తెలంగాణ

telangana

ఒక్కరోజులోనే పాన్​కార్డు కావాలా?- ఉచితంగా డౌన్​లోడ్ చేసుకోండిలా! - Free Instant e PAN

By ETV Bharat Tech Team

Published : Sep 5, 2024, 1:31 PM IST

Free Instant e-PAN: మీ వద్ద పాన్​కార్డు లేదా? దీంతో అత్యవసర పనులు నిలిచిపోయాయా? డోంట్ వర్రీ.. మీ కోసమే ఈ స్టోరీ. ఇలా చేస్తే ఒక్కరోజులోనే ఇన్​స్టాంట్ పాన్​కార్డు పొందొచ్చు. అది కూడా పూర్తి ఉచితంగానే. అదెలాగంటే?

Free_Instant_e_PAN
Free_Instant_e_PAN (ETV Bharat)

Free Instant e-PAN: ప్రస్తుతం ఆర్థిక లావాదేవీలు చేసే వారికి పాన్​ కార్డు అనేది తప్పనిసరి అయిపోయింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరి దగ్గరా పాన్​ కార్డు ఉంటే మంచిది. అయితే కొత్తగా పాన్​ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న సందర్భంలో కార్డు వచ్చేందుకు కొన్ని రోజులు వేచి ఉండాల్సి వస్తోంది. అలాంటి సందర్భాల్లో అత్యవసరంగా పాన్​ కార్డు కావాల్సివస్తే ఎలా? అయితే అలాంటి సందర్భాల్లో కేవలం 24 గంటల్లోనే మనం ఇన్​స్టాంట్ పాన్ కార్డు తీసుకోవచ్చు. ఇదే ఇ-పాన్ కార్డు. దీన్ని మనం ఇంట్లో కూర్చునే మొబైల్​ ఫోన్లో ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం రండి.

Free Instant e-PAN కోసం అప్లై చేసుకోవటం ఎలా?

  • Step 1: మొదట Income Tax Department వెబ్​సైట్​ను గూగుల్​లో సెర్చ్ చేయండి.
  • Step 2: ఇప్పుడు హోమ్​ స్క్రీన్​లో కన్పిస్తున్న క్విక్ లింక్స్​లోకి వెళ్లి e-PAN ఆప్షన్​ ఎంచుకుని Get New e-PAN ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • Step 3: తర్వాత అందులో మీ ఆధార్ నంబర్​ను​ ఎంటర్​ చేసి కింద కన్పిస్తున్న I Confirm That Checkboxపై ప్రెస్​ చేసి Continue ఆప్షన్​పై క్లిక్ చేయండి.
  • Step 4: ఇప్పుడు మీ ఆధార్ రిజిస్టర్డ్ నంబర్​కు 6 అంకెల OTP వస్తుంది. దీన్ని ఎంటర్ చేసిన తర్వాత మీ వివరాలు స్క్రీన్​పై కన్పిస్తాయి.
  • Step 5:ఆ వివరాలన్నీ సరిగా ఉన్నాయో లేదో ఓసారి చెక్​ చేసి I Accept That Checkboxపై క్లిక్ చేసి కంటిన్యూ ఆప్షన్​పై ప్రెస్ చేయండి.
  • Step 6:అంతే ఇప్పుడు మీ e-PAN కోసం అప్లై చేయటం పూర్తయినట్లే. ఆ తర్వాత మీకు అక్నాలెడ్జ్​మెంట్ నంబర్ వస్తుంది. దాన్ని ఎక్కడైనా సేవ్ చేసుకుంటే మంచిది.
  • Step 7:మీరు ఈ ప్రాసెస్ అంతా పూర్తి చేసిన తర్వాత మీ ఆధార్ లింక్డ్ మొబైల్​ నంబర్​కు కన్ఫర్మేషన్ నంబర్ వస్తుంది. వెంటనే Get New e-PAN పక్కనే ఉండే చెక్​ స్టేటస్ లేదా డౌన్​లోడ్​ పాన్​ ఆప్షన్​ను సెలక్ట్ చేసుకోండి.
  • Step 8:ఇప్పుడు మీ ఆధార్ నంబర్, OTP ఎంటర్ చేస్తే మీ పాన్ కార్డు వివరాలు కనిపిస్తాయి. అక్కడే New e-PAN, Download e-PAN ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు New e-PANను డౌన్​లోడ్ చేసుకుంటే అయిపోతుంది.

ABOUT THE AUTHOR

...view details