Best Smart Phones Under 30000 :ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ఫోన్ల హవా నడుస్తోంది. యువతీయువకులే కాదు, వయోబేధం లేకుండా ప్రతి ఒక్కరూ మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆశపడుతున్నారు. అందుకే ప్రముఖ మొబైల్ తయారీ కంపెనీలు అన్నీ లేటెస్ట్ ఫీచర్లతో, బెస్ట్ స్పెసిఫికేషన్స్‌తో స్మార్ట్ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. వాటిలో రూ.30,000 బడ్జెట్లోని టాప్-5 స్మార్ట్‌ఫోన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. OnePlus Nord 3 5G Features : ఈ వన్‌ప్లస్ నార్డ్ 3 ఫోన్ మిస్టీ గ్రే, టెంపెస్ట్ గ్రే అనే రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఫోన్ ముందు భాగంలో డ్రాగన్ట్రైల్ గ్లాస్ ప్రొటక్షన్ ఉంటుంది. కనుక ఫోన్ స్క్రీన్‌పై ఎలాంటి గీతలు పడవు. అలాగే ఫోన్ వెనుక భాగంలో గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఉంటుంది. ఈ ఫోన్‌కు 80వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. అందువల్ల కేవలం 37 నిమిషాల్లోనే ఫుల్ రీఛార్జ్ అయిపోతుంది.
- డిస్ప్లే :6.74 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 9000
- ర్యామ్ : 8జీబీ/ 16జీబీ
- స్టోరేజ్ : 128జీబీ/ 256జీబీ
- బ్యాటరీ : 5000 mAh
- రియర్ కెమెరా : 50MP + 8MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16MP
- ఆపరేటింగ్ సిస్టమ్ : ఆక్సిజన్ఓఎస్ 13.1 బేస్డ్ ఆన్ ఆండ్రాయిడ్ 13
OnePlus Nord 3 5G Price : మార్కెట్లో ఈ వన్‌ప్లస్ నార్డ్ 3 5జీ (8జీబీ + 128జీబీ) ఫోన్ ధర సుమారుగా రూ.28,999 వరకు ఉంటుంది.
2. Poco X6 Pro 5G Features :ఈ పోకో ఎక్స్6 ప్రో 5జీ ఫోన్లో పవర్ఫుల్ మీడియాటెక్ డైమెన్సిటీ 8300 ప్రాసెసర్ ఉంది. కనుక గేమింగ్‌కు ఇది చాలా బాగుంటుంది. ఇది కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటక్షన్‌తో వస్తుంది. కనుక స్క్రీన్‌పై ఎలాంటి గీతలు పడవు. ఈ ఫోన్లో 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కనుక ఇది కేవలం 45 నిమిషాల్లోనే ఫుల్ రీఛార్జ్ అయిపోతుంది. ఇక దీనిలో రియర్ కెమెరాతో హై క్వాలిటీ వీడియోలు తీసుకోవచ్చు.
- డిస్ప్లే : 6.67 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 8300
- ర్యామ్ : 8జీబీ/ 12జీబీ
- స్టోరేజ్ : 256జీబీ/ 512జీబీ
- బ్యాటరీ :5000 mAh
- రియర్ కెమెరా : 64MP + 8MP + 2MP
- ఫ్రంట్ కెమెరా : 16MP
- ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 14 విత్ షావోమీస్ న్యూ హైపర్ఓఎస్
Poco X6 Pro 5G Price :
- మార్కెట్లో ఈ పోకో ఎక్స్6 ప్రో 5జీ (8జీబీ+ 256జీబీ) ఫోన్ ధర సుమారుగా రూ.26,999 ఉంటుంది.
- మార్కెట్లో ఈ పోకో ఎక్స్6 ప్రో 5జీ (12జీబీ+ 512జీబీ) ఫోన్ ధర సుమారుగా రూ.28,999 ఉంటుంది.
3. Motorola Edge 40 Features : ఈ మోటరోలా ఎడ్జ్ 40 స్మార్ట్‌ఫోన్‌కు 68వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కనుక కేవలం 45 నిమిషాల్లోనే దీనిని ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. అల్యూమినియం ఫ్రేమ్‌తో చాలా స్లీక్ అండ్ స్టైలిష్ లుక్‌తో ఈ మోటరోలా ఫోన్ ఉంటుంది.
- డిస్ప్లే :6.55 అంగుళాలు
- ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 8020
- ర్యామ్ : 8జీబీ
- స్టోరేజ్ : 256జీబీ
- బ్యాటరీ : 4400 mAh
- రియర్ కెమెరా : 50 MP + 13MP
- ఫ్రంట్ కెమెరా : 32MP
- ఆపరేటింగ్ సిస్టమ్ : ఆండ్రాయిడ్ 13