Best Waterproof Smart Watches in India:టెక్నాలజీ రోజు రోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఎప్పటికప్పుడు అనేక ఎలక్ట్రానిక్ వస్తువులు మార్కెట్లో లాంచ్ అవుతున్నాయి. కార్లు, బైక్‌లు, మొబైల్ ఫోన్స్ ఈ కోవలోకే వస్తాయి. ఇవి ఎప్పటికప్పుడు కొంగొత్త మెరుగులు దిద్దుకుని స్టైలిష్ లుక్‌లో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అయితే వీటికేం తీసిపోకుండా స్మార్ట్ వాచ్‌లు కూడా అదిరే ఫీచర్స్‌తో మనముందుకు వస్తున్నాయి. వీటి ద్వారా హార్ట్ బీట్, ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. వాటర్ ప్రూఫ్‌లో కూడా అందుబాటులో ఉండటంతో యువత ఎక్కువగా వీటిపై ఆసక్తి చూపుతోంది. అయితే మార్కెట్లో వివిధ బ్రాండ్ల స్మార్ట్ వాచ్‌లు అందుబాటులో ఉండటంతో ఏది తీసుకోవాలో తెలియక తికమక పడుతున్నారు. ఈ నేపథ్యంలో అత్యుత్తమ ఫీచర్లతో తక్కువ ధరలో మార్కెట్లో ఉన్న టాప్ స్మార్ట్ వాచ్‌లు, వాటి ప్రత్యేకతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. Noise Vivid Call 2 Smart Watch: ఈ వాటర్ ప్రూఫ్ స్మార్ట్ వాచ్‌ను నాయిస్ ఫిట్ ప్రైమ్ యాప్‌తో కనెక్ట్ చేయవచ్చు. ఇది 1.85 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 7 రోజుల పాటు పనిచేస్తుంది. ఇది ఎప్పటికప్పుడు మీ హార్ట్ బీట్, నిద్ర, స్ట్రెస్ లెవల్స్‌ను ట్రాక్ చేస్తుంది.
- బ్రాండ్: నాయిస్
- స్పెషాలిటీ: వాటర్ రెసిస్టెన్సీ
- డిస్‌ప్లే:1.85 అంగుళాలు
- ధర:రూ.999
2. SKG Smart Watch:ఈ ఎస్ కేజీ స్మార్ట్ వాచ్ 1.7 అంగుళాల హెచ్డీ టచ్ స్క్రీన్‌తో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 8 రోజుల పాటు పనిచేస్తుంది. మనకు ఎంతో ఉపయోగపడే 14 స్పోర్ట్స్ మోడ్ల్ ఇందులో ఉన్నాయి.
- బ్రాండ్: ఎస్కేజీ
- డిస్‌ప్లే:1.7 అంగుళాలు
- స్పేషాలిటీ:వాటర్ రెసిస్టెన్సీ
- ధర: రూ. 1,401
3. AQFIT W6 smart watch: ఏక్యూఫిట్ డబ్ల్యూ6 స్మార్ట్ వాచ్ 1.69 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఐపీ68 రేటింగ్‌తో వస్తుంది. వాతావరణ సూచనలతో పాటు మెసేజెస్, కాల్స్, రోజువారీ రిమైండర్లను అందిస్తుంది. వాటర్ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్‌గానూ పనిచేస్తుంది. హార్ట్ బీట్, నిద్ర, కేలరీలు, శ్వాస తదితర వాటిని ఇది ట్రాక్ చేస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 7 రోజుల వరకు వినియోగించుకోవచ్చు. మహిళల కోసం 15 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి.
- బ్రాండ్: ఏక్యూఫిట్
- డిస్‌ప్లే: 1.69 అంగుళాలు
- స్పెషాలిటీ:వాటర్ ప్రూఫ్, డస్ట్ రెసిస్టెంట్
- ధర: రూ. 1,620
4. Fire-Boltt Ninja 3 Plus: ఫైర్ బోల్ట్ నింజా 3 ప్లస్ వాచ్ 1.83 అంగుళాల డిస్‌ప్లేతో మార్కెట్లో అందుబాటులో ఉంది. 240 x 284 పిక్సెల్ రిజల్యూషన్‌తో వస్తుంది. ఐపీ68 వాటర్ రెసిస్టెంట్ సామర్థ్యంతో లభిస్తుంది. ఇందులో ఇన్‌బిల్ట్ గేమ్స్, 118 స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. . దీన్ని ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 7 రోజుల వరకు పనిచేస్తుంది. దీనిలో స్విమ్మర్స్ కోసం స్మార్ట్ హెల్త్ అసిస్టెంట్ ఫీచర్ ఉంది. ఇది ఎస్పీO2 లెవల్స్, హార్ట్ బీట్, నిద్రను ట్రాక్ చేస్తుంది.
- బ్రాండ్:ఫైర్ బోల్ట్
- డిస్‌ప్లే: 1.83 అంగుళాలు
- స్పెషాలిటీ: వాటర్ రెసిస్టెంట్
- ధర: రూ. 1,299
5. FastTrack Limitless FS2 Plus: ఈ స్మార్ట్ వాచ్ 2.01 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఎప్పటికప్పుడు ఎస్పీO2 లెవల్స్, హార్ట్ బీట్, నిద్రను ట్రాక్ చేస్తుంది. ఈ వాచ్‌లో 100 ప్లస్ స్పోర్ట్స్ మోడ్‌లు, ఏఐ కోచ్, ఆటో మల్టీస్పోర్ట్ రికగ్నిషన్ తదితర ఫీచర్లు ఉన్నాయి. దీన్ని చార్జింగ్ చేస్తే 5 రోజుల పాటు ఉపయోగించుకోవచ్చు.
- బ్రాండ్:ఫాస్ట్ ట్రాక్
- డిస్‌ప్లే: 2.01 అంగుళాలు
- స్పెషాలిటీ:వాటర్ రెసిస్టెంట్
- ధర: రూ. 1,699