Best Smartphones Under 15K:ఫెస్టివల్ సేల్స్ త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ ఆఫర్ల సమయంలో తక్కువ ధరలకే స్మార్ట్ఫోన్లు లభించే అవకాశం ఉండడంతో చాలామంది కొనుగోలుకు సిద్ధమవుతుంటారు. ఒకవేళ మీరూ ఈ సేల్స్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మీ బడ్జెట్ రూ.15వేల లోపేనా? అయితే మీకోసమే ఈ స్టోరీ. ఫెస్టివల్ ఆఫర్లో తక్కువ ధరలో మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్ మొబైల్స్ మీకోసం.
రూ.10వేల లోపు మొబైల్స్ ఇవే:
Samsung A14 5G:
- రూ.10వేలల్లోపు శాంసంగ్ బ్రాండ్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తుంటే ఏ14 5జీ మంచి ఎంపిక అవుతుంది.
- డిస్ప్లే: 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ+
- కెమెరా: 50 ఎంపీ
- బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
- ధర: రూ.9,999
- అయితే దీని ఛార్జర్ విడిగా కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
Motorola G34 5G:
- రూ.10వేలల్లోపు మంచి మొబైల్ తీసుకోవాలి అనుకునేవారికి మోటొరొలా జీ34 ఫోన్ 5జీ బెస్ట్ ఆప్షన్.
- డిస్ప్లే: 6.5 అంగుళాల హెచ్డీ+
- బ్యాటరీ:5000 ఎంఏహెచ్
- ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 695
- ధర: రూ.9,999
- మెరుగైన పనితీరు కోసం 8జీబీ వేరియంట్‌ను పరిశీలించొచ్చు.
IQOO Z9 Lite:
- అతి తక్కువ బడ్జెట్లో మొబైల్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఐకూ జడ్ 9 లైట్ మొబైల్ బెస్ట్.
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6,300
- కెమెరా: 50 ఎంపీ
- బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
- ధర:రూ.9,499
Redmi 13C 5G:
- ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 6100+
- కెమెరా:50 ఎంపీ ఏఐ డ్యూయల్
- బ్యాటరీ: 5000 ఎంఏహెచ్
- ధర: రూ.10 వేల లోపు
- స్పెషల్ ఆఫర్లో దీన్ని రూ.8,999లకే కొనుగోలు చేయొచ్చు.