ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేల కోట్ల స్కాములు - రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిన 'పెద్దాయన' అవినీతి సామ్రాజ్యం - YSRCP Leader Scams - YSRCP LEADER SCAMS

YSRCP Leader Scams: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత అంతటి హవా ఆయనదే. తనదైన రీతిలో పెత్తనం చెలాయించి వేల కోట్లు వెనకేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష నేతలపై దాడులకు తెగబడ్డారు. మంత్రి హోదాలో ఉండి, గనులు గుంజుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భూములపై కన్నేసి వందల ఎకరాలు కబ్జా చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. అయినా ఆ ‘పెద్దాయన’ దాహం తీరనిదన్న వాదనకు బలం చేకూర్చుతూ పేదలను, ప్రతిపక్షాల్నీ వేధించారు. ఆ నేత ప్రోత్సాహంతో వైఎస్సార్సీపీ నేతలు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చెలరేగిపోయారు. వారు చేసిన అవినీతికి, అక్రమాలకు అంతేలేదంటే అతిశయోక్తి కాదు.

YSRCP Leader Scams
YSRCP Leader Scams (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 20, 2024, 9:01 AM IST

YSRCP Leader Scams: 2019 ఎన్నికల సమయంలో పెద్దాయన సామ్రాజ్యం 3 నియోజకవర్గాలకే పరిమితం. కానీ వైఎస్సార్సీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా విస్తరించిందన్న ఆరోపణలు ఉన్నాయి. మైనింగ్, విద్యుత్తు సహా కొన్ని ప్రభుత్వ శాఖలను ఆయనే అంతా తానై నడిపించారు. ఆ అవినీతి చరిత్రకు చిట్టా పుస్తకాలూ చాలవన్న వాదన వినిపిస్తోంది. మట్టి, ఇసుకను అదేపనిగా తోడేశారు. రాష్ట్రంలో గనుల్ని దోచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. విద్యుత్తు ప్రాజెక్టుల పేరుతో ఖజానాను కొల్లగొట్టారు.

ఐదేళ్లు పెద్దాయన, ఆయన కుటుంబం చెప్పిన ప్రతిదానికీ పోలీసులు, ఇతర శాఖల అధికారులు తలాడించారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల్లా వ్యవహరించారు. వారి అండ చూసుకుని వైఎస్సార్సీపీ నేతలు మరింత చెలరేగిపోయి, ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తల్ని హింసించారు. పేదల భూములూ కొల్లగొట్టారు. నాటి ఆ పాపాలే నేడు శాపాలుగా మారి వారినే వెంటాడుతున్నాయి.

అంతులేని అవినీతి: ప్రభుత్వం మారడంతో పెద్దాయన చెలరేగిపోయిన ప్రాంతాల్లోని ప్రజలకు స్వేచ్ఛ లభించింది. అయిదేళ్లు ఓపికపట్టిన ప్రజాగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఇన్నాళ్లూ మాకు ఎదురులేదన్నట్లు ఉన్న పెద్దాయన కుటుంబానికి ఇప్పుడు సొంత నియోజకవర్గానికి వెళ్లలేని స్థితి వచ్చింది. మదనపల్లె సబ్‌ కలెక్టరేట్‌లో జులై 21న రెవెన్యూ దస్త్రాల దహనం ఘటన తర్వాత పెద్దాయన అకృత్యాలు బహిరంగంగా చర్చకు వస్తున్నాయి.

మదనపల్లె డివిజన్‌లో జరిగిన భూకబ్జాలపై కూటమి ప్రభుత్వం ఇటీవల అర్జీలు స్వీకరించగా, వందల మంది బాధితులు బారులుదీరారు. అక్కడి ప్రజలకు ప్రభుత్వం తామున్నామనే ధైర్యం కల్పిస్తే, ఊళ్లకు ఊళ్లే కదిలొచ్చేలా ఉన్నాయి. విచారణ కమిషన్‌ వేస్తే, అంతులేని అవినీతి లెక్కలు బయటపడే అవకాశం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి.

చిత్తూరు 'పెద్దారెడ్డి' లీల - అధికారుల అండతో 982 ఎకరాలు కాజేశారు - YSRCP land irregularities

సుప్రీంకోర్టు చెప్పినా ధిక్కరించి మరీ: పుంగనూరు మండలం నేతిగుట్లపల్లి, సోమల మండలం ఆవులపల్లిలో రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టగా, భూములు కోల్పోతున్న రైతులకు పెద్దాయన రూపాయి అయినా పరిహారమైనా ఇవ్వలేదు. కురబలకోట మండలం ముదివేడు వద్ద పరిహారమివ్వకుండానే 300 ఎకరాలు సేకరించి నిర్మాణాలు ప్రారంభించారు. అవి అక్రమ నిర్మాణాలంటూ ఎన్జీటీ అభ్యంతరం చెప్పడంతో పాటు జలవనరుల శాఖకు 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది.

దీనిపై సుప్రీంకోర్టు గతేడాది మే 17న ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పునిస్తూ, జరిమానాపై పాక్షికంగా స్టే విధించింది. రూ.25 కోట్లు కేఆర్‌ఎంబీకి చెల్లించాలని ఆదేశించింది. పనులు ఆపేయాలని సుప్రీంకోర్టు చెప్పినా ధిక్కరించి నిర్మాణాలు కొనసాగించారు. దీన్ని ప్రశ్నించిన రైతులపై కేసులు పెట్టించారు. మళ్లీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తుందని, ఓటేయకుంటే పరిహారం రాదని బెదిరించారు.

రేణిగుంట మండలం ఎర్రంరెడ్డిపాలెం అన్‌సెటిల్డ్‌ గ్రామంలో పెద్దాయన అనుచరులకు 6.5 ఎకరాల ప్రభుత్వ భూమిని కట్టబెట్టారు. అక్కడ ఎకరం విలువ 5 కోట్లపైనే ఉంది. తిరుపతి మారుతినగర్‌లోనూ బుగ్గమఠానికి చెందిన 3 ఎకరాల భూమిని ఆక్రమించి ఇంటిని నిర్మించారు. కార్పొరేషన్‌ నిధులతో రోడ్డేయించుకుని దానికి గేట్లు బిగించి, కంచె వేయించారు. వాటిని తొలగించాలని హైకోర్టు ఆదేశించినా, ఇప్పటికీ స్థానికుల రాకపోకలకు వీల్లేకుండా చేశారు. పీలేరులోనూ 400 కోట్ల భూదందాలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి.

చెవిరెడ్డి భాస్కరరెడ్డి చెరలో ఆర్టీసీ స్థలాలు - లీజు పేరిట విలువైన భూములకు ఎసరు - Chevireddy occupied RTC Lands

బలవంతంగా తమ ఆధీనంలోకి తెచ్చుకుని: గనుల శాఖ వసూలు చేయాల్సిన సీనరేజ్‌ బాధ్యతను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో ఈ అవినీతి నేతదే ప్రధానపాత్రగా చెబుతున్నారు. ఆఫ్‌లైన్‌ బిల్లుల పేరుతో పర్మిట్ల జారీలో దొంగ లెక్కలు చూపించి, భారీగా ప్రయోజనం పొందారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన మైనింగ్‌ లీజులపై విజిలెన్స్‌ దాడులు చేయించి, లోపాలున్నాయంటూ భారీ జరిమానాలు విధించారు. ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో పలు లీజులను బలవంతంగా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

క్వారీల నుంచి తమ కాంట్రాక్టు సంస్థలు చేసే సివిల్‌ ప్రాజెక్టుల వద్దకు పర్మిట్లు లేకుండానే కంకర, ఇసుక తరలించారు. ఈ నేత అనుచరులే మంగంపేట గనులనూ దోచుకున్నారు. ఏపీఎండీసీలో పెత్తనం చలాయిస్తూ ముగ్గురాయిని అస్మదీయులకు కట్టబెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. గనుల శాఖలో తన మాటవినని ఉద్యోగులను బదిలీలతో పెద్దాయన వేధించారు. 32 మంది ఉద్యోగులను సస్పెండ్‌ చేసి, చివరి వరకూ వారికి పోస్టింగ్‌ ఇవ్వలేదు. మరోపక్క, చిత్తూరు జిల్లాకు చెందిన దాదాపు 300 మందికి తండ్రీతనయుల సిఫార్సులతో ఏపీఎండీసీలో పొరుగు సేవల కింద ఉద్యోగాలిచ్చారు.

వైఎస్సార్సీపీ నేతలుగా, సోషల్‌ మీడియా ప్రచారకర్తలుగా వ్యవహరిస్తున్న కొందరు నేటికీ జీతాలు పొందుతున్నారు. ఏపీఎండీసీలో ఎండీ తర్వాత కీలక పోస్ట్‌ అయిన ఈడీని ప్రధాన కార్యాలయంలోనే లేకుండా చేశారు. ఝార్ఖండ్‌లో బ్రహ్మదియా బొగ్గు బ్లాక్‌లో తవ్వకాల టెండరు దక్కించుకొని, నేటికీ దానికి సంబంధించిన పనులను ప్రారంభించలేదు. పిచ్చాటూరు సమీపంలోని అరణియార్‌ నదిలో పొక్లెయిన్‌లతో 30 అడుగుల లోతు వరకూ ఇసుకను తవ్వి తరలించారు. సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో కొండలను కరిగించి, తమిళనాడు, కర్ణాటకల్లో మట్టి అమ్ముకున్నారు. ఏర్పేడు, తొట్టంబేడు మండలాల్లో పెద్దాయన అనుచరుల ఇసుక అక్రమ తవ్వకాలకు లెక్కేలేదు.

కంభంపాడులో వైఎస్సార్సీపీ నేత అక్రమ నిర్మాణం - భవనం కూల్చివేతతో ఉద్రిక్తత - YSRCP Leader Illegal Construction

అన్నకు ఎంతమాత్రమూ తగ్గేది లేదంటున్న తమ్ముడు: విద్యుత్తు ప్రాజెక్టుల టెండర్లన్నీ పెద్దాయన కుటుంబ కనుసన్నల్లోనే సాగాయి. రాష్ట్రంలో సుమారు 28 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ ప్రాజెక్టుల సంబంధించిన ఒప్పందాలు కుదరగా, అన్నింటా ఆయన చెప్పిందే వేదం. బంధువును జీఎం హోదాలో కూర్చోబెట్టి వ్యవహారం నడిపించారు. ప్రభుత్వరంగ సంస్థ జెన్‌కోను కాదని, అదానీ, షిర్డీసాయి ఎలక్ట్రికల్స్, అరబిందో సంస్థలకు భారీ ప్రాజెక్టులను కట్టబెట్టారు.

ఇంధన శాఖలో బహిరంగ మార్కెట్‌ విద్యుత్‌ను కొనుగోలు చేసి భారీగా లబ్ధి పొందారు. ఒప్పందాల్లో ముడుపులు చేతులు మారడంతోనే, యూనిట్‌ విద్యుత్‌ ధర సగటున 7 రూపాయల 70 పైసలకు కొన్నట్లు తెలుస్తోంది. సర్దుబాటు ఛార్జీల పేరిట ఇప్పటికే ప్రజలపై ఏటా 3 వేల 300 కోట్ల భారం పడుతోంది. గత రెండేళ్లకు ట్రూఅప్‌ ఛార్జీల కింద 17 వేల కోట్ల రూపాయల వసూళ్లకు డిస్కంలు ప్రతిపాదించాయి. ఈ రెండు భారాల పాపం ఆ అవినీతి నేత పుణ్యమేనన్న వాదన వినిపిస్తోంది.

అన్నకు ఎంతమాత్రమూ తగ్గేది లేదంటూ పెద్దాయన తమ్ముడూ భూబకాసుడయ్యారు. కురబలకోట మండలం అంగళ్లులో 2 వేల కోట్ల రూపాయల విలువైన 400 ఎకరాల భూముల్ని ఆక్రమించారు. ఎస్సైతో రైతులను బెదిరించి, ఎకరా 20 లక్షల విలువైన భూములను 2 లక్షల చొప్పున చెల్లించి లాగేసుకున్నారు. ఇందులో వైఎస్సార్సీపీ కార్యకర్తలూ బాధితులే. తంబళ్లపల్లె మండలం మల్లయ్యకొండ వద్ద 85 ఎకరాలు, కంటేవారిపల్లె వద్ద 25 ఎకరాలు, ములకలచెరువులో 10 ఎకరాల భూములు కాజేశారు.

మల్లయ్యకొండ ఆలయ భూములనూ మింగేశారు. బినామీ పేర్లతో భూములను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణమంతా పెద్దాయన కుమారుడి కనుసన్నల్లోనే సాగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అడిగినంత కమీషన్‌ చెల్లించిన వారికే మద్యం సరఫరా ఆర్డర్లు ఇవ్వడం, వసూలైన సొమ్మును ‘బిగ్‌బాస్‌’కు చేర్చడంలో ఆయనది ప్రధానపాత్రగా చెబుతారు.

కాకాణి ఇలాకాలో అక్రమ లేఅవుట్లు - అనుమతి లేకున్నా ప్లాట్ల విక్రయం - YSRCP Leaders Illegal Layouts

ABOUT THE AUTHOR

...view details