భూ కబ్జాల 'బ్రహ్మ నేత్రుడు'- పల్నాడులో రెచ్చిపోతున్న వైసీపీ నేత Palnadu YSRCP Leader Irregularities:పల్నాడులో ఆ ప్రజాప్రతినిధి అక్రమాల దందాకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. కన్నమదాసుకు సర్వ సైన్యాధ్యక్ష పదవిని కట్టబెట్టి రాజ్యాధికారం దళితులకు పట్టం కట్టిన మహామనీషి నాటి బ్రహ్మనాయుడు. ఈ ప్రజాప్రతినిధి మాత్రం ప్రభుత్వం దళితులకు ఇచ్చిన ఎసైన్డ్ భూములకు ఎసరు పెడుతున్నారు. జగనన్న కాలనీలు, ఇళ్ల పట్టాలు పథకాలు ఆయనకు సిరులు కురిపించాయి. నియోజకవర్గ కేంద్రానికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో 2016లో భూమిని కొనుగోలు చేసిన ఈ ప్రజాప్రతినిధి కోట్ల రూపాయల ఉపాధి హామీ పథకం నిధులతో చదును చేయించి రహదారులు నిర్మించారు.
అధికారులతో ఒత్తిడి తీసుకొచ్చి జగనన్న కాలనీ కోసం తన 120 ఎకరాలను ప్రభుత్వం కొనుగోలు చేసేలా చక్రం తిప్పారు. ఎకరాకు 8 లక్షలకు కొన్న భూమిని ప్రభుత్వానికి ఎకరాకు 16 లక్షల చొప్పున విక్రయించారు. జాతీయ రహదారికి సమీపంలో వాగు పక్కన ఉన్న 100 ఎకరాలకుపైగా ఉన్న ఎసైన్డ్ భూమిని ఇళ్ల స్థలాల కోసం అధికారులు పరిశీలించారు. ఐతే తన భూమినే కొనుగోలు చేసేలా చక్రం తిప్పిన ప్రజాప్రతినిధి కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అలా వచ్చిన డబ్బుతో 100 ఎకరాలకుపైగా ఉన్న ఎసైన్డ్ స్థలాన్ని ఇప్పుడు తన పేరిట క్రమబద్ధీకరించుకోవాలని పావులు కదుపుతున్నారు.
మే 13న వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు కూలదోస్తారు- జగన్ నాటకాలు హాలీవుడ్‌నే తలదన్నేలా ఉన్నాయి: చంద్రబాబు - Chandrababu Election Campaign
నియోజకవర్గ కేంద్రం శివారులోని కొండ వద్ద ఉన్న 9.31 ఎకరాల వివాదాస్పద భూమిని గతంలో ఈ ప్రజాప్రతినిధి కారుచౌకగా కొట్టేశారు. దాని పక్కనే ఉన్న మరో సర్వే నంబర్‌లోని 1.72 ఎకరాల్లో 60 సెంట్లను 2022లో తన బంధువు పేరిట కొనుగోలు చేశారు. ఇదే సర్వే నంబరులో ఇద్దరు తెలుగుదేశం నేతలు గతంలో 24 సెంట్ల భూమిని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఐతే ఆ భూమి తమదే అంటూ ప్రజాప్రతినిధి అందులో పాగా వేశారు.
అధికారులు కూడా ప్రజాప్రతినిధికి వంత పాటడంతో భూ యజమానులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. ఈ పట్టణ సమీపంలో జాతీయ రహదారి పక్కన 37.74 ఎకరాల 'చుక్కల భూమి'ని తన అనుచరులతో కొనుగోలు చేయించారు. డీటీసీపీ అనుమతులు ఇప్పించి ప్లాట్లు వేయించి అమ్ముతున్నారు. 'ఇది ప్రభుత్వ భూమి'అంటూ అంతకుముందు బోర్డులు పెట్టిన రెవెన్యూ అధికారులు ఈ నాయకుడి ప్రోద్బలంతోనే తీసేశారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పట్టణ సమీపంలో 10 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసిన ప్రజాప్రతినిధి ప్రభుత్వ ఖర్చుతో రోడ్డు వేయించుకుని నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. పట్టణ శివారులో ఓ స్థిరాస్తి వ్యాపారి అనధికారిక లేఅవుట్ వేశారు. తాను చెప్పినట్లు వినలేదన్న కోపంతో అధికారులను ఉసిగొల్పి వెంచర్ పనులను నిలిపేయించారు. తన అనుచరుడికి వాటా ఇచ్చిన తర్వాతే అనధికార లేఅవుట్‌కు ఆటంకాలు తొలగాయి. ఇదే ప్రాంతంలో తాను కొన్న భూమి విలువ పెంచేందుకు సమీపంలో గిరిజన గురుకుల కొత్త భవనం నిర్మిస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని వెంచరు వేయడానికి ప్రయత్నించిన ఓ స్థిరాస్తి సంస్థను బెదిరించి ముడుపులు లాగారు.
వైసీపీ ఎన్నికల తాయిలాలపై కలెక్టర్ పట్టించులేదు- తిరుపతి కలెక్టర్‌పై ఎన్టీఏ నేతల ఫిర్యాదు - TDP LEADERS Complaint to CEO on
నియోజకవర్గ కేంద్రంలోని ప్రధాన ప్రాంతంలో ఒక మత సంస్థకు 3.14 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ విలువ ప్రకారం రూ.19 కోట్లు, మార్కెట్ ధర ప్రకారం రూ.100 కోట్ల వరకు ఉంటుంది. ఇక్కడ వెలసిన అక్రమ నిర్మాణాలను తొలగించి ఆ మత సంస్థకు భూమిని అప్పగించాలని 2017లో రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించింది. తర్వాత ఆ సంస్థ అనంతపురం జిల్లాకు చెందిన వ్యక్తికి స్థలాన్ని జీపీఏ చేసింది. ఆ వ్యక్తి ఇటీవల పోలీసుల ఆధ్వర్యంలో స్థలాన్ని స్వాధీనపరచుకోవడానికి యత్నించగా ప్రజాప్రతినిధి అప్పటికప్పుడు ఓ సామాజిక వర్గాన్ని రెచ్చగొట్టి శాంతిభద్రతల సమస్యను సృష్టించారు.
భూమి స్వాధీన ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని ఓ మంత్రి ద్వారా పోలీసులపై ఒత్తిడి చేయించారు. బహిరంగ మార్కెట్‌లో రూ.100 కోట్ల విలువైన ఆ భూమిని అప్పనంగా కొట్టేసేందుకే ఈ నాయకుడు అడ్డుకుంటున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని నియోజకవర్గంలో ఈ ప్రజాప్రతినిధి పాలన సాగిస్తున్నారు. తన ఫ్లెక్సీని చించిన వారిపై హత్యాయత్నం కేసులు నమోదు చేయించారు.
పలువురు తెలుగుదేశం మండలస్థాయి నేతలపై రౌడీషీట్లు, గ్రామస్థాయి నాయకులపై సస్పెక్ట్ షీట్లు తెరిపించారు. పట్టణంలో ప్రతిపక్షాలకు చెందిన కొందరు మైనారిటీ నాయకులపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి తలలు పగులగొట్టారు. దాడికి పాల్పడినవారిపై కేసులు నమోదు చేయాల్సిన పోలీసులు బాధితులపైనే నాన్‌బెయిలెబుల్ కేసులు పెట్టారు. వక్ఫ్ భూములను 15 ఏళ్ల కిందట కొనుగోలు చేసిన కొందరు ఇళ్లు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు.
వైసీపీ నేతలు అధికారుల అవతారమెత్తి వాటిని పొక్లెయిన్‌తో ధ్వంసం చేశారు. బాధితులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. జిల్లా ఎస్పీని కలిస్తే పరిశీలించాలని డీఎస్పీకి అప్పగించారు. డీఎస్పీ పట్టించుకోకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఇటీవల పట్టణంలో తెలుగుదేశం ప్రదర్శన నిర్వహించారు. ఉద్దేశపూర్వకంగా అటువైపు వెళ్లిన ఈ ప్రజాప్రతినిధి రెండు గంటలపాటు అక్కడే ఉండి ఘర్షణను పెంచి పోషించారు.
వైసీపీ కార్యకర్తలతో పోలీసుల సమక్షంలోనేతెలుగుదేశం నేతలపై కర్రలు, రాళ్లతో దగ్గరుండి మరీ దాడి చేయించారు. ఇందులో టీడీపీ నేత ఒకరికి తల పగిలింది. పలువురికి గాయాలయ్యాయి. ఈ ఘటన పోలీసు కాల్పులకు దారి తీసింది. పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెట్టారు. ప్రజాప్రతినిధి సొంతూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ధాన్యానికి గిట్టుబాటు ధర ఇవ్వడం లేదని రైతులు వాపోయారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి గ్రామంలో నాయకుడు ఎవరున్నారని ఓ రైతు వాపోయారు.
ఆ రైతుపై అగ్గి మీద గుగ్గిలమైన ఈ ప్రజాప్రతినిధి కాలిచెప్పును తీయబోయారు. పక్కనున్న ఎంపీ, ఇతర ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. తనను ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేని ప్రజాప్రతినిధి రైతుపై తన పీఏతో హత్యాయత్నం కేసు పెట్టించి జైలుకు పంపారు. రైతు తప్పేమీ లేదని ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ పోలీసులతో మాట్లాడారు. ఐజీ ఆదేశంతో విచారణ జరిపిన జిల్లా ఎస్పీ రైతుపై అక్రమంగా కేసు మోపారని తేల్చి బాధ్యుడైన సీఐని వీఆర్‌కు పంపారు. ఐతే పట్టుబట్టి మరీ వెంటనే ఆ సీఐని తన నియోజకవర్గ కేంద్రానికి తెప్పించుకున్నారు.
పాస్‌పుస్తకాల కుంభకోణం ఆరోపణలపై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా ఓ తహశీల్దారును కలెక్టర్ బదిలీగా ఈ నాయకుడు అడ్డుకున్నారు. నియోజకవర్గంలోని వాగులు, నదులను నాయకుడు తన గుప్పిట్లో పెట్టుకున్నారు. వాటిలోని ఇసుక తవ్వి తరలిస్తూ రెండు చేతులా ఆర్జిస్తున్నారు. వైసీపీ నేతల ట్రాక్టర్లు మాత్రమే ఇసుక రవాణా చేయాలని నిబంధన పెట్టారు. ఈ ప్రజాప్రతినిధి అనుచరులే మండలంలో చౌకబియ్యం అక్రమ వ్యాపారం చేస్తున్నారు. పురపాలక సంఘంలోని అన్ని కాంట్రాక్టు పనులను ప్రజాప్రతినిధి వ్యక్తులే చేస్తూ నిధులు బొక్కుతున్నారు.
ఓటమి భయంతోనే సజ్జల అవాకులు- కంటైనర్‌లో ఏం లోడ్ చేశారనేది తేలాల్సిందే: టీడీపీ నేత షరీఫ్ - TDP Leader MA Sharif Press Meet