How to Delete Google Search History :మనకు ఏ చిన్న సందేహం వచ్చినా గూగుల్‌ను ఆశ్రయిస్తుంటాం. ఇలా సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్‌గా మన డేటా గూగుల్‌లో సేవ్ అయిపోతూ ఉంటుంది. అందువల్ల గూగుల్‌కు మన గురించి అనేక విషయాలు తెలిసిపోతుంటాయి. దీని వల్ల మన ప్రైవసీకి భంగం ఏర్పడే అవకాశం ఉంటుంది. అయితే దీని కోసం మీరేమీ చించతించాల్సిన పనిలేదు. గూగుల్‌లో స్టోర్ అయిన మన యాక్టివిటీని, సమాచారాన్ని చాలా సులువుగా డిలీట్ చేయవచ్చు.
సాధారణంగా గూగుల్ సైట్స్, యాప్స్ సేవలను వినియోగించినప్పుడు, మనకు సంబంధించిన యాక్టివిటీ మొత్తం Google Account లోని My Activityలో సేవ్ అవుతాయి. ఇందులో స్టోర్ అయ్యే మన పర్సనల్ డేటాను ఎలా తొలగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇండివిడ్యువల్ యాక్టివిటీని డిలీట్ చేయాలంటే?
Delete Individual Items :గూగుల్ అకౌంట్లోని My Activityలో సేవ్ అయిన డేటాలో, మీరు కోరుకున్న ఇండివిడ్యువల్ ఐటెమ్‌ను డిలీట్ చేయవచ్చు. లేదా మీరు కావాలనుకుంటే మొత్తం డేటాను కూడా డిలీట్ చేయవచ్చు. దీని కోసం,
- ముందుగా myactivity.google.com.లోకి వెళ్లండి.
- మీరు డిలీట్ చేయాలనుకుంటున్న స్పెసిఫిక్ ఐటమ్‌ను సెలెక్ట్ చేసుకోండి.
- అనంతరం డిలీట్ బటన్‌ను నొక్కండి.
- అంతే సింపుల్! మీరు తొలగించాలని అనుకున్న యాప్ లేదా సైట్‌కి సంబంధించి సేవ్డ్ హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోతుంది.
అన్నింటినీ ఒకేసారి డిలీట్ చేయాలంటే!
Delete It All : మీరు ఒకవేళ అన్ని సైట్స్ లేదా యాప్స్‌కు చెందిన డేటా మొత్తాన్ని ఒకేసారి డిలీట్ చేయలనుకుంటే,
- ముందుగా myactivity.google.com లోకి వెళ్లండి.
- స్క్రీన్ టాప్‌లో Your Activityపైన Delete ఆప్షన్ ఉంటుంది. దానిపై ట్యాప్ చేసి అక్కడే కనిపించే All Timeను సెలెక్ట్ చేయండి.
- అనంతరం Next>Deleteను నొక్కండి.
- అంతే సింపుల్! అప్పటి వరకు గూగుల్‌లో సేవ్ అయివున్న మీ యాక్టివిటీ వివరాలన్నీ డిలీట్ అయిపోతాయి.