YSRCP Leaders Joining TDP in AP :ఎన్నికల వేళ వైఎస్సార్సీపీ నుంచి తెలుగుదేశంలోకి భారీ ఎత్తున వలసలు కొనసాగుతున్నాయి. విజయనగరం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీకి చెందిన 1000 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికి తెలుగుదేశం అభ్యర్థి అదితి గజపతిరాజు పార్టీ కండువా వేసి సాదరంగా ఆహ్వానించారు. విజయనగరం 3వ డివిజన్‌కు చెందిన వైఎస్సార్సీపీ కార్పొరేటర్ వజ్రపు సత్యగౌరి, 37వ డివిజన్‌కు చెందిన మాజీ కౌన్సిలర్ మజ్జి బాబు, పలువురు ముఖ్యనేతలు టీడీపీలో చేరారు. అధికార పార్టీ అక్రమాలకు, అరాచకాలకు విసుగు చెంది వైఎస్సార్సీపీని వీడి టీడీపీలోకి చేరామని పేర్కొన్నారు.
'సూపర్ సిక్స్' పథకాల ఆకర్షణ - పార్టీని వీడుతున్న వైసీపీ శ్రేణులు - YSRCP Leaders Join In TDP
YSR District :వైఎస్సార్ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. పెండ్లిమర్రి మండలం కొత్త గంగిరెడ్డిపల్లి పంచాయతీకి చెందిన శ్రీనివాసులు రెడ్డి పాటు 25 కుటుంబాలు తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీని వీడి టీడీపీలో చేరారు. ప్రొద్దుటూరులో 17వ వార్డు కౌన్సిలర్ చింతకుంట సరితా, ఆమె భర్త మాజీ కౌన్సిలర్ జయలింగారెడ్డి తమ అనుచరులతో కలిసి వైఎస్సార్సీపీని వీడి టీడీపీలోకి చేరారు. వారికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నంద్యాల వరదరాజుల రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. చంద్రబాబు పాలనలో మేలు జరుగుతుందన్న నమ్మకంతోనే కౌన్సిలర్ సరితా, ఆమె భర్త జయలింగా రెడ్డి టీడీపీలో చేరారని వరదరాజుల రెడ్డి తెలిపారు. మే 13న జరిగే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం తమ వంతు కృషి చేయాలని పేర్కొన్నారు. టీడీపీని నమ్మి వచ్చిన వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు.