ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయని వైసీపీ- ప్రభుత్వం అలసత్వంతో 15గ్రామాల ప్రజలకు కష్టాలు - YSRCP ignored Bridge approach roads - YSRCP IGNORED BRIDGE APPROACH ROADS

YSRCP Government Ignored in Construction of Approach Roads: రెండు జిల్లాలను కలిపే వంతెన మీద నిత్యం వాహనదారులు రాకపోకలు సాగిస్తుంటారు. టీడీపీ ప్రభుత్వంలో బ్రిడ్జి నిర్మాణం పూర్తవ్వగా అప్రోచ్ రోడ్లను పూర్తి చేయడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వాహనదారులు అంటున్నారు.వంతెనకు అనుసంధానంగా కొంత రోడ్డు వేసి మిగిలిన నిర్మాణం వదిలేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

YSRCP Government Ignored in Construction of Approach Roads
YSRCP Government Ignored in Construction of Approach Roads

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 8, 2024, 1:44 PM IST

YSRCP Government Ignored in Construction of Approach Roads:రెండు జిల్లాలను కలిపే వంతెన అది. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగిస్తుంటారు. అంతటి ప్రాధ్యానత కలిగిన ఈ బ్రిడ్జి నుంచి అప్రోచ్ రోడ్ల నిర్మాణంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఫలితంగా సమీప గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అలసత్వం కృష్ణా జిల్లాలోని 15గ్రామాల ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టింది.

అప్రోచ్ రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయని వైసీపీ- ప్రభుత్వం అలసత్వంతో 15గ్రామాల ప్రజలకు కష్టాలు

గుంతలు, పైకి తేలిన కంకర రాళ్లు - 50 కిలోమీటర్ల రోడ్డు - వాహనదారుల ఇబ్బందులు - kurnool road damag

కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలను కలుపుతూ ఉప్పుటేరు కాలువపై గొల్లపాలెం, కాళీపట్నం గ్రామాల మధ్య 2012లో కాంగ్రెస్‌ సర్కార్‌ హయాంలో రూ.26 కోట్ల అంచనా వ్యయంతో వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కొంత నిర్మాణ సామాగ్రి కూడా సిద్ధం చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం పనులు చేపట్టి 2019 ఫిబ్రవరి నాటికి వంతెనను పూర్తి చేసింది. అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి కూడా చర్యలు చేపట్టింది. కానీ భూసేకరణ సమస్యతో కొంత జాప్యం జరిగింది. ఈ సమయంలోనే 2019 ఎన్నికలు వచ్చి వైసీపీ అధికారంలోకి రావడంతో వంతెన అప్రోచ్ రోడ్ల నిర్మాణం మూలకుపడింది.

వేసిన 3 నెలలకే పెచ్చులూడిపోయిన రోడ్డు - ఓట్ల కోసమే వేశారని స్థానికుల ఆగ్రహం - వీడియో వైరల్​ - Road conditions in tribal villages

కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం కృత్తి వెన్ను మండలంలోని దాదాపు 15 గ్రామాల ప్రజలు ఏ చిన్న అవసరం వచ్చినా ఈ వంతెనపై నుంచే భీమవరం, నర్సాపురం వెళ్తుంటారు. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ప్రజలు కూడా ఇటు వైపు రాకపోకలు సాగిస్తుంటారు. ఇంతటి కీలకమైన వంతెనకు అప్రోచ్ రోడ్లు లేక వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. భూ సమస్య వల్ల వంతెనను కలుపుతూ అప్రోచ్ రోడ్డు లేకుండా వాహనాలు ప్రయాణం చేసేందుకు రెండు, మూడు వంకర్లు తిప్పుతూ చిన్న రోడ్లును వేశారు. దీనిపై భారీ వాహనాలు వెళ్లే అవకాశం లేదు. వంతెనకు అనుసంధానంగా కొంత రోడ్డు వేసి మిగిలిన నిర్మాణం వదిలేయడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.

ఎంత దారుణమైన పరిస్థితి అంటే గర్భిణులను సైతం ఈ రోడ్డు మార్గంలో తీసుకువెళ్లడానికి ఆటోలు కూడా రావు. ప్రారంభించి ఐదు సంవత్సరాలు పూర్తి కాకుండానే గుంతలు పడ్డాయి. గ్రామంలోకి అంబులెన్సు కూడా రావటానికి లేకుండా రహదారులు అంత దారుణంగా ఉన్నాయి. -వాహనదారులు

ప్రారంభించి ఐదు సంవత్సరాలు కాకుండానే వంతెనపై గోతులు పడ్డాయని వాహనదారులు చెబుతున్నారు. కృత్తివెన్ను మండలంలోని పడతడికా, పొడు, పెద్ద గొల్లపాలెం, ఒర్లగొంది తిప్ప, నిడమర్రు, ఎటి పవర్, పల్లెపాలెం సహా అనేక గ్రామాల ప్రజలు ద్విచక్ర వాహనాలపైనే ప్రయాణించాల్సి వస్తోందని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఊరు దాటాలంటే కష్టాలు తప్పడం లేదని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అడుగుకో గొయ్యి - గజానికో గుంతో అధ్వానంగా రాష్ట్ర రహదారులు - Road conditions in Krishna district

ABOUT THE AUTHOR

...view details