ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తప్పు చేశాను క్షమించండి మహాప్రభో! - కాళ్ల బేరానికి వచ్చిన నటి - YCP SOCIAL MEDIA ACTIVISTS ARREST

వైఎస్సార్సీపీ అండదండలతో టీడీపీ, జనసేన నేతలపై అసభ్యకర పోస్టులు - క్షమించాలంటూ మొన్న వీడియో నిన్న లేఖ విడుదల చేసిన ఓ నటి

YSRCP Social Media Activist Apology Letter to Minister Nara Lokesh
YSRCP Social Media Activist Apology Letter to Minister Nara Lokesh (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2024, 10:18 AM IST

YSRCP Social Media Activist Apology Letter to Minister Nara Lokesh : వైఎస్సార్​సీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ, జనసేన నాయకులు, వారి కుటుంబ సభ్యులపై ఇష్టారాజ్యంగా నోరు పారేసుకున్న వారంతా ఇప్పుడు యుటర్న్​ తీసుకుంటున్నారు. సోషల్​ మీడియాలో అసభ్యకర పోస్టులపై కేసులు, అరెస్టుల నేపథ్యంలో కాళ్ల బేరానికి వస్తున్నారు. తప్పయింది, క్షమించండి అంటూ సోషల్​ మీడియాలో వీడియోలతో పాటు లెటర్లు రాస్తున్నారు. మరికొంత మంది తమ సోషల్​ మీడియా అకౌంట్​లను డీ యాక్టివేట్​ చేస్తున్నారు. కొంతమంది అజ్ఞాతంలోకి వెళ్తున్నారు. తమను, తమ కుటుంబ సభ్యులను క్షమించి వదిలేయాలంటూ పేజీలకు పేజీల లెటర్లు రాస్తున్నారు. ఈ తరుణంలో ఓ వైఎస్సార్సీపీ సానుభుతి పరురాలు, ఓ నటి తనను క్షమించాలంటూ బహింరంగా లేఖ రాశారు. తనను వదిలేయాలంటూ ఐదు రోజుల క్రితం ఓ వీడియోను సైతం విడుదల చేసింది. అనంతరం ఆమెపై కేసు నమోదైంది.

లోకేశ్​ అన్నా.. క్షమించు :వైఎస్సార్​సీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్​కు కానీ, పార్టీకి కానీ వ్యతిరేకంగా సోషల్​ మీడియాలో పోస్టులు పెడితే పచ్చి బూతులతో రెచ్చిపోతూ వీడియోలు విడుదల చేసిన ఓ నటి ప్రస్తుతం కాళ్ల బేరానికి వచ్చింది. లోకేశ్​ అన్నా క్షమించు, తప్పయింది, మళ్లీ జీవితంలో ఇటువంటి తప్పు చేయనంటూ లెటర్​ రాసింది.

నటి రాసిన లెటర్​ (ETV Bharat)
నటి రాసిన లెటర్​ (ETV Bharat)

దెబ్బకు దయ్యం వదిలింది - క్షమాపణలు చెప్పిన నటి

ఆ నటి సినిమా పరిశ్రమలో తనను శారీరకంగా ఉపయోగించుకొని అవకాశాలు ఇవ్వలేదని గతంలో ఆరోపించారు. హైదరాబాద్​లో అప్పట్లో హల్​చల్​ చేశారు. తనకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలంటూ ఫిలిం ఛాంబర్ వద్ద నగ్న ప్రదర్శనకు చేశారు. అనంతరం ఆ విషయం తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ తరువాత చెన్నైకి వెళ్లారు. అప్పటి నుంచి సోషల్ మీడియాలో వైఎస్సార్సీపీ అనుకూలంగా వీడియోలు చేస్తోంది. ఆ పార్టీకి ఏ రాజకీయ నాయకుడు వ్యతిరేకంగా మాట్లాడితే తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, చట్టప్రకారం చర్యలు తీసుకుంటుండడంతో ఆ నటికి తత్వం బోధపడి సోషల్​ మీడియా వేదికగా క్షమాపణలు కోరుతూ ఓ వీడియో విడుదల చేశారు. అనంతరం కేసు నమోదైంది. ఆ అస్త్రం పని చేయకపోవడంతో బహిరంగ క్షమాపణ లేఖ విడుదల చేసింది.

'వర్మా' విచారణకు రండి - ఆర్జీవీ ఇంటికి ఏపీ పోలీసులు - కేసు ఏంటంటే!

ABOUT THE AUTHOR

...view details