YS Rajasekhara Reddy Birth Anniversary: తెలుగు రాష్ట్రాల్లో వైఎస్ అభిమానులకు కొదవలేదని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. వైఎస్‌ను తామంతా కుటుంబసభ్యుడిలా భావిస్తామని తెలిపారు. ఎన్ని ఏళ్లు గడిచినా వైఎస్‌ను మరిచిపోలేమన్న రేవంత్‌రెడ్డి, 2007లో వైఎస్ ముందు అనేక విషయాలు ప్రస్తావించానని గుర్తు చేసుకున్నారు. మండలిలో మాట్లాడినప్పుడు వైఎస్ తనను ప్రోత్సహించేవారన్నారు. కొత్త సభ్యుల మాటలు కూడా వినాలని వైఎస్ చెప్పేవారని, ప్రతిపక్ష సభ్యుల విషయంలోనూ ఉదారంగా ఉండేవారని కొనియాడారు. కార్మికులు, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు వైఎస్ ప్రయత్నించేవారన్నారు.
చేవెళ్ల-ఇచ్ఛాపురం పాదయాత్రతో 2004లో వైఎస్ అధికారంలోకి వచ్చారన్న రేవంత్, ఏ పదవీ రాకున్నా కూడా వైఎస్ పార్టీని వదల్లేదని తెలిపారు. ఈ రాష్ట్రంలో షర్మిల అలుపెరగని పోరాటం చేస్తున్నారని, 1999లో వైఎస్ పోషించిన పాత్రను షర్మిల ఇప్పుడు పోషిస్తుందని ప్రశంసించారు. ఏపీలో ప్రతిపక్షమే లేదన్న రేవంత్‌రెడ్డి, బాబు, జగన్, పవన్ అందరూ పాలకపక్షమే అని విమర్శించారు. ఏపీలో ప్రతిపక్ష నేత పాత్ర షర్మిల పోషిస్తున్నారని అన్నారు.
'వైనాట్ కాంగ్రెస్'- పార్టీ పునరేకీకరణ దిశగా షర్మిల - Sharmila focus on YSRCP cadre
వైఎస్ జయంతి సభకు వెళ్లాలని రాహుల్, ఖర్గే తనను కోరారన్న రేవంత్, అనివార్య కారణాల వల్ల ఖర్గే ఈ సభకు రాలేకపోయారని తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి సి.కె.కన్వెన్షన్ సెంటర్‌లో ఏపీసీసీ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్ జయంతి సభ నిర్వహించారు. వైఎస్‌ఆర్ జయంతిలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి పాల్గొన్నారు. వారితో పాటు మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, పొన్నం, కొండా సురేఖ, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌ఛార్జి దీపాదాస్ మున్షీ తతితరులు పాల్గొన్నారు.
కడప నుంచే మళ్లీ పోరాటం ప్రారంభిద్దాం: 2029లో కాంగ్రెస్‌దే అధికారమని, షర్మిల సీఎం అవుతారని రేవంత్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. రాహుల్ ప్రధాని కావాలని వైఎస్ ఎప్పుడూ అనేవారన్న రేవంత్‌రెడ్డి, ఎంత కష్టమైనా షర్మిల ముళ్లబాట ఎన్నుకున్నారని తెలిపారు. నూటికి నూరుశాతం షర్మిలకు తోడుగా ఉంటామని, వైఎస్ అభిమానులకు అండగా ఉంటామని చెప్పేందుకే అందరం కలిసి వచ్చామన్నారు. కడపలో ఉపఎన్నికలు వస్తే ఊరూరా తిరిగే బాధ్యత తీసుకుంటానన్న, వైఎస్ స్వస్థలం కడప నుంచే మళ్లీ పోరాటం ప్రారంభిద్దామని పిలుపునిచ్చారు.
నేడు వైఎస్సార్ 75వ జయంతి - ఇడుపులపాయలో వేర్వేరుగా నివాళులర్పించిన జగన్, షర్మిల - YSR 75th Birth Anniversary
YS Sharmila Comments: వైఎస్ పేరు వినగానే చిరునవ్వు, రాజసం గుర్తుకొస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఆదరించిన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలని వైఎస్ అనేవారని, జలయజ్ఞం నాన్నకు చాలా ఇష్టమైన కార్యక్రమమని షర్మిల గుర్తు చేసుకున్నారు. అధికారం వచ్చాక కొందరు ప్రజలకు దూరం అవుతారన్న షర్మిల, ఎన్నో పథకాలు తెచ్చి ప్రజల గుండెల్లో వైఎస్ చోటు సంపాదించారన్నారు.
వైఎస్ చివరి కోరిక తీర్చడం మనందరి బాధ్యత: కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రానికి, దేశానికి మంచి చేస్తుందని వైఎస్ నమ్మేవారని, వైఎస్ వారసులం అనేవారు బీజేపీతో తెరవెనుక పొత్తులు పెట్టుకున్నారని విమర్శించారు. అలాంటివారు వైఎస్ రాజశేఖరరెడ్డి వారసులు ఎలా అవుతారని ప్రశ్నించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలని వైఎస్ అనేవారని, జోడో యాత్రకు వైఎస్ పాదయాత్రే స్ఫూర్తి అని రాహుల్ చెప్పారన్నారు. వైఎస్ చివరి కోరిక తీర్చడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. వైఎస్ జయంతి సందర్భంగా సందేశం పంపిన సోనియా, రాహుల్‌కు వైఎస్ షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.
రాజశేఖర్‌రెడ్డి అసలైన ప్రజా నాయకుడు - ఆయన స్ఫూర్తితోనే జోడో యాత్ర: రాహుల్ - rahul gandhi Released Video on YSR