YSRCP Leaders Destroyed Erramatti Dibbalu :విశాఖ ఎర్రమట్టి దిబ్బలనూ వైఎస్సార్సీపీ గద్దలు విధ్వంసం చేశాయి. భీమిలి మండలం నేరెళ్లవలస, జేవీ అగ్రహారం వద్ద రైతులకు పరిహారంగా ఎర్రమట్టి దిబ్బలకు ఆనుకొని భూములు ఇచ్చారు. వాటిని హస్తగతం చేసుకున్న ఆపార్టీ నేతలు సీఆర్‌జెడ్(CRZ), ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ ఎసెస్‌మెంట్ రిపోర్ట్(Environmental Impact Assessment Report), అటవీ, రక్షణ శాఖల నుంచి అనుమతి లేకుండానే తవ్వకాలు జరిపారు. సొంత లేఅవుట్లకు విలువ పెంచుకునేలా ప్రణాళికలు అమలు చేశారు.
మాయమవుతోన్న ఎర్రమట్టి దిబ్బలు- గత ప్రభుత్వ ఉత్తర్వులపై పర్యావరణవేత్తల ఆందోళన - visakha erra matti dibbalu
విశాఖపట్నంలో విలువైన ఆస్తులను దోచేసిన వైఎస్సార్సీపీ నేతలు ఎర్రమట్టి దిబ్బల విధ్వంసానికీ దారులు వేశారు. ఐదు రోజుల క్రితం తవ్వకాలు జరిపిన ప్రాంతంలో కొన్నింటిని, ఆ పరిసరాల్లో మరికొన్ని స్థలాలను ఇప్పటికే హస్తగతం చేసుకున్నారు. వారి లేఅవుట్లకు విలువ పెంచుకునేలా ప్రణాళికలు అమలు చేశారు. భీమునిపట్నం ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ (Aided Cooperative Society) స్థలంలో గత ప్రభుత్వంలోనే పనులు ప్రారంభించారు. అప్పటి పెద్దల సహకారంతోనే సర్వే చేసుకొని, హద్దులు నిర్ణయించుకున్నారు. పర్యాటక శాఖ వాచ్‌టవర్‌కు వెళ్లేందుకు వీల్లేకుండా కంచె వేసేశారు. వైఎస్సార్సీపీలో ఉత్తరాంధ్ర ముఖ్యనేతతో పాటు రియల్ ఎస్టేట్‌తో సంబంధమున్న నేతలు, ప్రభుత్వంలో కీలకంగా పని చేసిన అప్పటి అధికారి, సీఎంఓలోని అధికారికి ఇక్కడ స్థలాలు ఉన్నాయన్న ఆరోపణలున్నాయి. అందుకే నిన్నమొన్నటి వరకు ఎటువంటి అనుమతి లేకుండా పనులు జరిగినా అధికార యంత్రాంగం కళ్లుమూసుకుందని చెబుతున్నారు.
ఎర్రమట్టి దిబ్బలను జేసీబీలతో తవ్వుతుంటే ఏం చేస్తున్నారు? - అధికారులపై జేసీ ఫైర్ - JC Visited Visakha Red Clay Dunes
భీమిలి మండలం నేరెళ్లవలస, జేవీఅగ్రహారం వద్ద ఎర్రమట్టి దిబ్బలను ఆనుకొని రైతులకు పరిహారంగా ఇచ్చిన భూములు వైఎస్సార్సీపీ నేతల చేతుల్లోకి వెళ్లిపోయాయి. ఇక్కడ ప్రభుత్వం 242.10 ఎకరాలు సమీకరిస్తే రైతులకు 106.47 ఎకరాలు మాత్రమే అప్పగించారు. రియల్ ఎస్టేట్‌తో సంబంధమున్న ఓ నేతతో పాటు మాజీ మంత్రి కుటుంబసభ్యులు రైతుల నుంచి పత్రాలు రాయించుకొని ఇందులో 50 ఎకరాల వరకు కొట్టేశారు. ఇక్కడ వైఎస్సార్సీపీ నేతలకు చెందిన ప్రైవేటు లేఅవుట్లకు విలువ పెంచేలా వీఎంఆర్‌డీఏ 135.63 ఎకరాలు తీసుకొని లేఅవుట్‌కు ప్రణాళిక చేయడం గమనార్హం. ఇదంతా ఎర్రమట్టి దిబ్బలకు అనుకొనే జరిగింది. దానికి కొంత సమీపంలోనే శారదాపీఠానికి 15 ఎకరాలు అప్పగించారు.
Erra Matti Dibbalu: ఎర్రమట్టి దిబ్బల చెంత ప్రకృతి విధ్వంసం.. భారీ చెట్లను వేళ్లతో సహా పెకిలించిన వైనం
భీమునిపట్నం కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ (Cooperative Building Society) దాదాపు 25 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వానికి డబ్బులు చెల్లించి భూములు కొనుగోలు చేసింది. ఇటీవల వరకు అక్కడ ఎలాంటి పనులూ చేపట్టలేదు. వైఎస్సార్సీపీ నేతలు రంగంలోకి దిగిన తరువాత పరిస్థితి మారిపోయింది. 2022 నవంబరులో లేఅవుట్ ప్లాన్ కోసం దరఖాస్తు చేశారు. 2023 ఏప్రిల్‌లో 5 కోట్లు జీవీఎంసీకి చెల్లించారు. ఇటీవల బదిలీ అయిన కమిషనర్ సాయికాంత్‌వర్మ (Commissioner Saikanthvarma) హయాంలో ఈ దస్త్రం వేగంగా కదిలింది. ఆయన బదిలీకి ఒక్క రోజు ముందు ఈ నెల 8న ఆ దస్త్రాన్ని వెనక్కి పంపారు. లేకుంటే ముందస్తు అనుమతులు వచ్చేసి ఉండేవి. ప్రస్తుతం ఈ భూముల మార్కెట్ విలువ వందల కోట్లు దాటిపోయింది. దీంతో వాటిపై కన్నేసిన నేతలు ఎలాగైనా పనులు ముందుకు తీసుకువెళ్లాలని భావించారు. సీఆర్‌జెడ్(Coastal Regulation Zone), ఎన్విరాన్‌మెంటల్ ఇంపాక్ట్ ఎసెస్‌మెంట్ రిపోర్ట్(EIAR), అటవీ, రక్షణ శాఖల నుంచి అనుమతి లేకుండానే తవ్వకాలు జరిపారు. ఇదంతా అప్పటి అధికారులకు తెలిసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వ పెద్దల ప్రమేయం ఉండటంతో అడ్డుకునే ప్రయత్నం చేయలేదని చెబుతున్నారు. కింది స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకొని వదిలేశారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు.
విశాఖ జిల్లాలో 'అవినీతి ముత్యం' - కనుమరుగవుతున్న ఎర్రమట్టి దిబ్బలు! - YSRCP Leaders Irregularities