Jobs in Artificial Intelligence:ఇందుగలదందు లేదని సందేహం వలదన్న మాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సరిగా సరిపోతుంది. మనం పొద్దున లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు అడుగడుగునా ఏఐ మన వెన్నంటే ఉంటుంది. విద్య నుంచి వైద్యం, వ్యాపారం నుంచి వ్యవసాయం వరకు అన్ని రంగాల్లో విస్తరించి ప్రపంచ రూపురేఖలను మారుస్తోంది. ప్రపంచం ఏఐ వెంట పరుగులు పెడుతున్న దృష్ట్యా ప్రభుత్వాలు, ప్రైవేటు రంగ సంస్థలు ఏఐపై తప్పక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏఐలో భారత్ ప్రపంచ అగ్రగామిగా ఎదగాలి అనే లక్ష్యాన్ని పెట్టుకుంది. అందుకోసం పలు కీలక చర్యలు తీసుకుంటోంది.
ఏఐలో 12.5 లక్షల ఉద్యోగాలు: దేశంలోని ఏఐ మార్కెట్ 2022-2027 నాటికి 25 నుంచి 35 శాతం వరకు వృద్ధి చెందుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో 2027 నాటికి దేశంలో ఏఐ నైపుణ్యం కలిగినవారి డిమాండ్ 6-6.5 లక్షల నుంచి 12.5 లక్షలకు పెరుగుతుందని ఓ నివేదిక అంచనా వేసింది.
ఇప్పటికే పలు సంస్థల్లో ఏఐ వినియోగం: గత సంవత్సరంలో ఇండియాలోని పలు సంస్థల్లో 43 శాతం మంది ఏఐని ఉపయోగించారు. దాదాపు 60శాతం మంది ఉద్యోగులు, 71శాతం GenZ("Gen Z" is an informal Term for Generation Z, which is the Generation of People Born Between 1997 and 2012)లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నైపుణ్యాలను పొందడం ద్వారా తమ కెరీర్లో అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని గుర్తించారు. ఈ నేపథ్యంలో ప్రతి ముగ్గురిలో ఇద్దరు భారతీయులు కనీసం ఒక డిజిటల్ నైపుణ్యాన్ని నేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.