YS Sharmila Fire on YSRCP Party : జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీలన్నీ ఫ్యాన్ గాలికి కొట్టుకుపోయాయని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఎద్దేవా చేశారు. వైసీపీ ముఖ్య నాయకులంతా ఒక ముఠాగా తయారై అధికారాన్ని అక్రమాలకు వినియోగించారని విమర్శించారు. ఈనాటికీ కడపలో అభివృద్ధి అంటే వైఎస్సార్ గుర్తుకు వస్తారని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కడప పట్టణంలో షర్మిలా పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైసీపీ గడిచిన ఐదేళ్ల కాలంలో కడపలో ఎటువంటి అభివృద్ధి చేయలేదని మండిపడ్డారు. కనీసం కడప ప్రజలకు మంచినీళ్లు ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. కడప అభివృద్ధిని విస్మరించిన జగన్‌కి, అవినాష్ రెడ్డికి ఓటెందుకు వేయ్యాలో ఆలోచించాలని ప్రజలను షర్మిలా కోరారు.
అద్దంలో కూడా చంద్రబాబే కనిపిస్తున్నారా?- జగన్ మానసిక పరిస్థితి ఆందోళనకరం : షర్మిల
రిజర్వేషన్లను రద్దు చేయానలి బీజేపీ కుట్రలు చేస్తుంది : రాష్ట్రంలో వైసీపీ, టీడీపీ పార్టీలు రెండు కూడా బీజేపీకి తొత్తులుగా, బానిసలుగా మారాయని షర్మిల విమర్శించారు. అలాగే బీజేపీ ఈ దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతుందని మండిపడ్డారు. బీజేపీ మతాల పేరులో వేరు చేసి, వాటి మధ్య మంటలు పెడుతుందని ఎద్దేవా చేశారు. ఆ మంటల్లో బీజేపీ చలి కాచుకుటుందని షర్మిల ఘాటుగా వ్యాఖ్యానించారు. అలాగే ముస్లింలకు వైఎస్సార్ 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చారని వెల్లడించారు. ఇప్పుడు ఆ రిజర్వేషన్లను బీజేపీ రద్దు చేయాలని కుట్రలు చేస్తుందని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికి న్యాయం కోసం వివేకా ఆత్మ ఘోషిస్తుంది :వివేకనంద హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డికే జగన్ మళ్లీ ఎంపీ టికెట్ ఇచ్చారని మండిపడ్డారు. వివేకాను అవినాష్ రెడ్డినే హత్య చేయించినట్లు సీబీఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నయని గుర్తుచేశారు. జగన్ తన పదవిని అడ్డుపెట్టుకుని హత్య కేసు నిందితులను కాపాడుతున్నారని మండిపడ్డారు. చట్టసభల్లో హంతకులు అడుగుపెడితే ఇక ప్రజాస్వామ్యం అనేది ఉంటుందా? అని ప్రశ్నించారు. అందుకే అలాంటి వ్యక్తులను అడ్డుకోవడానికే నేను పోటీ చేస్తున్నని స్పష్టం చేశారు. ప్రజాలకు మంచి చేయాలని ఎప్పుడు ఆలోచించే వ్యక్తి వివేకానంద. అలాంటి వ్యక్తిని రాజకీయాల కోసం అన్యాయంగా పోట్టన పెట్టుకున్నారని వాపోయారు. ఇప్పటికి న్యాయం కోసం వైఎస్ వివేకా ఆత్మ ఘోషిస్తుందని తెలిపారు. ప్రజలు వైసీపీ చేస్తున్న రాజకీయ కుట్రలను గమనించి హస్తం గుర్తుకు ఓటేసి కడప ఎంపీగా నన్ను గెలిపించాలని షర్మిల ప్రజలను కోరారు.
వివేకాను హత్య చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు : అలాగే కడప ఎంపీగా బరిలో నిలిచిన షర్మిలని గెలిపిస్తేనే తన తండ్రి వివేకానందరెడ్డి ఆత్మకు శాంతి కలుగుతుందని ఆయన కుమార్తె సునీత అన్నారు. వైఎస్సార్ జిల్లా కొండాపురంలో ఈరోజు రోడ్‌షో నిర్వహించారు. కడప ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థిగా షర్మిల, జమ్మలమడుగు అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాముల బ్రహ్మానందరెడ్డి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, వైయస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉన్న సమయంలో వివేకాను హత్య చేసి ఉంటే ఆయన వారిని వదిలిపెట్టేవారా? అని ప్రశ్నించారు. అన్నదమ్ములు మన మధ్యన లేకపోయినా వారికి న్యాయం చేసేందుకు మనకు ఒక అవకాశం ఉందని చెప్పారు. ఈనెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో రెండు ఓట్లను కాంగ్రెస్ పార్టీకి వేసి గెలిపించుకుంటే నిందితులను శిక్షపడేలా చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. వివేకానంద రెడ్డిని హత్య చేసిన నిందితులను వదిలే ప్రసక్తే లేదని మరోసారి సునీత స్పష్టం చేశారు.
మద్యనిషేధం చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమా?- జగన్‌కు షర్మిల మూడో లేఖ - Sharmila letter to jagan
వైఎస్ఆర్ తమ్ముడిని హత్య చేశారు - హంతకులను కాపాడుతున్నది వైఎస్ జగన్: షర్మి ల - YS Sharmila criticized Jagan
జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ గాలికి కొట్టుకుపోయాయి : వైఎస్ షర్మిల (ETV BHARAT)