తెలంగాణ

telangana

ETV Bharat / technology

'ఆడి క్యూ8' ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ఎస్​యూవీ లాంచ్- ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయంటే? - Audi Q8 Facelift Launched - AUDI Q8 FACELIFT LAUNCHED

Audi Q8 Facelift Launched in India: ప్రపంచ దిగ్గజ వాహనాల తయారీ సంస్థ ఆడి తమ కస్టమర్లను ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త వెర్షన్​లో వాహనాలను విడుదల చేస్తుంది. ఈ క్రమంలో ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ ఎస్‌యూవీ మోడల్​ లగ్జరీ కార్​ను మార్కెట్లోకి రిలీజ్ చేసింది. దాని ధర, ఫీచర్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం రండి.

Audi_Q8_Facelift_Launched_in_India
Audi_Q8_Facelift_Launched_in_India (ETV Bharat)

By ETV Bharat Tech Team

Published : Aug 22, 2024, 2:49 PM IST

Updated : Aug 23, 2024, 10:28 AM IST

Audi Q8 Facelift Launched in India:వాహనప్రియుల కోసం ఆకర్షణీయమైన ఫీచర్స్​ కలిగి ఉన్న మరో లగ్జరీ కార్​ను ప్రముఖ వాహనాల తయారీ సంస్థ ఆడి మన ముందుకు తీసుకు వచ్చింది. సరికొత్త డిజైన్​తో జర్మనీకి చెందిన ఈ సంస్థ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది. గతేడాది సెప్టెంబర్‌లో ఆవిష్కరించిన ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ మోడల్​కు కొన్ని మార్పులు, చేర్పులు చేస్తూ దీన్ని డిజైన్ చేసింది. ఈ ఎస్‌యూవీ ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌లో కంపెనీ చాలా పెద్ద మార్పులు చేసింది. అయితే మెకానికల్‌గా ఈ కారులో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఆడి క్యూ8 ఫేస్ లిఫ్ట్ ఎక్ట్సీరియర్​:ముందుగా దీని డిజైన్‌ విషయానికి వస్తే ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలో గ్రిల్​కు చిన్నపాటి మార్పులు చేశారు. కొత్త గ్రిల్ 'ఎల్' ఆకారంలో ఇన్సర్ట్ చేశారు. అలాగే చిన్నపాటి మార్పులతో హెచ్‌డీ మ్యాట్రిక్స్ LED హెడ్‌ల్యాంప్స్‌, కొత్త డిజిటల్ OLED టెయిల్-లైట్స్ అమర్చారు.

ఆడి క్యూ8 ఫేస్ లిఫ్ట్ ఇంటీరియర్:దీని ఇంటీరియర్​ను పరిశీలిస్తే, పాత మోడల్​తో పోలిస్తే ఇందులో పెద్దగా మార్పులేం చేయలేదు. ఇది కొంచెం అప్డేటెడ్, కొత్త కలర్ థీమ్ ఆప్షన్స్‌తో ఉంది. ఈ కారులో ట్విన్ MMI టచ్‌స్క్రీన్, ఫోర్-జోన్ క్లైమేట్ కంట్రోల్, హెడ్-అప్ డిస్​ ప్లే, మసాజ్ సీట్లు, బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ హైఫై సిస్టమ్​లు ఉన్నాయి. దీంతోపాటు బిల్ట్-ఇన్ స్పాటిఫై, అమెజాన్ వంటి థర్డ్-పార్టీ మ్యూజిక్ యాప్​లు సైతం ఈ కారులో ఉన్నాయి.

ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ ఇంజిన్: భారత్​లో ప్రారంభించిన కొత్త ఆడి క్యూ8 3.0-లీటర్ సామర్థ్యంతో V6 టర్బో-పెట్రోల్ ఇంజన్‌లో లభిస్తుంది. ఇందులో 48-వోల్ట్ మైల్డ్ హైబ్రిడ్ సిస్టమ్‌ ఉంది. ఈ ఇంజన్ 340 హెచ్‌పి పవర్, 500 ఎన్ఎమ్ టార్క్​తో పని చేస్తుంది. కంపెనీ ప్రామాణిక 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్​ను కలిగి ఉంది. ఇది ఈ వాహనం నాలుగు చక్రాలకు శక్తినిస్తుంది.

ఆడి క్యూ8 ఫేస్‌లిఫ్ట్ ధర:పాత ఆడి క్యూ8 మోడల్ కంటే రూ.10 లక్షల ఎక్కువ ధరతో కంపెనీ ఈ కారు​ను విడుదల చేసింది. ఈ కారును కేవలం 1.17 కోట్ల (ఎక్స్-షోరూమ్) ధరతో రిలీజ్ చేసింది.

సెకెండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనాలా? ఈ లాభ, నష్టాల గురించి తెలుసుకోండి! - Second Hand Luxury Car Buying Tips

కొత్త కారు కొంటున్నారా? ఈ టాప్​-6 ఫీచర్లు ఉన్నాయో లేదో చూసుకోండి!

Last Updated : Aug 23, 2024, 10:28 AM IST

ABOUT THE AUTHOR

...view details