచ్చు. అంతకుముందు యూజర్స్ ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఉపయోగించి గూగుల్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా చాట్ జీపీటీలో సైన్-ఇన్ చేయాల్సి వచ్చేది. అయితే ఓపెన్ ఏఐ ఏప్రిల్ 1 నుంచి చాట్‌జీపీటీ 3.5ను రోల్అవుట్ చేసింది. ఈ చాట్‌జీపీటీ వెర్షన్లో మీరు సైన్-ఇన్ చేయకుండానే, నేరుగా దానిని వాడుకోవచ్చు. అయితే చాట్‌జీపీటీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వినియోగదారులు మాత్రమే వాయిస్ చాట్స్, పర్సనలైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ లాంటి అదనపు సేవలు పొందగలుగుతారు. మిగతావారికి ఈ సేవలు అందుబాటులో ఉండవు.
ఏదిఏమైనప్పటికీ, ఈ చాట్‌జీపీటీ వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్టిపరిస్థితుల్లోనూ సున్నితమైన సమాచారాన్ని ఈ ఏఐ చాట్‌బాట్‌తో పంచుకోకూడదు. ఓపెన్ ఏఐ సంస్థకు చెందిన లేటెస్ట్ చాట్‌జీపీటీ 4 లేదా DALL-E లు ఉపయోగించాలంటే మాత్రం, కచ్చితంగా చాట్‌జీపీటీ అకౌంట్లో లాగిన్ కావాల్సి ఉంటుంది.