ETV Bharat / state

అసభ్య పోస్టులు పెట్టే వారిపై కేసులు నమోదు చేయడం తప్పేంకాదు: ఏపీ హైకోర్టు - SOCIAL MEDIA POSTS CASES IN AP

సోషల్‌ మీడియా వేదికగా ఏమైనా చేయవచ్చు అనుకుంటే కుదరదన్న హైకోర్టు - అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసులను ఆదేశించలేమని స్పష్టం

AP High Court Comments on Social Media Posts
AP High Court Comments on Social Media Posts (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 14, 2024, 7:21 AM IST

High Court Supports Cases Against Objectionable Social Media Posts : సోషల్‌ మీడియా వేదికగా ఏమైనా చేయవచ్చు అనుకుంటే కుదరదని హైకోర్టు తేల్చి చెప్పింది. అసభ్య, అనుచిత, అభ్యంతరకర పోస్టుల పెడుతున్నవారిపై పోలీసులు కేసులు నమోదు చేయడంలో తప్పేముందని ప్రశ్నించింది. అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసులను ఆదేశిస్తూ బ్లాంకెట్‌ ఉత్తర్వులు ఇవ్వలేమని పేర్కొంది. ఇష్టారాజ్యంగా అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు, దుష్ప్రచారం చేసేందుకు సోషల్‌ మీడియా ఎంత మాత్రం తగిన వేదిక కాదంది. సామాజిక మాధ్యమాల్లో ఇష్టారాజ్యంగా అసభ్యకర పోస్టులు పెడుతూ ఏమైనా చేయవచ్చు అనుకునే వారిని చట్టం ముందు నిలబెట్టాల్సిందేనని స్పష్టం చేసింది.

కేసులు నమోదు చేస్తే తప్పేముంది : సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై కేసులు నమోదు చేయడాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా పని చేసిన పాత్రికేయుడు పోలా విజయబాబు దాఖలు చేసిన పిల్‌ను విచారించడానికి హైకోర్టు నిరాకరించింది. పిటిషనర్‌ తరఫున వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏజీగా పనిచేసిన ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపించారు. సామాజిక మాధ్యమంలో పోస్టులు పెట్టిన పౌరుల వాక్‌ స్వాతంత్య్రం హక్కును హరించేలా పోలీసు యంత్రాంగం విచ్చలవిడిగా కేసులు నమోదు చేసి అరెస్ట్‌ చేస్తోందన్నారు.

అసభ్యకర పోస్టులు పెట్టినవారిపై కేసులు పెడితే తప్పేంటి? : హైకోర్టు

స్వేచ్ఛగా అభిప్రాయాలను వ్యక్తం చేసే పరిస్థితులు లేకుండా చేస్తున్నారని వాదించారు. వ్యక్తుల ప్రతిష్ఠను దిగజారుస్తుంటే కేసులు నమోదు చేస్తే తప్పేముందని ధర్మాసనం ప్రశ్నించింది. చట్ట ప్రకారం ముందుకు వెళుతున్నప్పుడు ప్రభుత్వాన్ని తాము ఏ విధంగా నిరోధించగలమని అడిగింది. కేసులు నమోదును క్వాష్‌ పిటిషన్ల ద్వారా ప్రశ్నించడానికి ప్రత్యామ్నాయ మార్గం ఉండగా పిల్‌ వేయడం తగదని హితవుపలికింది.

బ్లాంకెట్‌ ఉత్తర్వులు ఇవ్వలేము : సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్న వారిపై రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్ధతిలో వందల మందిపై కేసులు పెడుతున్నారని శ్రీరామ్‌ వాదించారు. సామాజిక మాధ్యమం వేదికగా 2వేల మంది దూషణలు చేస్తూ అసభ్యకర పోస్టులు పెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నవారిని పోలీసులు చట్టం ముందు నిలబెడితే తప్పు ఎలా అవుతుందని ధర్మాసనం తీవ్ర స్వరంతో ప్రశ్నించింది. ఒకే పద్ధతిలో కేసులు పెడుతోంది పోలీసులు కాదని సోషల్‌ మీడియాలో ఒకే విధానంలో దురుద్దేశంతో పోస్టులు పెడుతున్నారని పేర్కొంది.

కొన్ని సందర్భాల్లో న్యాయమూర్తులనూ వదిలిపెట్టడం లేదంది. కేసులు నమోదు చేయకుండా పోలీసులను నిలువరించలేమని తేల్చి చెప్పింది. అసలు కేసులే నమోదు చేయకుండా పోలీసులను ఆదేశిస్తూ బ్లాంకెట్‌ ఉత్తర్వులు ఇవ్వలేమంది. ఈ పిల్‌ విషయంలో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకుర్, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది.

"పోలీసుల పల్లెనిద్ర" - ఇక వారికి రాజమండ్రి జైలే

తాడేపల్లి కార్యాలయం నుంచే పోస్టులన్నీ పెట్టారు: డీఐజీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.