YS Sunitha Meets Kadapa SP:మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి, కడప ఎస్పీ కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ ని కలిశారు. వివేకానంద రెడ్డి కేసులకు సంబంధించి అంశాలపై దాదాపు గంట పాటు ఎస్పీతో ఇరువురు సుదీర్ఘంగా చర్చించారు. వివేక హత్య కేసులో తమ కుటుంబానికి తాజాగా ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు, వివేక పీఏ కృష్ణారెడ్డి తమపైన అనవసరంగా కేసులు నమోదు చేయించారని ఎస్పీకి తెలియజేశారు.
ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు: వైఎస్సార్సీపీ నాయకుల ప్రోద్భలంతోనే కృష్ణారెడ్డి పులివెందుల కోర్టులో ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేసి కేసులు పెట్టారని సునీత వెల్లడించారు. తన తండ్రిని పోగొట్టుకున్న సమయంలో నిందితులను పట్టుకునేందుకు న్యాయ పోరాటం చేస్తున్నామని తెలిపారు. అలాంటిది తమపైనే వైఎస్సార్సీపీ పెద్దలు తమను ఇబ్బంది పెట్టేందుకు శత విదాల ప్రయత్నిస్తున్నారని ఎస్పీకి వివరించారు. ఇదే సందర్భంలోనే పులివెందులకు చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు వర్రా రవీందర్ రెడ్డి ఇటీవల ఫేస్బుక్లో తన పైన, షర్మిల పైన అసభ్యకరమైన పోస్టులు పెట్టి పరువు తీసే విధంగా చేశారని ఎస్పీకి వివరించారు. ఇలాంటి వారందరి పైన దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఎస్పీని సునీత కోరారు.
వివేకా హత్య కేసు ఏ5 శివశంకర్‌రెడ్డి బెయిల్‌పై విచారణ- తీర్పు వాయిదా
అవసరమైన చర్యలు తీసుకుంటాం: తాజాగా వివేక కేసులో అప్రూవర్ గా ఉన్న దస్తగిరికి బెయిలు మంజూరైనప్పటికీ, అతన్ని బయటికి రాకుండా పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నట్లు తమకు తెలిసిందని సునీత ఎస్పీకి వివరించారు. సునీత రాజశేఖర్ రెడ్డి చెప్పిన అన్ని విషయాలను కూలంకశంగా విన్న ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గత కొంతకాలంగా సునీత, వైఎస్ జగన్‌తో పాటుగా అతని సోదరుడు అవినాషన్ రెడ్డిని రాజకీయంగానూ ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది. ఆ నేపథ్యంలోనే కడప లోక్‌సభకు కాంగ్రెస్ పార్టీ తరపున సునీతను పోటీ చేస్తారని వార్తలు వినిపించాయి.
చివరి వరకూ రవి ఆశయం కోసం పని చేస్తాం: పరిటాల సునీత
ఇప్పటికే ఫేస్బుక్లో వేదింపులపై హైదరాబాద్‌లో ఫిర్యాదు: ఇప్పటికే సునీత తన తండ్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పోరాటం చేస్తున్నారు. ఈ కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. వైఎస్ భాస్కరరెడ్డితో పాటు మరికొంతమంది జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉండగా, వైఎస్ అవినాష్‌రెడ్డి బెయిల్ తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో గత నెలలో తనకు ప్రాణహాని ఉందని వైఎస్ సునీత, హైదరాబాద్‌లోని సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొంత కాలం నుంచి కొందరు వ్యక్తులు ఫేస్బుక్లో చంపుతామంటూ పోస్టులు పెడుతున్నారని వారిపై తగిన చర్యలు తీసుకోవాలని సునీత ఫిర్యాదులో పేర్కొన్నారని చంపేస్తామని అర్థం వచ్చే విధంగా ఆ పోస్టులు ఉన్నాయని ఆమె ఫిర్యాదు చేశారని డీసీపీ తెలిపారు. ఈ తరహా బెదిరింపులు ఎక్కువవుతున్నాయని, చర్యలు తీసుకోవాలని వైఎస్ సునీత ఫిర్యాదులో వివరించారు.
అన్నపై పోటీకి సిద్ధం! - సునీత కాంగ్రెస్‌లో చేరేందుకు డేట్ ఫిక్స్!