తెలంగాణ

telangana

ETV Bharat / technology

జీమెయిల్​లో సరికొత్త ఏఐ ఫీచర్- ఇకపై మీ రిప్లై మరింత స్మార్ట్‌ - Gmail Smart Reply Feature - GMAIL SMART REPLY FEATURE

Gmail Smart Reply Feature: జీమెయిల్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ సరికొత్త ఫీచర్​తో ఇకపై సందర్భోచిత రిప్లైస్ పంపడం సులభం కానుంది. ఈ సందర్భంగా ఏంటీ ఫీచర్? దీన్ని ఉపయోగించడం ఎలా? ఇది ఎప్పుడు అందుబాటులోకి వస్తుంది? వంటి వివరాలు తెలుసుకుందాం రండి.

Gmail Smart Reply Feature
Gmail Smart Reply Feature (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Sep 27, 2024, 5:23 PM IST

Gmail Smart Reply Feature: ప్రముఖ ఇ-మెయిల్‌ సర్వీస్‌ జీమెయిల్‌ సేవల్లో గూగుల్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చింది. సందర్భోచితంగా సమాధానం పంపేందుకు స్మార్ట్‌ రిప్లై సదుపాయాన్ని జోడించింది. దీని సాయంతో ఇకపై రిప్లై పంపడం సులభం కానుంది. ఈ సరికొత్త ఫీచర్ మరిన్ని వివరాలు మీకోసం.

ఏంటీ స్మార్ట్‌ రిప్లై ఫీచర్?:

  • మెయిల్స్‌కు రిప్లై ఇవ్వాలంటే జీమెయిల్‌సాధారణంగానే కొన్ని సూచనలను డిస్‌ప్లే చేస్తుంది.
  • 2017లోనే ఈ ఫీచర్‌ని తీసుకొచ్చింది.
  • అయితే దానికి ఇప్పుడు ఏఐ సదుపాయాన్ని జోడించింది.
  • దీంతో ఇక మీ రిప్లై మరింత స్మార్ట్‌గా మారనుంది.

దీన్ని ఎలా ఉపయోగించాలి?:

  • మీరు రిప్లై ఇవ్వాలనుకుంటున్న మెయిల్స్‌ను ఓపెన్‌ చేసి రిఫ్లై పై క్లిక్‌ చేయగానే కింద ఇందులోని ఏఐ సాంకేతికత మీకు అనేక సజెషన్లు డిస్‌ప్లే చేస్తుంది.
  • మెయిల్‌లో ఉండే ఇన్ఫర్మేషన్​ మొత్తాన్ని అర్థం చేసుకొని సందర్భోచితంగా ఈ ప్రత్యుత్తరాలు తయారుచేస్తుంది.
  • అర్థవంతంగా, స్మార్ట్‌గా, సరైన ముగింపుతో సమాధానాలురూపొందించి వాటిని మీకు చూపుతుంది.
  • అందులో నచ్చిన వాటిని ఎంచుకొని ప్రివ్యూ చేయొచ్చు.
  • ఒకవేళ ఏవైనా మార్పులు చేయాలనిపిస్తే ఎడిట్‌ చేసి సెండ్‌ చేసేయొచ్చు.

ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులోకి ఎప్పుడు?:

  • ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌లకు ఈ ఫీచర్‌ సపోర్ట్‌ చేస్తుంది.
  • ప్రస్తుతం గూగుల్ వన్‌ ఏఐ ప్రీమియంతో పాటు కొంతమంది వినియోగదారులకు మాత్రమే ఈ సరికొత్త ఫీచర్ అందుబాటులో ఉంది.
  • త్వరలోనే జీమెయిల్‌ యూజర్లందరికీ ఇది రోలవుట్‌ అవుతుంది.

వాట్సాప్ మెటా ఏఐలో సరికొత్త ఫీచర్లు- వీటి ఉపయోగం తెలిస్తే వావ్ అంటారంతే! - Meta AI Introduces 3 New Features

మెటా మరో కీలక నిర్ణయం- ఇన్‌స్టాలో బ్యూటీ ఫిల్టర్లకు గుడ్​బై! - Instagram Beauty Filters

ABOUT THE AUTHOR

...view details