ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెల్లించని డిపాజిట్లు - అయినవారి రుణాలైతే రద్దు - పాలకవర్గం ఇష్టారాజ్యం - ఉరవకొండలో వైఎస్సార్సీపీ అక్రమాలు

YSRCP Leaders Irregularities in Uravakonda: ఏడాది కిందట వైఎస్సార్సీపీ నేతల బృందంగా ఏర్పడి తమ పార్టీకి చెందిన వారికే రుణాలు కేటాయించడంతో ఉరవకొండ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ తీవ్ర నష్టాల్లో కురుకుపోయింది. ఈ ఘటనపై సహకార శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయాలని ఖాతాదారులు, డిపాజిట్​దారులు డిమాండ్ చేస్తున్నారు.

YSRCP_Leaders_Irregularities_in_Uravakonda
YSRCP_Leaders_Irregularities_in_Uravakonda

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 10:29 PM IST

YSRCP Leaders Irregularities in Uravakonda :అనంతపురం జిల్లా ఉరవకొండ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ (Uravakonda Cooperative Town Bank) తీవ్ర నష్టాల్లో కొనసాగుతోంది. దానిలో ఆర్థిక లావాదేవీలపైనా రెండేళ్లుగా ఆర్బీఐ షరతులు (RBI Conditions) విధించింది. గత సంవత్సరం ఫిబ్రవరి నుంచి లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. అలాంటి బ్యాంకును తాము బాగు చేస్తామంటూ సంవత్సరం కిందట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడి అనుచర వర్గం బృందంగా ఏర్పడి బ్యాంకు పాలక వర్గంగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యింది. కాలపరిమితి ముగిసినా తమ డిపాజిట్ల మొత్తాన్ని బ్యాంకు చెల్లించడం లేదని డిపాజిట్లు దారులు తరచూ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో బ్యాంకుకు రావాల్సిన అప్పులు వసూలు చేసి, డిపాజిట్​దారులకు మొత్తాన్ని చెల్లించాల్సిన పాలకవర్గం ఆ దిశగా చేపట్టిన చర్యలు నామమాత్రమే బ్యాంకును బాగు చేయడాన్ని మరచిన పాలకవర్గంలోని మెజార్టీ సభ్యులు తమ నాయకుడు సూచించిన వారి రుణాలను రద్దు చేస్తూ ముందుకు పోతున్నారు. దానికి సంబంధించిన ఓ ఘటన తాజాగా వెలుగు చూసింది.

Bank Employees: "బ్యాంకు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరాట బాట పట్టాలి": ఎఐబీఈఏ

ఉరవకొండకు చెందిన హాసీఫ్ ప్రస్తుతం వైఎస్సార్సీపీ సచివాలయాల కన్వీనరుగా ఉన్నారు. ఈయన 2019 మార్చిలో తన ఇంటిని టౌన్ బ్యాంకుకు తనఖా పెట్టి 5 లక్షల రూపాయలు రుణం తీసుకున్నారు. అది వడ్డీతో కలిపి గత సంవత్సరం ఆగస్టు నాటికి 9.47 లక్షల రూపాయలు అయింది. ఆయన మైనార్టీ వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో పాటు, పార్టీలో క్రియాశీలకంగా ఉపయోగించుకోవడానికి నజరానాగా అతని రుణాన్ని అసలును మాత్రమే కట్టించుకుని రద్దు చేయాలని వైఎస్సార్సీపీ ముఖ్య నాయకుడు, ఆయన తనయుడు బ్యాంకు పాలకవర్గంలోని తమ వర్గానికి సూచించారు.

ఎస్​బీఐలో 7కిలోల నగలు మాయం - ఆందోళనలో ఖాతాదారులు

అప్పటి బ్యాంకు పాలకవర్గం అధ్యక్షుడు సాదు కుళ్లాయి స్వామి, బ్యాంకు సీఈఓ వేదమూర్తి అతని నుంచి 5 లక్షల రూపాయలను కట్టించుకుని రుణాన్ని రద్దు చేసి స్వామి భక్తిని చాటుకున్నారు. మరో 4.97 లక్షల రూపాయలు కట్టించుకోకుండా వదిలేశారు. ఇందులో కొసమెరుపు ఏమిటంటే అతను గత సంవత్సరం ఆగస్టు 3న 4.5 లక్షల రూపాయలను చెల్లించగానే రుణాన్ని రద్దు చేసి అదే నెల 4న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇంటిని బ్యాంకు అధికారులు తిరిగి ఆయనకు వెనక్కి రిజిస్ట్రేషన్ చేయించారు. మిగతా 50 వేల రూపాయలకు రుణం రద్దయిన 10 రోజులకు చెల్లించారు. దీనిపై ఆ బ్యాంకు సీఈఓ వేదమూర్తిని చరవాణిలో వివరణ కోరగా అతని రుణాన్ని పాత బకాయిగా పరిగణిస్తూ రద్దు చేసినట్లు తెలిపారు.

వైఎస్సార్సీపీ నాయకులు డిపాజిటర్ల గొంతును నొక్కిపెడుతూ తమ వర్గీయులు ఇంకెంత మందికి ఇలా రుణాన్ని రద్దు చేశారోనన్న వాదన ఉంది. ఈ ఘటనపై సహకార శాఖ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేయాలని ఖాతాదారులు, డిపాజిట్టుదారులు డిమాండ్ చేస్తున్నారు.

బ్యాంకు ఉద్యోగి చేతివాటం- తల్లి, భార్య ఖాతాల్లోకి కస్టమర్ల నగదు- రూ.28 కోట్లు ట్రాన్స్​ఫర్​

ABOUT THE AUTHOR

...view details