YSRCP Govt Deal With SECI : సెకి విద్యుత్‌కు ఐఎస్‌టీఎస్ ఛార్జీల విషయంలో గత వైఎస్సార్సీపీ సర్కార్ చెప్పినవన్నీ అవాస్తవాలేనని తేలింది. ఈ ఛార్జీల విషయంలో కేంద్రం ఇచ్చే రాయితీ కొంత మాత్రమేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఒక్కో మెగావాట్‌కు లభించే రాయితీ రూ.4 లక్షలేనని తెలిపారు. ప్రతి మెగావాట్‌కు సంవత్సరానికి రూ.52 లక్షలు కట్టాల్సిందేనని తేల్చారు. ఒక ఏడాదిలో పడే ఐఎస్‌టీఎస్ భారం రూ.3757 కోట్లుగా ఉంటుందని ఏటా 4 శాతం పెరిగితే పాతికేళ్లలో రూ.1.56 లక్షల కోట్ల భారం పడుతుందని నిపుణులు నిగ్గు తేల్చారు.
ఒక రాష్ట్రంలో ఉత్పత్తైన విద్యుత్‌ను ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసేందుకు నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు చెందిన లైన్‌లు వాడుకున్నందుకు చెల్లించాల్సిన మొత్తాన్ని ఐఎస్‌టీఎస్ ఛార్జీలు అంటారు. కరెంట్ వినియోగించుకునే రాష్ట్రాలపైనే ఈ భారం పడుతుంది. పీపీఏలు కుదుర్చుకున్నప్పుడు ఈ ఛార్జీలను కూడా కలిపే యూనిట్ ధరను నిర్ణయించాలి. సెకి నుంచి తీసుకునే కరెంట్‌కు కేంద్ర ప్రభుత్వం ఐఎస్‌టీఎస్ ఛార్జీల నుంచి పూర్తి మినహాయింపు ఇస్తుందని అప్పట్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం తెగ ఊదరగొట్టింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్దిష్ట కాలంలో ఎంత విద్యుత్‌ను డ్రా చేసుకునేందుకు నేషనల్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్‌కు చెందిన లైన్‌లను ఎంత మేరకు వాడుకుంది, దానిలో ఐఎస్‌టీఎస్ మినహాయింపు వర్తించే పునరుత్పాదక ప్రాజెక్టుల నుంచి వచ్చిన విద్యుత్ ఎంత శాతం అన్నది లెక్కిస్తారు.
హార్ట్ ఎటాక్‌ను నిరోధించే కాప్స్యూల్ - బాపట్ల ఫార్మసీ కళాశాల బృందానికి పేటెంట్
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం ఐఎస్‌టీఎస్ ఛార్జీల్లో 10 శాతం మాత్రమే మినహాయింపు వర్తిస్తోంది. సెకి నుంచి తీసుకునే 7000ల మెగావాట్లను కలిపినా ఈ మినహాయింపు 20 శాతానికి మించదని నిపుణుల అంచనా. సోషలైజేషన్ ఛార్జీలను లెక్కించాక ఏపీకి ఇచ్చే మినహాయింపు ఆ 20 శాతం కూడా ఉండదని నిపుణులు అంటున్నారు. ఒక రాష్ట్రం గడచిన మూడేళ్లలో సెంట్రల్ లైన్‌ల ద్వారా ఎంత విద్యుత్ తీసుకుందో వాటి సగటు లెక్కించి దాన్ని ఆ రాష్ట్ర కాంట్రాక్టెడ్ కెపాసిటీగా నిర్ణయిస్తారు.
జలాశయాల్లో ఆడుకుందామనుకుంటున్నారా? - అయితే షికారుకు సిద్దంకండి
YSRCP Govt on SECI Deal : 2024లో ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్టెడ్ కెపాసిటీ 4516 మెగావాట్లు. కానీ ఆయా రాష్ట్రాల కాంట్రాక్టెడ్ కెపాసిటీ ఎంతుంటే అంత విద్యుత్‌ను కచ్చితంగా డ్రా చేయాలన్న నియమం లేదు. వాటి అవసరాన్ని బట్టి తీసుకుంటాయి. తమకు ఏ సమయంలో ఎంత కరెంట్ కావాలన్నదానిపై ప్రతి రాష్ట్రం ఒక షెడ్యూల్‌ను ఇస్తుంది. కాంట్రాక్టెడ్ కెపాసిటీలో 75 శాతానికి గానీ, ఆ రాష్ట్రం ఇచ్చిన షెడ్యూల్‌లో పేర్కొన్న మొత్తానికి గానీ ఏది ఎక్కువైతే దాన్నిబట్టి ఐఎస్‌టీఎస్ ఛార్జీలు వర్తింపజేస్తారు.
కూర వండి యూట్యూబ్‌లో వీడియో పెట్టాడు - కట్ చేస్తే పోలీసులు అరెస్టు చేశారు!
ఒక రాష్ట్రానికి సెంట్రల్ లైన్‌ల ద్వారా ప్రతి పావుగంటకు సరఫరా అయిన విద్యుత్‌లో పునరుత్పాదక ఇంధన వనరుల నుంచి వచ్చిన కరెంట్ ఎంత శాతం ఉందో లెక్కించి దాన్నిబట్టి ఐఎస్‌టీఎస్ ఛార్జీల నుంచి ఎంత రాయితీ వస్తుందో లెక్కిస్తారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం సగటున 3387 మెగావాట్లకు ఐఎస్‌టీఎస్ చెల్లించాలి. దీనిలో పునరుత్పాదక విద్యుత్‌పై వస్తున్న రాయితీ 10.046 శాతం ఉంది. ఈ రాయితీని మొత్తం 3387 మెగావాట్లకూ వర్తింపజేస్తారు.