తెలంగాణ

telangana

ETV Bharat / technology

ఉద్యోగం లేదా?- ఈ బిజినెస్​తో డబ్బే డబ్బు!- కేవలం రూ.3.99 లక్షలు ఉంటే చాలు - Best Commercial Vehicles In India

Best Commercial Vehicles Under 10 Lakhs: మీకు ఉద్యోగం లేదా? కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి అని సతమతం అవుతున్నారా? కేవలం రూ. 3.99 లక్షలు ఉంటే చాలు ట్రక్​ బిజినెస్​తో డబ్బే డబ్బు. మంచి మైలేజ్​, పికప్‌తో మార్కెట్​లో లభించే టాప్ స్మాల్ కమర్షియల్ వెహికల్స్ ఇవే.

Best_Commercial_Vehicles_Under_10_Lakhs
Best_Commercial_Vehicles_Under_10_Lakhs (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Aug 22, 2024, 4:57 PM IST

Updated : Aug 22, 2024, 5:32 PM IST

Best Commercial Vehicles Under 10 Lakhs:ప్రస్తుత కాలంలో ట్రక్ బిజినెస్​కు మంచి గిరాకీ ఉంది. గ్యాస్ సిలిండర్లు, వాటర్ క్యాన్లు, పండ్లు, కూరగాయలు వంటి వాటిని తరలించేందుకు ఈ వాహనాలు ఉపయోగపడతాయి. దీంతో తక్కువ బడ్జెట్​లో మంచి బిజినెస్ చేయాలి అనుకునేవారికి ఇది ఒక చక్కటి ఎంపిక. ఈ క్రమంలో మార్కెట్లో ఉన్న టాప్-5 ట్రక్స్​పై ఓ లుక్కేద్దాం రండి.

1. Tata Ace Gold:తక్కవ బడ్జెట్​లో ట్రక్ బిజినెస్ చేయాలనుకునే వారికి టాటా ఏస్ గోల్డ్ పికప్ వాహనం ఉపయోగపడుతుంది. ఇది పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని క్యాబిన్ పటిష్టంగా ఉండటంతో సరకుల రవాణాకు ఇది బెస్ట్ ఆప్షన్. అశోక్ లేలాండ్, మహీంద్రా జీతో వంటి ట్రక్కులు మార్కెట్​లో టాటా ఏస్​కు పోటీగా ఉన్నాయి.

Best_Commercial_Vehicles_Under_10_Lakhs (ETV Bharat)

ఫీచర్లు

  • టైర్లు : 4
  • కెర్బ్ వెయిట్ : 1,510 కేజీలు
  • ఇంజిన్ : 694 సీసీ
  • పేలోడ్ : 710 కేజీలు
  • పవర్ : 24 హెచ్ పీ
  • మైలేజ్ : 15 కి.మీ/లీటర్
  • ఫ్యూయల్ ట్యాంక్ : 26 లీటర్లు
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • ధర : రూ. 3.99 లక్షలు - రూ. 6.69 లక్షలు

2. Mahindra Jeeto:మహీంద్రా జీతో ట్రక్కు వ్యాపారులకు బాగా ఉపయోగపడుతుంది. ఈ వాహనంలో అధిక బరువున్న వస్తువులను తరలించవచ్చు. 12 వాల్ట్ ఛార్జింగ్ పోర్ట్, అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఇన్ఫర్మేటివ్ డిజిటలైజ్డ్ ఇన్‌ స్ట్రుమెంట్ క్లస్టర్‌ వంటి ఫీచర్లు కలిగి ఉంది.

Best_Commercial_Vehicles_Under_10_Lakhs (ETV Bharat)

ఫీచర్లు

  • టైర్లు : 4
  • కెర్బ్ వెయిట్ : 1,450 కేజీలు
  • ఇంజిన్ : 1,000 సీసీ
  • పేలోడ్ : 715 కేజీలు
  • పవర్ : 17.3 హెచ్ పీ
  • మైలేజ్ : 20-25 కి.మీ/లీటర్
  • ఫ్యూయల్ ట్యాంక్ : 20 లీటర్లు
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • ధర : రూ. 4.30 లక్షలు - రూ. 5.7 లక్షలు

3. Tata Intra V30: ఒక మంచి బిజినెస్ చేయాలనుకునేవారికి టాటా ఇంట్రా వీ30 బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంజిన్ కెపాసిటీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ ట్రక్కు పికప్ బాగుంటుంది. పెద్ద పెద్ద లోడులను సైతం ఈ ట్రక్కులో తీసుకెళ్లవచ్చు. ఇందులో లాకబుల్ గ్లోవ్ బాక్స్, డిజిటల్ ఇన్ స్ట్రమెంట్ క్లస్టర్, స్మార్ట్‌ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ వంటి ఫీచర్లు ఉంటాయి.

Best_Commercial_Vehicles_Under_10_Lakhs (ETV Bharat)

ఫీచర్లు

  • టైర్లు : 4
  • కెర్బ్ వెయిట్ : 2,565 కేజీలు
  • ఇంజిన్ : 1,496 సీసీ
  • పేలోడ్ : 1,300 కేజీలు
  • పవర్ : 69 హెచ్ పీ
  • మైలేజ్ : 14 కి.మీ/లీటర్
  • ఫ్యూయల్ ట్యాంక్ : 35 లీటర్లు
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • ధర : రూ. 7.30 లక్షలు - రూ. 7.62 లక్షలు

4. Maruti Suzuki Super Carry:మారుతీ సుజుకి సూపర్ క్యారీ చిన్న కమర్షియల్ వాహన శ్రేణిలోని పికప్ ట్రక్. ఇది పెట్రోల్, సీఎన్‌జీ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. పండ్లు, కూరగాయలు, గ్యాస్ సిలిండర్లు, వాటర్ బాటిళ్లు, పాల క్యాన్లు వంటి సరుకును తీసుకెళ్లేందుకు ఈ ట్రక్కు బాగుంటుంది.

Best_Commercial_Vehicles_Under_10_Lakhs (ETV Bharat)

ఫీచర్లు

  • టైర్లు : 4
  • కెర్బ్ వెయిట్ : 925 కేజీలు
  • ఇంజిన్ : 1,196 సీసీ
  • పేలోడ్ : 1600 కేజీలు
  • పవర్ : 72 హెచ్​పీ
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • ధర : రూ. 4.14 లక్షలు

5. Ashok Leyland Dost +: సరకుల రవాణాకు అశోక్ లేలాండ్ దోస్త్ + ఉపయోగపడుతుంది. ఇది కేవలం డీజిల్ ఇంజిన్​లో మాత్రమే అందుబాటులో ఉంది. టాటా ఏస్, మహీంద్రా జీతో ట్రక్కులు అశోక్ లేలాండ్ దోస్త్ + కు పోటీగా ఉన్నాయి.

Best_Commercial_Vehicles_Under_10_Lakhs (ETV Bharat)

ఫీచర్లు

  • టైర్లు : 4
  • ఇంజిన్ : 1, 478 సీసీ
  • పేలోడ్ : 1,500 కేజీలు
  • పవర్ : 68.9 హెచ్​పీ
  • మైలేజ్ : 15 కి.మీ/లీటర్
  • చాసిస్ టైప్ : చాసిస్ విత్ క్యాబిన్
  • ధర : రూ. 7.75 లక్షలు - రూ. 8.25 లక్షలు

'ఆడి క్యూ8' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ఎస్​యూవీ లాంచ్- ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? - Audi Q8 Facelift Launched

15వేల బడ్జెట్లో వీటిని మించిన ఫోనే లేదు - టాప్​ మొబైల్స్ ఇవే! - Best Mobile phones under 15000

Last Updated : Aug 22, 2024, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details