YSRCP Leaders Attack On Police in Palnadu :ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా బొల్లాపల్లి ఎస్సై చెన్నకేశవులుపై వైఎస్సార్సీపీ నేతలు దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 13న పోలింగ్ రోజున రాత్రి సమయంలో బొల్లాపల్లిలో మూగ చింతలపాలెం గ్రామానికి తెలుగు యువత నాయకుడు పోక వెంకట్రావు కారుపై వైసీపీ శ్రేణులు దాడికి పాల్పడ్డారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఎస్సై చెన్నకేశవులు ఆ దాడిని అడ్డుకుని వారి కారుని తప్పించారు.
పోలీసులపై వైసీపీ దాడులు :ఈ దాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. తెలుగు యువత నేతలు మాత్రం అక్కడి నుంచి సురక్షితంగా బయటపడ్డారు. అయితే వారు వెళ్లిపోయిన తర్వాత ఎస్సై చెన్నకేశవులుపై వైఎస్సార్సీపీ నేతలు దాడికి పాల్పడ్డారు. టీడీపీ వారికి రక్షణ కల్పిస్తావా అంటూ ఆయనపై పిడిగుద్దులు గుద్దారు. కర్రలతో దాడి చేశారు. అడ్డుకున్న కానిస్టేబుల్ నాగేంద్రని కూడా కొట్టారు. ఈ ఘటనలో ఎస్సై చెన్నకేశవులు తలకు గాయమైంది.
రణరంగంగా తాడిపత్రి - రహస్య ప్రాంతానికి ఎమ్మెల్యే పెద్దారెడ్డి - High Tension In Tadipatri
AP Elections violence 2024 :కానీ అధికార పార్టీ నేతలు కావటంతో ఎస్సై చెన్నకేశవులు మౌనంగా ఉండిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణుల దాడిని తెలుగు యువత నాయకులు తమ సెల్ఫోన్లో రికార్డు చేశారు. ఇప్పుడు ఆ వీడియో బయటకు రావటంతో ఎస్సైపైనా దాడి జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈవిషయంపై ఎస్సై చెన్నకేశవులుని అడగ్గా దాడి జరిగింది నిజమేనన్నారు. అయితే ఆ ఘటనను వదిలేసినట్లు ఆయన చెప్పారు.