Apple Watch For Your Kids :యాపిల్ వాచ్ యూజర్లకు గుడ్ న్యూస్. తాజాగా 'యాపిల్ వాచ్ ఫర్ యువర్ కిడ్స్' ఫీచర్ ఇండియాలో లాంఛ్ అయ్యింది. దీనితో మీ పిల్లల స్థితిగతులను చాలా సులభంగా ట్రాక్ చేసుకునేందుకు వీలుంటుంది. అది ఎలా అంటే?
మీ పిల్లల వద్ద ఐఫోన్ లేకపోయినా, యాపిల్ వాచ్‌తోనే నేరుగా కాల్స్, మెసేజులు చేసుకోవచ్చు. పైగా మీ పిల్లల యాక్టివిటీని 'యాపిల్ వాచ్ ఫర్ యువర్ కిడ్స్' ఫీచర్ ద్వారా ఓ కంట కనిపెట్టవచ్చు.
ఫీచర్స్ ఇవే!
యాపిల్ వాచ్ ఫర్ యువర్ కిడ్స్ సదుపాయాన్ని యాక్టివేట్ చేసిన వాచ్‌లో పిల్లలు తమ కుటుంబ సభ్యులు/ స్నేహితులతో కనెక్ట్ కావచ్చు. యాపిల్ మ్యాప్స్, సిరి, హెల్త్ ఫీచర్లను కూడా వినియోగించుకోవచ్చు. అత్యవసర సమయాల్లో ఎమర్జెన్సీ ఎస్‌ఓఎస్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు. అంతేకాదు తమ యాపిల్ వాచ్‌ను ఉపయోగించి తల్లిదండ్రులకు తమ లొకేషన్‌ను కూడా షేర్ చేయొచ్చు.
యాపిల్ కంపెనీ తీసుకువచ్చిన ఈ నయా ఫీచర్ ద్వారా, తల్లిదండ్రులు తమ పిల్లల దగ్గర ఉన్న వాచ్‌ను పూర్తి కంట్రోల్ చేయగలుగుతారు. పిల్లలు ఏదైనా కొత్త యాప్ డౌన్‌లోడ్ చేయాలన్నా, కొత్త కాంటాక్టులు యాడ్ చేయాలన్నా, తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి. కనుక పిల్లల యాక్టివిటీని ఎప్పటికప్పుడు ట్రాక్ చేయొచ్చు. అంతేకాదు తమ ఐఫోన్ ద్వారా టాస్కులను, షెడ్యూళ్లను, రిమైండర్లను సెట్ చేయొచ్చు. స్కూల్ సమయంలో పిల్లలు అనవసర యాప్‌లను యాక్సెస్ చేయకుండా ‘స్కూల్‌మోడ్’ను యాక్టివేట్ చేయొచ్చు.
సపోర్ట్ చేసే మోడల్స్ ఇవే!
యాపిల్ వాచ్ ఫర్ యువర్ కిడ్స్ ఫీచర్ వినియోగించాలంటే, కచ్చితంగా యాపిల్ వాచ్ సిరీస్ 4, ఆపై మోడళ్లు అయ్యి ఉండాలి. యాపిల్ వాచ్ ఎస్‌ఈ సిరీస్ కూడా ఈ ఫీచర్‌కు సపోర్ట్ చేస్తుంది. ఐఓఎస్ 14 లేదా ఆపై ఓఎస్‌లు కలిగిన ఐఫోన్ 6ఎస్, ఆపై మోడళ్లలో ఈ ఫీచర్ వినియోగించుకోవచ్చు. దీని కోసం యాపిల్ వాచ్, సెల్యూలర్ ప్లాన్ అవసరం ఉంటుంది. ఈ ఫీచర్ వినియోగిస్తే యాపిల్ వాచ్ సింగిల్ ఛార్జ్‌తో 14 గంటలపాటు పని చేస్తుందని యాపిల్ కంపెనీ పేర్కొంది.
మీ ఫోన్‌తో కంప్యూటర్ను కంట్రోల్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Use Remote Desktop
వాట్సాప్‌లో 'ఎయిర్ డ్రాప్' తరహా ఫీచర్ - ఇక మెరుపువేగంతో ఫైల్స్ ట్రాన్స్‌ఫర్! - WhatsApp AirDrop Like Feature