YSRCP INCHARGES 6TH LIST: పార్టీ ఇన్ఛార్జీల మార్పులతో తాజాగా ఆరో జాబితాను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఇప్పటికే ఐదు జాబితాలు ప్రకటించి 30 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వేటు వేసిన వైఎస్సార్సీపీ తాజా జాబితాలో మరో సిట్టింగ్ ఎమ్మెల్యేపై వేటు వేసింది. నాలుగు పార్లమెంట్, 6 అసెంబ్లీ నియోజకవర్గాలకు కొత్త ఇన్ఛార్జ్లను ప్రకటించింది.
పార్లమెంట్ నియోజకవర్గాలు :
- నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గం - గూడూరి ఉమాబాల
- గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గం - ఉమ్మారెడ్డి రమణ
- రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం - గూడూరి శ్రీనివాస్
- చిత్తూరు పార్లమెంట్ నియోజకవర్గం - రెడ్డప్ప
అసెంబ్లీ నియోజకవర్గాలు :
- జీడీ నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గం - నారాయణస్వామి
- నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం - ఎండీ ఖలీల్
- ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం - బుట్టా రేణుక
- మైలవరం అసెంబ్లీ నియోజకవర్గం - తిరుపతిరావు
- మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం - అన్నా రాంబాబు
- గిద్దలూరు అసెంబ్లీ నియోజకవర్గం - నాగార్జునరెడ్డి
కృష్ణా జిల్లా మైలవరం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను సీఎం జగన్ పక్కన పెట్టారు. మైలవరం అసెంబ్లీ నియోజక వర్గ ఇన్ఛార్జిగా సర్నాల తిరుపతిరావు యాదవ్ ను సీఎం జగన్ నిర్ణయించారు. ప్రస్తుతం మైలవరం జడ్పీటీసీ సభ్యుడిగా ఉన్న తిరుపతి యాదవ్ ను ఎంపీ కేశినేని నాని, మంత్రి జోగి రమేష్ తో చర్చించి ఇన్ఛార్జిగా నిర్ణయించారు.
ప్రకాశం జిల్లాలో రెండు అసెంబ్లీ స్థానాల్లో ఎమ్మెల్యేలను పరస్పరం మార్చారు. మార్కాపురం ఎమ్మెల్యేగా ఉన్న కె. నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు పంపారు. గిద్దలూరు ఎమ్మెల్యేగా ఉన్న అన్నా రాంబాబును మార్కాపురానికి మార్చారు. ఇవాళ ఇరువురు ఎమ్మెల్యేలతో చర్చించిన సీఎం అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్న అనిల్ కుమార్ యాదన్ ను ఇప్పటికే నరసారావుపేట పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా పంపగా, నెల్లూరు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నెల్లూరు సిటీ డిప్యూటీ మేయర్ గా ఉన్న ఎండీ ఖలీల్ ను ప్రకటించారు.