How To Stop Ads On Android Mobile :మొబైల్ ఫోన్లో వచ్చే యాడ్స్ మనల్ని చీకాకు పెడుతూ ఉంటాయి. ఏ యాప్ ఓపెన్ చేసినా, ముందుగా యాడ్స్ కనిపిస్తూ, మన పనులకు ఇబ్బంది కలిగిస్తుంటాయి. దీనికి ప్రధాన కారణం, మనకు తెలియకుండానే, మన ఫోన్లో కొన్ని యాప్స్ ఇన్స్టాల్ అవుతూ ఉంటాయి. ఇవి సాధారణంగా మనకు కనిపించవు. ఇవి మన ఆండ్రాయిడ్ ఫోన్లో ఆటోమేటిక్‌గా యాడ్స్ వచ్చేలా చేస్తాయి. అందుకే ఇలాంటి వాటిని ఎలా సింపుల్‌గా రిమూవ్ చేయాలో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
మొదటి పద్ధతి :How To Turn Off Ads On Any Smartphone
- ముందుగా మీ ఫోన్లోని Settings ను ఓపెన్ చేయండి.
- సెట్టింగ్స్‌లో Apps పై క్లిక్ చేయండి.
- తరువాత App managementపై క్లిక్ చేయండి.
- వెంటనే మీ మొబైల్ ఫోన్లో ఇన్స్టాల్ అయ్యున్న యాప్స్ అన్నీ అక్కడ కనిపిస్తాయి. కానీ కొన్ని యాప్స్ మాత్రం కనిపించకుండా ఉంటాయి.
- ఇలా కనిపించని యాప్స్‌ను చూడాలంటే, మీ మొబైల్‌ను డార్క్ మోడ్‌లోకి మార్చుకోవాలి.
- అప్పుడు App managementలో ఉన్న సీక్రెట్ లేదా హిడెన్ యాప్‌లు మనకు కనిపిస్తాయి. వైట్ మోడ్‌లో ఫోన్ ఆపరేట్ చేసేవారికి ఇలాంటి హిడెన్ యాప్‌లు కనిపించవు. ఎందుకంటే వీటికి ఎలాంటి ఐకాన్లు ఉండవు.
- ఇప్పుడు మీరు ఆ సీక్రెట్/ హిడెన్ యాప్‌పై క్లిక్ చేయాలి. కానీ వెంటనే దానిని అన్ఇన్స్టాల్ చేసేయకూడదు.
- ముందుగా Storage usageపై క్లిక్ చేసి clear data, cache లను పూర్తిగా తొలగించాలి. ఆ తరువాత మాత్రమే దానిని అన్ఇన్స్టాల్ చేయాలి.
- కానీ ఇక్కడితో పని అయిపోలేదు. ఇలాంటి హిడెన్ యాప్‌లను పర్మినెంట్‌గా మీ ఫోన్ నుంచి రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అది మళ్లీ అటోమేటిక్‌గా ఇన్స్టాల్ అయిపోతుంది.
- అందుకే మీరు ఈ హిడెన్ యాప్ ఎక్కడ డౌన్లోడ్ అయ్యుందో తెలుసుకోవాలి. ఇందుకోసం మీ File managerను ఓపెన్ చేయండి.
- ఇందులో Apps లోకి వెళ్తే, అక్కడ ఈ హిడెన్ యాప్ కనిపిస్తుంది. ఒకవేళ అక్కడ కూడా కనిపించకపోతే, Downloadsలోకి వెళ్లి చూడాలి.
- ఐకాన్ లేని యాప్‌లు మీకు కనిపిస్తాయి. వీటిని సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేసేయండి.
- దీనితో ఈ హిడెన్ లేదా సీక్రెట్ యాప్ మీ మొబైల్ నుంచి పర్మినెంట్‌గా డిలీట్ అయిపోతుంది.
- కానీ ఇక్కడితో దీని పని అయిపోదు. మనకు ఈ హిడెన్ యాప్ ఏ అప్లికేషన్ ద్వారా మొబైల్‌లోకి డౌన్లోడ్ అయ్యిందో తెలుసుకోవాలి.
- కానీ ఇది చాలా కష్టమైన పని. అందుకే మీ మొబైల్లో మీరు వాడని యాప్‌లు అన్నింటినీ డిలీట్ చేయాలి. ప్లేస్టోర్ నుంచి కాకుండా, థర్డ్ పార్టీ యాప్‌ల నుంచి డౌన్లోడ్ చేసుకున్న యాప్‌లను కూడా పూర్తిగా అన్ఇన్స్టాల్ చేసేయండి.
- ఈ విధంగా మీ మొబైల్లో వచ్చే పాప్అప్ యాడ్స్‌ను పూర్తిగా రిమూవ్ చేసుకోవచ్చు.