Three KG Gold Theft Case in Sangareddy :సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పోలీసులు భారీ బంగారం చోరీ కేసును ఛేదించారు. జులై 26న అర్ధరాత్రి జహీరాబాద్ మండలం సత్వార్ వద్ద కోహినూర్ దాబాలో నిలిపిన ట్రావెల్స్ బస్సు నుంచి చోరీ చేసిన రెండు కోట్ల 10 లక్షల రూపాయల విలువైన మూడు కిలోల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. దీనితో పాటు చోరీకి పాల్పడిన నిందితుడినిఅరెస్టు చేశారు. జహీరాబాద్ పట్టణంలోని పోలీసు సబ్ డివిజన్ కార్యాలయంలో సోమవారం జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.
ముంబయి నుంచి హైదరాబాద్‌కు వచ్చి బంగారు దుకాణాలకు నగలు సరఫరా చేసే వ్యక్తులను అనుసరిస్తూ మధ్యప్రదేశ్‌కు చెందిన దొంగల ముఠా బస్సులో భారీ బంగారు ఆభరణాల చోరీ చేసిందని చెన్నూరి రూపేష్ చెప్పారు. మధ్యప్రదేశ్‌లోని దార్ జిల్లాకు చెందిన నిందితుడు మాసూమ్ అలియాస్ ముఖిమ్ మరో నలుగురు వ్యక్తులతో కలిసి హైదరాబాద్ నుంచి నగల వ్యాపారిని బస్సులో అనుసరిస్తూ సత్వార్ వద్ద దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు.
మళ్లీ చోరీ చేసేందుకు ప్రయత్నించగా :నిందితుడు మరోసారి సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతానికి వచ్చి మళ్లీ చోరీ చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ వెల్లడించారు. భారీ చోరీ రికవరీ కేసును ఛేదించిన జహీరాబాద్ డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి, సీఐ శివలింగం, ఎస్సైలను ఎస్పీ రూపేష్ అభినందించి నగదు రివార్డులను అందజేశారు.
'సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో ట్రావెల్స్ బస్సులో రెండు కోట్ల రూపాయల విలువ గల మూడు కిలోల బంగారాన్ని దొంగతనం చేశారు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా కేసును ఛేదించాం. నిందితుడిని గుర్తించిన తర్వాత మళ్లీ ఆ దొంగ చోరీ చేసిన బంగారాన్ని విక్రయించడానికి ప్రయత్నించాడు. దానితోపాటు మళ్లీ ఇంకో చోరీ చేయడానికి సంగారెడ్డి జిల్లాకు వచ్చాడు. ఆ టైంలో నిందితుడిని పట్టుకున్నాం. చోరీకి గురైన మొత్తం రూ. 2.10 కోట్లు విలువైన మూడు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాం. మధ్యప్రదేశ్‌కు చెందిన దార్ గ్యాంగ్ చోరీలకు పాల్పడింది'- చెన్నూరి రూపేష్, సంగారెడ్డి జిల్లా ఎస్పీ
అయ్యో పాపం!! - టిఫిన్ చేద్దామని బస్సు దిగితే - 4 కిలోల బంగారం ఎత్తుకెళ్లారు - 4KGS GOLD THEFT IN SANGAREDDY