కౌలు రైతుల కష్టాలు - రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు కొర్రీలు YSRCP Government Failed to Support Farmers : కౌలు రైతులందర్ని ఆదుకుంటాం గుర్తింపు కార్డులు ఇస్తామంటూ ప్రతిపక్ష నేతగా పాదయాత్ర సమయంలో జగన్ ఇచ్చిన హామీ ఇదీ. అధికారంలోకి వచ్చాక సగం మందికే గుర్తింపు కార్డులిచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకుంది. పూర్తిగా కాకపోయినా సగం మందికైనా రుణాలు ఇచ్చిందా అంటే అదీలేదు. రకరకాల కొర్రీలతో వారిని ఊరించి ఉసూరుమనిపిస్తోంది. పంట సాగు కోసం బయట అధిక వడ్డీకి అప్పులు చేసిన కౌలు రైతు తిరిగి చెల్లించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అకాల వర్షాలతో అన్నదాతలు విలవిల- వేలాది ఎకరాల్లో పంట నష్టం - Unseasonal Rains Damage Crops
రాష్ట్రంలో 16 లక్షలకు పైగా కౌలు రైతులు ఉన్నారని అంచనా వేసిన ప్రభుత్వం కేవలం 8 లక్షల మందికే గుర్తింపు కార్డులు ఇచ్చింది. బ్యాంకుల నుంచి రుణాలు వస్తాయని గుర్తింపు కార్డులున్న రైతులు ఆనందపడ్డారు. కానీ రుణాలు మంజూరులో ప్రభుత్వం మెలిక పెట్టింది. భూ యజమాని సంతకం ఉంటేనే కౌలు రైతులకు రుణాలు మంజూరు చేస్తామని చెబుతోంది. అనేక అపోహలు, భయాలతో కౌలు రుణాల కోసం సంతకం చేసేందుకు భూ యజమానులు భయపడుతున్నారు. బ్యాంకులు కూడా కౌలు రైతులకు రుణాలు ఇచ్చేందుకు అనేక కొర్రీలు పెడుతున్నాయి. కౌలు రైతుల్లో అత్యధిక మంది సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వారే ఉన్నారు.
రాష్ట్రంలో 8 లక్షల మందికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు వచ్చినా లక్ష మంది కూడా రుణాలు ఇచ్చింది లేదు. ప్రభుత్వం కార్డులు ఇచ్చిన దానికి రుణాలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. బ్యాంకర్స్ కమిటీ నిర్ణయించిన విధంగా బ్యాంకు మేనేజర్లు రుణాలు ఇవ్వడానికి ఏ మాత్రం సిద్ధంగా లేరు. పంట సాగు చేస్తున్న వారికి కాకుండా భూయజమానులకు పంట రుణాలు ఇస్తున్నారు. భూమిలో పంట వేయకుండా రుణాలు తీసుకుంటే నేరం. భూయజమానులకు మాత్రమే రుణాలు ఇచ్చి మాటార్గెట్ పూర్తైందని బ్యాంకు మేనేజర్లు చేతులు దులుపుకుంటున్నారు. బ్యాంకులు రుణాలు చెల్లించిన వారికి మళ్లీ రుణాలు అడిగితే ఇవ్వట్లేదు. బ్యాంకర్లు ఇతోదికంగా కౌలు రైతులకు రుణాలు ఇవ్వాలి. -హరిబాబు, రాష్ట్ర కౌలు రైతు సంఘం ప్రధాన కార్యదర్శి
ధాన్యం అమ్మాం - డబ్బులు ఎక్కడ ? - ప్రభుత్వ తీరుపై రైతుల ఆవేదన
రుణాలు మంజూరు చేయని బ్యాంకులు: ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన రైతు భరోసా కేంద్రాలు కౌలు రైతులకు ఉపయోగపడటం లేదు. పంటను అమ్ముకునేందుకు గుర్తింపు కార్డులు లేని కౌలు రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. పంట సాగు కోసం అధిక వడ్డీకి అప్పులు చేసి సకాలంలో చెల్లించక కౌలు రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. తెచ్చిన అప్పులు కట్టలేక, పెట్టిన పెట్టుబడి రాక అనేక మంది కౌలు రైతులు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. కౌలుకు తీసుకున్న పొలంపై పదకొండు నెలలు మాత్రమే పంట సాగుచేసుకోవాల్సి ఉంటుంది. అప్పటిలోగా రెండు పంటలు పండించుకోవాలి. వర్షధారం మీద ఆధారపడే భూముల్లో కేవలం ఒక్క పంట మాత్రమే సాగవుతుంది. సాధారణ రైతులకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రకాల సౌకర్యాలు కౌలు రైతులకు అందింతే ఆర్థికంగా మేలు జరుగుతుంది. వాస్తవ పంట సాగుదారుకే బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.
గోదావరి డెల్టాలో సాగునీటి సంక్షోభం - సాగునీరందక ఎండిపోతున్న వరిపైరు - Water Crises in Godavari Delta